ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబర్ 19వ తేదీ నాడు అరుణాచల్ ప్రదేశ్ ను మరియు ఉత్తర్ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
ఈశాన్య ప్రాంతం లో సంధానాని కి ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక కీలకమైన ముందంజ లోభాగం గా, అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో ఒకటో గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్ట్ ‘డోని పోలో’ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు
ఈ విమానాశ్రయాని కి పెట్టిన పేరు అరుణాచల్ ప్రదేశ్ లో సూర్యుడు (‘డోనీ’) మరియు చంద్రుడు (‘పోలో’) ల పట్ల శతాబ్దాల నాటి నుండి ఉన్నటువంటిదేశీ ఆరాధనీయత ను సూచిస్తున్నది
640 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అభివృద్ధి పరచిన ఈ విమానాశ్రయం ద్వారా సంధానంమెరుగు పడనుంది; అంతేకాకుండా ఈ ప్రాంతం లో వ్యాపారాని కి మరియు పర్యటనసంబంధి అభివృద్ధి కి ఒక ఉత్ప్రేరకం వలె ఈ విమానాశ్రయం పని చేయనుంది
8450 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచిన 600 మెగావాట్ సామర్థ్యం కలిగిన కామెంగ్ జలవిద్యుత్తు కేంద్రాన్ని కూడాను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు
ఈ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్ ను అవసరం కంటే ఎక్కువ విద్యుత్తు ను కలిగివుండేరాష్ట్రం గా తీర్చిదిద్దుతుంది
వారాణసీ లో ఒక నెల రోజుల పాటు సాగే ‘కాశీ తమిళ్ సంగమం’ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు
ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్’ భావన కు అద్దం పడుతుంది
కాశీ కి మరియు తమిళ నాడు కు మధ్య చిరకాలం గా ఉన్న సంబంధాల ను ఒక వేడుక గాజరుపుకోవడం, ఆ సంబంధాల కు పున:పుష్టి ని సంతరించడం తో పాటు గా ఆ సంబంధాల ను సరికొత్త గా అన్వేషించడం అనేవిఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యాలు గా ఉన్నాయి
Posted On:
17 NOV 2022 3:30PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర 2022 నవంబర్ 19వ తేదీ నాడు అరుణాచల్ ప్రదేశ్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. ఆ రోజు న ఉదయం ఇంచుమించు 9:30 గంటల కు ప్రధాన మంత్రి ఈటానగర్ లో డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. 600 ఎమ్ డబ్ల్యు సామర్థ్యం కలిగినటువంటి కామెంగ్ జల విద్యుత్తు కేంద్రాన్ని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసి కి చేరుకొని, అక్కడ మధ్యాహ్నం పూట దాదాపు 2 గంటల వేళ లో ‘కాశీ తమిళ్ సంగమం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి
ఈశాన్య ప్రాంతాల లో సంధానాని కి ఊతాన్ని ఇచ్చే దిశ లో ఒక కీలకమైన మందంజయా అన్నట్లు గా, అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో ఒకటో గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్ట్ - ‘డోనీ పోలో విమానాశ్రయం’ - ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయానికి పెట్టిన పేరు అరుణాచల్ ప్రదేశ్ యొక్క సాంప్రదాయిక మరియు సమృద్ధ సాంస్కృతిక వారసత్వాని కి అద్దం పడుతుంది. అంతేకాకుండా, చిరకాలం గా సూర్య (‘డోనీ’) చంద్రు (‘పోలో’)లకు ఈ రాష్ట్రం కట్టబెడుతున్న పూజనీయత ను కూడా ఇది సంకేతిస్తున్నది.
అరుణాచల్ ప్రదేశ్ లో ఏర్పాటైన ఒకటో గ్రీన్ ఫీల్డ్ ఎయర్ పోర్ట్ ఇది. దీనిని 690 ఎకరాల కు పైగా విస్తీర్ణం లో 640 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడమైంది. 2300 మీటర్ ల రన్ వే తో కూడిన ఈ విమానాశ్రయం అన్ని రుతువుల లో కార్యకలాపాల నిర్వహణ కు తగినది గా రూపుదిద్దుకొంది. ఈ విమానాశ్రయం యొక్క టర్మినల్ ను ఒక ఆధునిక భవనం గా తీర్చిదిద్దడమైంది. ఇది శక్తి ని ఆదా చేయడాన్ని, నవీకరణ యోగ్య శక్తి ని మరియు వనరుల పునర్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈటానగర్ లో కొత్తగా విమానాశ్రయాన్ని అభివృద్ధి పరచడం అనేది ఆ ప్రాంతం లో సంధానాన్ని మెరుగు పరచడం ఒక్కటే కాకుండా వ్యాపారం మరియు పర్యటన ల వికాసానికి ఒక ఉత్ప్రేరకం వలె కూడాను పని చేయనుంది. తద్వారా ఈ విమానాశ్రయం ఆ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి కి దన్ను లభిస్తుంది.
ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి 600 ఎమ్ డబ్ల్యు సామర్థ్యం కలిగినటువంటి కామెంగ్ జల విద్యుత్తు కేంద్రాన్ని సైతం దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. 8450 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచినటువంటి ఈ జల విద్యుత్తు కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కామెంగ్ జిల్లా లో 80 కి పైగా కిలో మీటర్ ల ప్రాంతం లో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్ కు అవసరానికి మించి విద్యుత్తు కలిగి ఉండే రాష్ట్రం గా నిలబెట్టగలగడం తో పాటు గా గ్రిడ్ స్థిరత్వం మరియు ఏకీకరణ ల పరం గా చూసినప్పుడు జాతీయ గ్రిడ్ కు కూడా మేలు చేయగలదు. ఈ ప్రాజెక్టు కాలుష్యానికి తావు ఇవ్వనటువంటి శక్తి ని అందుకోవాలన్న దేశం యొక్క నిబద్ధత ను నెరవేర్చే దిశ లో ప్రముఖమైనటువంటి తోడ్పాటు ను ఇవ్వగలదు.
వారాణసీ లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి యొక్క దార్శనికత ద్వారా మార్గదర్శనాన్ని స్వీకరించి, ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ భావన ను ప్రోత్సహించాలి అనేది ప్రభుత్వం ప్రధానం గా శ్రద్ధ వహిస్తున్న రంగాల లో ఒకటి గా ఉంది. ఈ దృష్టి కోణాన్ని ప్రతిబింబిస్తోందా అన్నట్లుగా ఒక నెల రోజుల పాటు సాగే ‘కాశి తమిళ్ సంగమం’ కార్యక్రమాన్ని కాశీ (వారాణసీ) లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమాన్ని నవంబర్ 19వ తేదీ నాడు ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
కాశీ కి మరియు తమిళ నాడు కు మధ్య చిరకాలం గా ఉన్నటువంటి సంబంధాల ను ఒక వేడుక గా జరుపుకోవడం, ఆ సంబంధాల ను మరోమారు ధ్రువీకరించడం తో పాటు గా ఆ సంబంధాల ను తిరిగి అన్వేషించడం అనేవి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాల లో భాగం గా ఉన్నాయి. దేశం లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మరియు అతి పురాతనమైనటువంటి బోధన కేంద్రాలు గా కాశి, ఇంకా తమిళ నాడు లు ప్రసిద్ధి చెందాయి. ఈ కార్యక్రమం ఈ రెండు ప్రాంతాల కు చెందిన పండితులు, విద్యార్థులు, తత్త్వవేత్తలు, వ్యాపారులు, చేతివృత్తుల సంబంధి శ్రమికులు, కళాకారులు వంటి వారు సహా జీవనం లోని అన్ని రంగాల కు చెందిన వ్యక్తుల కు ఒక చోట గుమికూడేందుకు, వారి యొక్క జ్ఞానాన్ని పరస్పరం వెల్లడించేందుకు, వారి సంస్కృతి, వారి ఉత్తమ అభ్యాసాలు పరస్పరం అనుభవం లోకి తెచ్చుకొనేందుకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ధ్యేయం గా ఉంది. తమిళ నాడు నుండి 2500 మంది కి పైగా ప్రతినిధులు కాశీ కి తరలి రానున్నారు. వారు తాము చేస్తున్నటువంటి వ్యాపారాలనే, అనుసరిస్తున్నటువంటి వృత్తులనే మరియు అవే అభిరుచులు కలిగినటువంటి స్థానికుల తో కలసి మాటామంతీ జరపడం కోసం చర్చాసభలు, స్థలాల యాత్రలు వగైరాల లో పాలుపంచుకోనున్నారు. రెండు ప్రాంతాల కు చెందిన చేనేత లు, హస్త కళలు, ‘ఒక జిల్లా- ఒక ఉత్పాదన’ (ఒడిఒపి), పుస్తకాలు, డాక్యుమెంటరీ లు, వంటకాలు, కళా రూపాలు, చరిత్ర, పర్యటన స్థలాలు మొదలైన అంశాల తో నెల రోజుల పాటు ఒక ప్రదర్శన ను కూడా కాశీ లో నిర్వహించడం జరుగుతుంది.
ఈ ప్రయాస జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) 2020 యొక్క జ్ఞానం సంబంధి ఆధునిక ప్రణాళికల తో పాటు గా భారతీయ జ్ఞాన ప్రణాళికల తాలూకు సంపద ను ఏకీకృతం చేయడం అనే అంశాని కి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలన్న దానికి అనుగుణం గా ఉంది. ఈ కార్యక్రమం అమలు కు ఐఐటి మద్రాసు మరియు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్ యు) లు నడుం కట్టాయి.
***
(Release ID: 1876952)
Visitor Counter : 176
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam