యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఫిబ్రవరి 6 నుండి 8 వరకు గౌహతిలో యూత్20 గ్రూప్ మొదటి సమావేశం
అస్సాంలోని 34 జిల్లాల్లోని 50కి పైగా కాలేజీలు & యూనివర్శిటీల నుండి దాదాపు 12,000 మంది విద్యార్థులు రాబోయే కొద్ది రోజుల్లో జరిగే సమ్మిట్‌లోని ఐదు ఇతివృత్తాలపై చర్చించనున్నారు
ఈ చర్చల సారం మరియు సూచనలు వై20 సమావేశంలోని ప్రతినిధులతో పంచుకోబడతాయి
అస్సాం నుండి ఎంపిక చేసిన 400 మంది విద్యార్థులు ఫిబ్రవరి 7వ తేదీన ఐఐటి-గౌహతిలో జరిగే సెంట్రల్ ఈవెంట్‌లో పాల్గొంటారు
Posted On:
22 JAN 2023 2:06PM by PIB Hyderabad
జీ20 సమ్మిట్‌లో భాగంగా భారతదేశం మొదటిసారిగా యూత్20 (వై20) శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. వై20 గ్రూప్ యొక్క మొదటి సమావేశం గౌహతిలో 6 ఫిబ్రవరి, 2023వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. ఆగస్టు 2023లో జరిగే చివరి యూత్-20 సమ్మిట్‌కు ముందు.. భారతదేశ వ్యాప్తంగా ఐదు వై20 థీమ్‌లపై జరిగే వివిధ సమావేశాలలో ఇది మొదటిది. అస్సాంలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. వాతావరణ మార్పు మరియు విపత్తు ప్రమాద తగ్గింపు; శాంతి నిర్మాణం, సయోధ్య; ప్రజాస్వామ్యం మరియు ఆరోగ్యం, శ్రేయస్సు మరియు క్రీడలలో యువత వంటి ఫ్యూచర్ ఆఫ్ వర్క్ యొక్క ఐదు థీమ్‌లపై ఈ సమావేశం దృష్టి పెడుతుంది. జీ20 గొడుగు కింద ఉన్న ఎనిమిది అధికారిక నిశ్చితార్థ సమూహాలలో యూత్20 ఒకటి. జీ20 రొటేటింగ్ ప్రెసిడెన్సీ (అతిథ్య అధ్యక్షత) యూత్ సమ్మిట్‌ను నిర్వహించే బాధ్యతను కలిగి ఉంటుంది, ఇది సాధారణంగా సంప్రదాయ ఫోరమ్‌కు కొన్ని వారాల ముందుగా.. యువత ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి, వారి స్వంత విధాన ప్రతిపాదనలలో వారి సూచనలను పొందుపరచడానికి వీలుగా జరుగుతుంది. ఇది జీ20 ప్రభుత్వాలు మరియు వారి స్థానిక యువత మధ్య అనుసంధానాన్ని కలిగించే ప్రయత్నం. 2023లో జరిగే వై20 ఇండియా సమ్మిట్ భారతదేశం యొక్క యువత-కేంద్రీకృత ప్రయత్నాలను ఉదాహరణగా చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు దాని విలువలు మరియు విధానపరమైన చర్యలను ప్రదర్శించడానికి ఇది తగిన అవకాశాన్ని కల్పిస్తుంది. వై 20 సమావేశానికి ముందు భాగస్వామ్య మరియు సమ్మిళిత చర్చా ప్రక్రియను రూపొందించడానికి, అస్సాంలోని 34 జిల్లాల్లోని 50 విశ్వవిద్యాలయాలు/ కళాశాలలు జనవరి 19 నుండి తమ క్యాంపస్‌లలో సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు, చర్చాగోష్టులను మరియు ప్యానెల్ చర్చలను నిర్వహింస్తున్నాయి. ఇవి ప్రధాన సమావేశం ప్రారంభం వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్‌లలో 12,000 మంది కళాశాల/ విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి ఉన్నత విద్యా సంస్థ జీ-20 సమూహాలు, పనితీరు గురించి పాఠశాలలకు అవగాహన కల్పించడానికి సమీపంలోని 10 పాఠశాలల్లో అవగాహన డ్రైవ్‌ను కూడా నిర్వహిస్తుంది.
వివిధ విశ్వవిద్యాలయాలు/కళాశాలల నుండి ఆయా పోటీలలో గెలుపొందిన 400 మంది 7 ఫిబ్రవరి, 2023న ఐఐటీ-గౌహతిలో జరిగే సెంట్రల్ ఈవెంట్‌లో పాల్గొంటారు. తదనుగుణంగా ఆవిష్కరణలు మరియు పరిశ్రమ-అకాడెమియా అనుసంధానాలను అర్థం చేసుకోవడానికి మెంటార్ చేయబడతారు. భాగస్వామ్య భవిష్యత్తు కోసం ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి అంతర్జాతీయ యువ ప్రతినిధులతో పరస్పరం మాట్లాడే అవకాశాన్ని కూడా వారు పొందుతారు.
ఇతర వివరాలకోస ఈ కింది లింకులను క్లిక్ చేయండిః
https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1889239
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1888943
***
(Release ID: 1892895)
Visitor Counter : 208