ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

1971 యుద్ధం లో గెలుపున కు గాను సాయుధ దళాల కు విజ‌య్ దివ‌స్ నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 16 DEC 2022 11:18AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1971వ సంవత్సరం లో జరిగిన యుద్ధం లో భారతదేశాని కి అసాధారణ విజయాన్ని సునిశ్చితం చేసిన సాయుధ దళాల సాహసిక జవానులందరికి ‘విజయ్ దివస్’ నాడు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘1971 యుద్ధం లో భారతదేశానికి అసాధారణమైనటువంటి గెలుపు ను సునిశ్చితం చేసిన సాయుధ దళాల కు చెందిన సాహసిక సైనికులు అందరికి విజయ్ దివస్ నాడు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. దేశాన్ని సురక్షితం గాను, భద్రం గాను ఉంచడం లో సాయుధ దళాలు పోషించిన పాత్ర కు గాను మన దేశ ప్రజలు వారికి ఎల్లప్పటికీ రుణపడి ఉంటారు.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 


(रिलीज़ आईडी: 1884087) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Bengali , Assamese , Manipuri , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam