హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తల్లి మృతిప‌ట్ల కేంద్ర హోం, స‌హ‌కార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్ర‌గాఢ సంతాపం


గౌరవనీయులైన మాతాజీ హీరాబా మరణం విచారకరమైన వార్త

ఒక వ్యక్తి జీవితంలో తల్లి మొదటి స్నేహితురాలు మరియు గురువు, తల్లిని కోల్పోయిన బాధ నిస్సందేహంగా గొప్ప బాధ

కుటుంబ పోషణ కోసం హీరాబా పడిన కష్టాల పోరు అందరికీ ఆదర్శనీయం, ఆమె త్యాగపూరిత సన్యాసి జీవితం మన జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది

ఈ దుఃఖ సమయంలో దేశం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆయన కుటుంబానికి అండగా నిలుస్తుంది, కోట్లాది ప్రజల ప్రార్థనలు ప్రధానమంత్రికి ఉన్నాయి

प्रविष्टि तिथि: 30 DEC 2022 9:35AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తల్లి మృతి పట్ల కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ అమిత్ షా తన ట్వీట్లలో.. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాతాజీ హీరా బా మరణవార్త చాలా బాధాకరమని అన్నారు. ఒక వ్యక్తి జీవితంలో తల్లి మొదటి స్నేహితుడు మరియు గురువుగా నిలుస్తారని, తల్లిని కోల్పోయిన బాధ నిస్సందేహంగా గొప్ప బాధయేనని అన్నారు. కుటుంబ పోషణ కోసం హీరా బా చేసిన పోరాటాలు అందరికీ ఆదర్శప్రాయమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అన్నారు. ఆమె త్యాగపూరిత జీవితం మన జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు. ఈ దుఃఖ సమయంలో దేశం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తోందని అన్నారు. కోట్లాది ప్రజల ప్రార్థనలు ప్రధానికి ఉన్నాయి.. ఓం శాంతి.

******


(रिलीज़ आईडी: 1887766) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Tamil