ప్రధాన మంత్రి కార్యాలయం
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ను ‘నాటు నాటు’ పాట గెలుచుకొన్న సందర్భం లో ఆర్ఆర్ఆర్ జట్టు కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
11 JAN 2023 12:43PM by PIB Hyderabad
గోల్డెన్ గ్లోబ్ అవార్డు లలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు ను ‘నాటు నాటు’ పాట గెలుచుకొన్న సందర్భం లో ఆర్ఆర్ఆర్ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమా బృందం చేసిన ఒక ట్వీట్ ను శేర్ చేస్తూ ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
" ఒక చాలా విశిష్ఠమైనటువంటి కార్యసిద్ధి ఇది. శ్రీయుతులు ఎం.ఎం. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ లకు ఇవే అభినందన లు. అలాగే శ్రీయుతులు ఎస్.ఎస్. రాజమౌళి, జూనియర్ ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా కు పని చేసిన బృందం సభ్యులు అందరి ని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి సమ్మానం భారతదేశం లో ప్రతి ఒక్కరి ని ఎంతో గర్వపడేలా చేసింది.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1890240)
Read this release in:
Gujarati
,
Marathi
,
Manipuri
,
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Malayalam