ప్రధాన మంత్రి కార్యాలయం
జి20 సభ్యత్వ దేశాల నేతల శిఖర సమ్మేళనం కోసం ప్రధాన మంత్రి బాలి నిసందర్శించడానికి బయలుదేరే కంటే ముందు గా జారీ చేసిన ప్రకటన
Posted On:
14 NOV 2022 9:14AM by PIB Hyderabad
ఇండోనేశియా అధ్యక్షత న జరుగనున్న పదిహేడో జి20 సభ్యత్వ దేశాల నేత ల శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం 2022 నవంబర్ 14-16 తేదీ ల మధ్య కాలం లో ఇండోనేశియా లోని బాలి ని నేను సందర్శించనున్నాను.
బాలి శిఖర సమ్మేళనం జరిగే క్రమం లో, ప్రపంచాని కి ఆందోళనకరం గా మారినటువంటి ప్రపంచ వృద్ధి ని పునరుద్ధరింప చేయడం, ఆహార భద్రత, శక్తి భద్రత, పర్యావరణం, ఆరోగ్యం మరియు డిజిటల్ ట్రాన్స్ ఫర్ మేశన్ ల వంటి కీలక అంశాల పై నేను జి20 సభ్యత్వ దేశాల కు చెందిన ఇతర నేతల తో విస్తృత స్థాయి చర్చల లో పాలుపంచుకొనున్నాను. జి20 శిఖర సమ్మేళనం జరిగే కాలం లో, నేను ఆ సమావేశాల లో పాల్గొనే ఇతర దేశాల నేతల తో భేటీ కావడం తో పాటు గా భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాల లో పురోగతి అంశం పై వారి తో నేను సమీక్ష ను చేపడుతాను. 2022 నవంబర్ 15వ తేదీ న బాలి లో ఏర్పాటయ్యే ఒక స్వాగత కార్యక్రమం లో పాల్గొని భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించాలని నేను ఆశ పడుతున్నాను.
మన దేశాని కి మరియు మన పౌరుల కు ఒక ముఖ్యమైనటువంటి సందర్భమా అన్నట్లు గా, జి20 అధ్యక్ష బాధ్యతల ను ఇండోనేశియా అధ్యక్షుడు శ్రీ జోకో విడోడో బాలి శిఖర సమ్మేళనం యొక్క ముగింపు కార్యక్రమం లో భారతదేశాని కి అప్పగించనున్నారు. భారతదేశం జి20 అధ్యక్ష బాధ్యతల ను 2022 డిసెంబర్ 1వ తేదీ నాటి నుండి ఆధికారికం గా స్వీకరించనుంది. వచ్చే సంవత్సరం లో జరుగనున్న మన జి20 శిఖర సమ్మేళనాని కి నేను జి20 సభ్యత్వ దేశాల ను మరియు ఇతర ఆహ్వానితుల ను స్వయం గా ఆహ్వానించనున్నాను కూడా.
జి20 శిఖర సమ్మేళనం సందర్భం లో నేను జరపనున్న భేటీల లో భాగం గా, భారతదేశం యొక్క కార్యసాధనల ను మరియు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ ను సామూహికం గా పరిష్కరించడం కోసం మన అచంచల వచనబద్ధత ను ప్రముఖం గా ప్రకటించనున్నాను. జి20 కి భారతదేశం అధ్యక్షత అనేది ‘‘వసుధైవ కుటుంబకమ్’’ లేదా ‘‘ఒక ధరిత్రి-ఒక కుటుంబం-ఒక భవిష్యత్తు’’ అనే ఇతివృత్తం ఆధారం గా ఉండబోతోంది. ఈ ఇతివృత్తం న్యాయబద్ధమైన వృద్ధి మరియు అందరి కి ఉమ్మడి భవిష్యత్తు అనేటటువంటి సందేశాని కి ప్రతీక గా ఉంటుంది.
***
(Release ID: 1875760)
Visitor Counter : 242
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam