విద్యుత్తు మంత్రిత్వ శాఖ

రేపు "ఇంధన పరిరక్షణ దినోత్సవం 2022" జరుపుకోనున్న విద్యుత్ మంత్రిత్వ శాఖ

జాతీయ శక్తి పరిరక్షణ అవార్డులు, జాతీయ ఇంధన సమర్థత ఆవిష్కరణ అవార్డులు, జాతీయచిత్రలేఖన పోటీ బహుమతుల విజేతలను సత్కరించనున్న రాష్ట్రపతి  ఈవీ యాత్ర పోర్టల్ ను ఆవిష్కరించనున్న రాష్ట్రపతి

Posted On: 13 DEC 2022 12:14PM by PIB Hyderabad

ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు. ఇంధన సామర్థ్యం, పరిరక్షణలో దేశం సాధించిన విజయాలను ప్రదర్శించడం దీని ఉద్దేశ్యం.

 

రేపు ఈ సందర్భంగా జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. విద్యుత్, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ కృష్ణ పాల్, విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులు, నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్, నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్ బహుమతుల విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు. ఈ సందర్భంగా ఈవి యాత్ర పోర్టల్ ను ప్రారంభిస్తారు.

 

ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణలు:

 

*నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (ఎన్ఈసీఏ) 2022

*నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2022

*విద్యార్థులకు జాతీయ చిత్రలేఖన పోటీలు

*' ఇ వి -యాత్ర పోర్టల్' , మొబైల్ యాప్ ప్రారంభం

*ఇంధన సమర్థత రంగంలో అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీలపై సదస్సు

*నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు 2022

 

*ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 న జరుపుకునే జాతీయ ఇంధన శక్తి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఇంధన సామర్థ్యం,దాని పరిరక్షణ పై అవగాహన పెంచడానికి, విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వం లోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బి ఇ ఇ) -ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో పారిశ్రామిక యూనిట్లు, సంస్థల ప్రయత్నాలను గుర్తించి, ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులతో సత్కరిస్తుంది.

 

ఈ ఏడాది ఎన్ఈసీఏ-2022 కోసం 27 అక్టోబర్ 2022 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం 448 దరఖాస్తులు వచ్చాయి.

 

జాతీయ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు (ఎన్ ఇ సి ఎ)-2022 కోసం మొత్తం అవార్డుల సంఖ్య

 

మొదటి బహుమతి

19

రెండవ బహుమతి

08

సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ (సి ఒ ఎం)

21

 

సర్టిఫికెట్ ఆఫ్ నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2022

 

ఇంధన సమర్థత రంగంలో భారతదేశ అద్భుతమైన కృషి , ఆవిష్కరణలను గుర్తించడానికి, 2021 సంవత్సరంలో నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇన్నోవేషన్ అవార్డ్స్(ఎన్ ఇ ఇ ఐ ఎ )అవార్డులను ప్రారంభించారు. ఈ అవార్డులకు కేటగిరీ ఎ: పరిశ్రమలు, భవనాలు, రవాణా రంగాలకు చెందిన నిపుణులు, కేటగిరీ బి: స్టూడెంట్స్ ,రీసెర్చ్ స్కాలర్స్ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

 

ప్రతిరూపత, స్థోమత, విశ్వసనీయత, ఇంధన పొదుపుపై ప్రభావం ,పర్యావరణం ,సుస్థిరతపై ప్రభావం ఆధారంగా అవార్డులకు ఎంపికలు జరుగుతాయి.

 

ఎన్ ఇ ఇ ఐ ఎ -2022 కోసం 27 అక్టోబర్ 2022 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 177 దరఖాస్తులు వచ్చాయి.

 

ఎన్ ఇ ఇ ఐ ఎ- 2022 కోసం మొత్తం అవార్డుల సంఖ్య

 

మొదటి బహుమతి

02

రెండవ బహుమతి

02

సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్ (సి ఒ ఆర్)

02

 

జాతీయ చిత్రలేఖనం (నేషనల్ పెయింటింగ్) పోటీ- 2022

 

ఇంధన పరిరక్షణ ,సమర్థవంతమైన వినియోగం దిశగా సమాజంలో నిరంతరం మార్పును తీసుకురావడానికి, విద్యుత్ మంత్రిత్వ శాఖ 2005 నుండి ఇంధన శక్తి పరిరక్షణపై జాతీయ చిత్రలేఖన పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీ మూడు దశల్లో జరుగుతుంది, పాఠశాల, రాష్ట్ర ,జాతీయ స్థాయిలో. 2021లో 80,000 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీ లో పాల్గొన్నారు.

గ్రూప్ 'ఎ' కింద 5, 6, 7 తరగతుల విద్యార్థులకు, గ్రూప్ 'బి' కింద 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

 

' ఇ వి -యాత్ర పోర్టల్' , మొబైల్ యాప్ ప్రారంభం

 

దేశం లో ఇ- మొబిలిటీని పెంపొందించడానికి వివిధ కేంద్ర, రాష్ట్ర స్థాయి చొరవలపై సమాచారాన్ని వ్యాప్తి చేసే వెబ్ సైట్ -సమీప పబ్లిక్ ఈవి ఛార్జర్ కు వాహనాల నావిగేషన్ ను సులభతరం చేయడానికి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఈ మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసింది. దేశంలో ఇ-మొబిలిటీని ప్రోత్సహించడానికి వివిధ కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఒక వెబ్సైట్, మరియు సిపిఓలు తమ ఛార్జింగ్ వివరాలను సురక్షితంగా నేషనల్ ఆన్లైన్ డేటాబేస్లో నమోదు చేయడానికి వీలు కల్పించే వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేసింది. అలాగే,

సి పి ఒ లు తమ ఛార్జింగ్ వివరాలను నేషనల్ ఆన్ లైన్ డేటాబేస్ లో సురక్షితంగా నమోదు చేయడానికి వీలు కల్పించే వెబ్ పోర్టల్ ను రూపొందించింది.

 

"ఈవి యాత్ర" అనే మొబైల్ అప్లికేషన్ ను సమీప పబ్లిక్ ఎలక్ట్రిక్ ఛార్జర్ కు ఇన్-వేహికల్ నావిగేషన్ ను సులభతరం చేయడానికి రూపొందించి అభివృద్ధి చేశారు. ఐఫోన్ , ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో గూగుల్ ప్లే స్టోర్ ,ఆపిల్ స్టోర్ నుండి ఈ మొబైల్ అప్లికేషన్ ను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సౌకర్యవంతంగా ఇన్ స్టాల్ చేయవచ్చు.

 

***



(Release ID: 1883055) Visitor Counter : 257