ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం జి20 అధ్యక్షపదవీకాలాన్ని మొదలుపెట్టడం తో ఒక బ్లాగ్ ను లిఖించినప్రధాన మంత్రి


‘‘భారతదేశంజి20 కి అధ్యక్ష పదవి ని నిర్వహించే కాలాన్ని స్వస్థపరచేటటువంటి, సద్భావన కు, ఇంకా ఆశ కు పెద్దపీట వేసేటటువంటి కాలంగా మలచడం కోసం మనమంతా ఒక్కటై కృషి చేద్దాం’’

Posted On: 01 DEC 2022 10:20AM by PIB Hyderabad

భారతదేశం ఈ రోజు న జి20 కూటమి కి అధ్యక్ష స్థానాన్ని స్వీకరిస్తున్న తరుణం లో ఈ మహత్తరమైన సందర్భాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అంతరంగాన్ని వెల్లడించడానికి ఒక బ్లాగు ను వ్రాశారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం జి20 అధ్యక్ష బాధ్యత ను స్వీకరిస్తున్న సందర్భం లో ప్రధాన మంత్రి @nare ndramodi అంతర్ దృష్టి భరితమైనటువంటి ఒక బ్లాగు ను వ్రాశారు.’’

 

‘‘సమగ్ర మానవాళి కి ఉపయోగకరం గా ఉండే దిశ లో భారతదేశం యొక్క జి20 అధ్యక్షత కృషి చేయగలదు.’’

 

‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు.’’

 

‘‘ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సవాళ్ళ కు పరిష్కారాల ను అన్వేషించడం అనేది కలసికట్టుగా కార్యాచరణ కు పూనుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.’’

 

‘‘ప్రపంచాని కి ఒక లఘు రూపం గా భారతదేశం ఉంది.’’

 

‘‘సామూహికం గా నిర్ణయాల ను తీసుకొనేటటువంటి అతి ప్రాచీనమైన సంప్రదాయాల ను అనుసరించడం ద్వారా ప్రజాస్వామ్యం యొక్క మౌలికమైన డిఎన్ఎ కు తన వంతు తోడ్పాటు ను భారతదేశం అందిస్తున్నది.’’

 

‘‘పౌరుల సంక్షేమం కోసం సాంకేతిక విజ్ఞానం యొక్క అండదండల ను ఉపయోగించుకోవడం జరుగుతోంది.’’

 

‘‘మన ప్రాథమ్యాలు మనకు ఉన్నటువంటి ‘ఒకే భూమి’ ని నివాసయోగ్యం గా మలచడం పైన, మన ‘ఒకే పరివారం’ లో సద్భావన ను ఏర్పరచడంపైన మరియు మన కు ఉన్న ‘ఒకటే భవిష్యత్తు’ పట్ల ఆశ ను రేకెత్తించడం పైన శ్రద్ధ వహించనున్నాయి.’’

 

‘‘భారతదేశం యొక్క జి20 కార్యక్రమాల పట్టిక అన్ని వర్గాల ను కలుపుకొని పోయేది గాను, ఆకాంక్షల తో నిండి ఉండేది గాను, చేతలు ప్రధానమైనది గాను మరియు నిర్ణయాత్మకం గాను ఉండబోతోంది.’’

 

ప్రధాన మంత్రి సైతం @narendramodi నుండి కొన్ని వివరాల ను వెల్లడించారు; అలాగే జి20 దేశాల నేతల కు తన అభిప్రాయాల ను వ్యక్తం చేశారు.

ఆయన అనేక ట్వీట్ లలో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

ఈ రోజు న ఎప్పుడైతే భారతదేశం జి20 అధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తోందో, ఈ సందర్భం లో రాబోయే సంవత్సరం లో ఏ విధం గా అయితే ప్రపంచ హితం వృద్ధి కోసం ఒక సమ్మిళితమైన, ఆకాంక్షభరితమైన, కార్యాచరణ ప్రధానమైన మరియు నిర్ణయాత్మకమైన కార్యక్రమాల ను ఆచరించాలనుకొంటున్నాము అనే అంశాల పై కొన్ని ఆలోచనల ను మేం అక్షర బద్ధం చేస్తున్నాం. #G20India

@JoeBiden @planalto

 

 

 

నేను దృఢం గా నమ్మేది ఏమిటి అంటే, యావత్తు మానవాళి ప్రయోజనార్థం మనస్తత్వ పరం గా ఒక మౌలికమైన పరివర్తన ను తీసుకు వచ్చే విధం గా ఒక ఉత్ప్రేరకం వలె పని చేయడానికి అతి చక్కటి కాలం ఇది అని నేను నమ్ముతున్నాను. #G20India

 

ఏకత్వాన్ని గురించి చాటిచెబుతున్న మన ఆధ్యాత్మిక సంప్రదాయాల నుండి ప్రేరణ ను పొంది, ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్ళ ను పరిష్కరించడానికి కలసికట్టుగా శ్రమించవలసిన తరుణం ఆసన్నమైంది. #G20India

 

 

బ్లాగ్ యొక్క పాఠాన్ని ఇక్కడ చదువగలరు:

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1880141

 

***



(Release ID: 1880273) Visitor Counter : 187