ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫీఫావరల్డ్ కప్ విజేతలు గా నిలచిన అర్జెంటీనా కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


ఫీఫావరల్డ్ కప్ లో సాహసిక ప్రదర్శన కు గాను ఫ్రాన్స్ కు కూడా ఆయన అభినందనలను తెలిపారు

प्रविष्टि तिथि: 18 DEC 2022 11:55PM by PIB Hyderabad

ఫీఫా ప్రపంచ కప్ విజేతలు గా నిలచినందుకు అర్జెంటీనా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు; ఫీఫా వరల్డ్ కప్ లో గొప్ప ఉత్సాహపూర్ణమైనటువంటి ఆటతీరు ను కనబరచినందుకు గాను ఫ్రాన్స్ కు కూడా శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ మ్యాచ్ ను కూడా అత్యంత ఉద్వేగానికి లోను చేసేటటువంటి ఫుట్ బాల్ మ్యాచుల లో ఒకటి గా గుర్తుంచుకోవడం జరుగుతుంది. #FIFAWorldCup చాంపియన్ గా నిలచిన అర్జెంటీనా కు ఇవే అభినందన లు. టూర్నమెంట్ లో ప్రతి దశ లోనూ వారు దమ్ము తో కూడిన ఆటతీరు ను ప్రదర్శించారు. అర్జెంటీనా యొక్క, శ్రీ మెసీ యొక్క లక్షల మంది భారతీయ అభిమాన గణం ఈ చాలా గొప్ప గెలుపు తాలూకు ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. @alferdez ’’


‘‘ #FIFAWorldCup లో స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రదర్శన కు గాను ఫ్రాన్స్ కు ఇవే అభినందన లు. వారు ఫైనల్ వరకు చేరుకోవడం లో వారి కౌశలాన్ని మరియు క్రీడా సంబంధి ఉత్సాహాన్ని చాటుకోవడం ద్వారా ఫుట్ బాల్ ప్రేమికుల హృద‌యాల ను గెలుచుకొన్నారు. @EmmanuelMacron ’’ అని పేర్కొన్నారు.

******

DS/ST

 


(रिलीज़ आईडी: 1884865) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam