హోం మంత్రిత్వ శాఖ

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2023


సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2023 కోసం సంస్థాగత విభాగంలో ఎంపిక చేయబడ్డ ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మరియు మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్‌

విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశంలోని వ్యక్తులు మరియు సంస్థలు అందించిన అమూల్యమైన సహకారం మరియు నిస్వార్థ సేవలను గుర్తించి, గౌరవించటానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది.

Posted On: 23 JAN 2023 12:28PM by PIB Hyderabad

2023 సంవత్సరానికి సంబంధించి ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఓఎస్‌డిఎంఏ) మరియు మిజోరాంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ (ఎల్‌ఎఫ్‌ఎస్‌), విపత్తు నిర్వహణలో వారి అద్భుతమైన పనికి గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2023కి ఎంపిక చేయబడ్డాయి.

విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశంలోని వ్యక్తులు మరియు సంస్థలు అందించిన అమూల్యమైన సహకారాన్ని మరియు నిస్వార్థ సేవలను గుర్తించి, గౌరవించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అనే వార్షిక అవార్డును ఏర్పాటు చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రకటిస్తారు. ఈ అవార్డు కింద  సంస్థ అయితే రూ. 51 లక్షలు మరియు  సర్టిఫికేట్  వ్యక్తి అయితే రూ. 5 లక్షలు మరియు సర్టిఫికేట్ అందిస్తారు. కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశంలో విపత్తు నిర్వహణ పద్ధతులు, సంసిద్ధత, ఉపశమనం మరియు ప్రతిస్పందన విధానాలను గణనీయంగా మెరుగుపడ్డాయి. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణనష్టం గణనీయంగా తగ్గింది.

2023 సంవత్సరం అవార్డు కోసం, జూలై 1, 2022 నుండి నామినేషన్లు అభ్యర్థించబడ్డాయి. 2023 సంవత్సరానికి సంబంధించిన అవార్డు పథకం ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయబడింది. అవార్డు పథకానికి ప్రతిస్పందనగా సంస్థలు మరియు వ్యక్తుల నుండి 274 చెల్లుబాటు అయ్యే నామినేషన్లు స్వీకరించబడ్డాయి.

విపత్తు నిర్వహణ రంగంలో 2023 అవార్డు విజేతల అత్యుత్తమ పని సారాంశం క్రింది విధంగా ఉంది:

 

  1. సూపర్ సైక్లోన్ తర్వాత 1999లో  ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఓఎస్‌డిఎంఏ) స్థాపించబడింది. ఓఎస్‌డిఎంఏ ఒడిశా డిజాస్టర్ రెస్పాన్స్ యాక్షన్ ఫోర్స్ (ఓడిఆర్‌ఏఎఫ్), మల్టీ-హాజర్డ్ ఎర్లీ వార్నింగ్ సర్వీస్ (ఎంహెచ్‌ఈడబ్ల్యుఎస్) ఫ్రేమ్‌వర్క్ మరియు "స్టార్టక్‌" (సిస్టమ్ కోసం)  అత్యాధునిక సాంకేతికతతో కూడిన వెబ్/స్మార్ట్‌ఫోన్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌తో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభించింది. డైనమిక్ రిస్క్ నాలెడ్జ్ ఆధారంగా విపత్తు ప్రమాద సమాచారాన్ని అంచనా వేయడం, ట్రాకింగ్ చేయడం మరియు అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఓఎస్‌డిఎంఏ వివిధ తుఫానులు, హుద్‌హుద్ (2014), ఫణి (2019), అంఫాన్ (2020) మరియు ఒడిశా వరదలు (2020) సమయంలో సమర్థవంతమైన ప్రతిస్పందనను అందించింది.  381 సునామీ పీడిత గ్రామాలు/వార్డులు మరియు తీరప్రాంతం నుండి 1.5 కి.మీ దూరంలో ఉన్న 879 బహుళ ప్రయోజన తుఫాను/వరద షెల్టర్‌లలో కమ్యూనిటీ పునరుద్ధరణను నిర్మించడంలో విపత్తు సంసిద్ధత కార్యక్రమాలను ఓఎస్‌డిఎంఏ నిర్వహించింది.
  2. మిజోరాంలోని లుంగ్లీ అగ్నిమాపక కేంద్రం 24 ఏప్రిల్ 2021న లుంగ్లే పట్టణాన్ని చుట్టుముట్టిన జనావాసాలు లేని అటవీ ప్రాంతాల్లో 10 కంటే ఎక్కువ గ్రామాలకు వ్యాపించిన భారీ అడవి మంటలపై సమర్ధవంతంగా  స్పందించింది. స్థానికుల సహాయంతో లుంగ్లీ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది 32 గంటలకు పైగా నిరంతరం పనిచేశారు. ఆ సమయంలో వారు నివాసితులకు అక్కడికక్కడే శిక్షణను అందించారు. మంటలను ఆర్పడంలో అగ్నిమాపక మరియు అత్యవసర సిబ్బంది  సాహసోపేతమైన, ధృడమైన మరియు సత్వర ప్రయత్నాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా నిరోధించబడింది.


 

*****



(Release ID: 1893160) Visitor Counter : 349