ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీమతి ముక్తా తిలక్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
22 DEC 2022 9:26PM by PIB Hyderabad
మహారాష్ట్ర ఎమ్ఎల్ఎ మరియు పుణె పూర్వ మేయర్ శ్రీమతి ముక్తా తిలక్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీమతి ముక్తా తిలక్ గారు సమాజానికి సేవ చేయడం కోసం ఎంతో పాటుపడ్డారు. పుణె మేయర్ గా ఆమె పదవీ కాలం లో ప్రజా సమస్యల ను వెలుగులోకి తేవడం కోసం తనదైన ముద్ర వేశారు. బిజెపి పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతను కార్యకర్తలు ఎల్లప్పుడూ గౌరవిస్తారు. ఆమె మృతి తో నేను వేదన కు గురయ్యాను. ఆమె కుటుంబాని కి మరియు ఆమె ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1885960)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam