ప్రధాన మంత్రి కార్యాలయం

అరుణాచల్ ప్రదేశ్ లాంటి గొప్ప రాష్ట్రంకోసం పనిచేయడం, ఇంకా ఆ రాష్ట్రం యొక్క వాస్తవిక సామర్థ్యాన్ని తెలుసుకొనేటట్టుచేయడం లో సాయపడడం ఒక గౌరవాన్నిచ్చే విషయం: ప్రధాన మంత్రి


అరుణాచల్ ప్రదేశ్ యొక్క అభివృద్ధికార్యాల పట్ల ప్రజల ప్రతిస్పందన కు జవాబిచ్చిన ప్రధాన మంత్రి

Posted On: 20 NOV 2022 9:59AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్నటి రోజు న తాను ప్రారంభించిన అభి వృద్ధి కార్యక్రమాల ను ప్రజల ప్రశంసించినందుకు గాను ట్విటర్ లో బదులిచ్చారు. ప్రధాన మంత్రి నిన్న ఈటానగర్ లో డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రారంభించడం తో పాటు గా 600 మెగా వాట్ సామర్థ్యం కలిగినటువంటి కామెంగ్ జల విద్యుత్తు కేంద్రాన్ని దేశ ప్రజల కు అంకితం చేశారు.

ఈశాన్య ప్రాంతాల లో వాయు సంధానం లో చోటు చేసుకొన్న భారీ వృద్ధి ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, ఇలా అన్నారు.

‘‘అవును.. ఇది ఈశాన్య ప్రాంతాల కు సంబంధించినంతవరకు చూస్తే, ఇది ఒక పెద్ద మార్పే. ఇది అధిక సంఖ్య లో పర్యటకులు సందర్శించడానికి వీలు కల్పిస్తుంది; అంతేకాకుండా ఈశాన్య ప్రాంతాల ప్రజల కు దేశం లోని ఇతర ప్రాంతాల కు ప్రయాణించడం లో సౌలభ్యాన్ని ప్రసాదిస్తుంది కూడాను.’’

 

ఒక పౌరుడు రాష్ట్రం యొక్క అభి వృద్ధి విషయం లో ప్రధాన మంత్రి యొక్క నిబద్ధత ను గురించి ప్రముఖం గా ప్రకటించగా, దాని కి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ,

‘‘అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు అసాధారణమైనటువంటి వారు. వారి దేశ భక్తి భావన అచంచలమైందిగా ఉంటుంది. ఈ గొప్ప రాష్ట్రం కోసం పనిచేయడం మరియు ఈ రాష్ట్రం యొక్క వాస్తవిక సామర్థ్యాన్ని తెలుసుకొనేటట్టు చేయడం లో సాయపడడం అనేది ఒక గౌరవాన్వితమైనటువంటి విషయం.’’ అని పేర్కొన్నారు.

****



(Release ID: 1877632) Visitor Counter : 124