సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘‘భారతదేశం లో శాటిలైట్ టెలివిజన్ చానల్స్ కు సంబంధించిన అప్ లింకింగ్ మరియు డౌన్ లింకింగ్ కోసం మార్గదర్శక సూత్రాలు, 2022’’ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
09 NOV 2022 3:36PM by PIB Hyderabad
‘‘భారతదేశం లో శాటిలైట్ టెలివిజన్ చానల్స్ కు సంబంధించిన అప్ లింకింగ్ మరియు డౌన్ లింకింగ్ మార్గదర్శకసూత్రాలు, 2022’’ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏకీకృత మార్గదర్శకసూత్రాలు భారతదేశం లో నమోదైన కంపెనీ లు/లిమిటెడ్ లయబులిటి పార్ట్ నర్ శిప్ స్ (ఎల్ఎల్ పి ల)కు టివి ఛానళ్ళ యొక్క అప్ లింకింగ్ మరియు డౌన్ లింకింగ్, టెలిపోర్ట్ స్/టెలిపోర్ట్ హబ్ ల స్థాపన, డిజిటల్ శాటిలైట్ న్యూజ్ గేదరింగ్ (డిఎస్ఎన్ జి)/శాటిలైట్ న్యూజ్ గేదరింగ్ (ఎస్ఎన్ జి) ల/ ఎలక్ట్రానిక్ న్యూజ్ గేదరింగ్ (ఇఎన్ జి) వ్యవస్థ ల ఉపయోగం, భారతీయ వార్తా సంస్థ ల ద్వారా అప్ లింకింగ్ మరియు లైవ్ ఈవెంట్ తాలూకు తాత్కాలిక అప్ లింకింగ్ ల ఉపయోగం కోసం అనుమతి ని జారీ చేయడం లో సౌలభ్యాన్ని అందించనున్నాయి.
- కొత్త మార్గదర్శక సూత్రాలు టెలివిజన్ చానల్స్ కు నియమ నిబంధనల పాలన ను సులభతరం చేసివేస్తాయి
- కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాని కి సంబంధించి ఎటువంటి పూర్వానునుమతి అక్కర లేదు
- ఇండియన్ టెలిపోర్టులు విదేశీ ఛానల్స్ ను అప్ లింక్ చేయవచ్చును
- జాతీయ హితం/సార్వజనిక హితం కోసం కంటెంటు ను ప్రసారం చేయవలసిన బాధ్యత ఉంటుంది
సవరించిన మార్గదర్శక సూత్రాల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఈ కింది విధం గా ఉన్నాయి:-
i. పర్మిశన్ హోల్డరు కు నియమ పాలన లో సౌలభ్యం
a. కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాని కి గాను అనుమతి ని తీసుకొనే ఆవశ్యకత ను సమాప్తం చేయడమైంది; ప్రత్యక్ష ప్రసారం జరిగే కార్యక్రమాల కోసం మాత్రమే ముందస్తు గా నమోదు చేసుకోవడం అవసరమవుతుంది;
b. స్టాండర్డ్ డెఫినిశన్ (ఎస్ డి) నుండి హై డెఫినిశన్ (హెచ్ డి) కు గాని, లేదా హై డెఫినిశన్ నుండి స్టాండర్డ్ డెఫినిశన్ కు గాని లేదా దీనికి భిన్నం గా భాష లో పరివర్తన లేదా ప్రసార పద్ధతి లో మార్పు కోసం ఎటువంటి ముందస్తు అనుమతి ని తీసుకోవలసిన అవసరమంటూ ఉండదు; ఈ విషయం లో ముందు గా సమాచారాన్ని మాత్రం ఇవ్వవలసి ఉంటుంది.
c. అత్యవసర స్థితి సందర్భం లో, ఒక కంపెనీ/ఎల్ఎల్ పి కోసం కేవలం ఇద్దరు డైరెక్టర్ లు/భాగస్వాముల తో పాటు గా, ఒక డైరెక్టరు/భాగస్వామి ని మార్చవచ్చును, అయితే అటువంటి నియామకాన్ని జరిపిన తరువాత అటువంటి నియామకం సెక్యూరిటీ క్లియరెన్స్ మరియు వ్యాపార పరమైనటువంటి నిర్ణయాల ను తీసుకోవడానికి సమర్థం చేయడానికే జరిగినదై ఉండాలి;
d. ఒక కంపెనీ/ఎల్ఎల్ పి డిఎస్ఎన్ జి కన్నా అదనం గా ఇతర వార్తా సేకరణ సామగ్రి ని ఉపయోగించవచ్చును; ఉదాహరణ కు ఆప్టిక్ ఫైబర్, బ్యాగ్ బ్యాక్ మొబైల్ ల వంటివాటి ని ఉపయోగించవచ్చును. దీని కోసం ప్రత్యేకం గా ఎటువంటి పరిమితి అవసరపడదు.
ii. వ్యాపారం చేయడం లో సౌలభ్యం
a. అనుమతి ని మంజూరు చేయడం కోసం నిర్దిష్ట కాలావధుల ను ప్రతిపాదించడం జరిగింది;
b. లిమిటెడ్ లయబిలిటి పార్ట్ నర్ శిప్ (ఎల్ఎల్ పి) సంస్థ లు కూడా అనుమతి ని తీసుకోవచ్చును;
c. ఎల్ఎల్ పి లు/ కంపెనీ లు ఇండియన్ టెలిపోర్టు ల నుండి విదేశీ చానల్స్ ను అప్ లింక్ చేసేందుకు అనుమతి ని ఇవ్వడం జరుగుతుంది. దీనితో ఉద్యోగ అవకాశాల కల్పన సాధ్యపడుతుంది. అలాగే, ఇది భారతదేశాన్ని ఇతర దేశాల కు ఒక టెలిపోర్ట్-హబ్ గా తీర్చిదిద్దగలదు.
d. ఒక వార్తా సంస్థ కు ఇప్పుడు అమలు లో ఉన్న ఒక సంవత్సరం తో పోలిస్తే 5 సంవత్సరాల కాలాని కి గాను అనుమతి లభించే అవకాశం ఉంది;
e. ప్రస్తుతం అమలు లో ఉన్నటువంటి ఒకే ఒక టెలిపోర్టు /శాటిలైట్ లతో పోలిస్తే ఒక చానల్ ను ఒకటి కంటే ఎక్కువ టెలిపోర్ట్/శాటిలైట్ ల సదుపాయాల ను ఉపయోగించుకొని అప్ లింక్ చేయవచ్చును;
f. దీనితో కంపెనీ ల చట్టం/లిమిటెడ్ లయబిలిటీ యాక్టు ల పరిధి లో టివి ఛానల్/టెలిపోర్ట్ ను ఏదైనా కంపెనీ/ఎల్ఎల్ పి కి బదలాయించడానికి సంబంధించిన అనుమతి ని ఇచ్చే అవకాశాలు పెరిగినట్లయింది.
iii. సరళీకరణ మరియు సక్రమ వ్యవస్థీకరణ
a. మార్గదర్శక సూత్రాల కు సంబంధించిన ఒక సంయుక్త సముదాయం మాధ్యం ద్వారా రెండు వేరు వేరు మార్గదర్శక సూత్రాల ను మార్చివేయడం జరిగింది;
b. చేసిన పనినే మళ్ళీ చేయడం మరియు సర్వసాధారణ కొలమానాల బారి నుండి తప్పించుకోవడం కోసం మార్గదర్శక సూత్రాల నిర్మాణ క్రమాన్ని వ్యవస్థీకరించడమైంది.
c. జరిమానా షరతుల ను సక్రమం గా వ్యవస్థీకరించడమైంది. ఇప్పుడు అమలు లో ఉన్న ఏక రీతి జరిమానాల తో పోలిస్తే విభిన్న రీతుల ఉల్లంఘనల కు గాను వేరు వేరు జరిమానాల ను ప్రతిపాదించడం జరిగింది.
iv. ఇతర ముఖ్యాంశాలు
a. ఏదైనా ఒక చానల్ ను అప్ లింక్ చేయడానికి మరియు డౌన్ లింక్ చేయడానికి అనుమతి ని కలిగివున్న కంపెనీ లు/ఎల్ఎల్ పి లు జాతీయ ప్రాముఖ్యం కలిగినటువంటి మరియు సామాజిక ఔచిత్యం కలిగినటువంటి ఇతివృత్తాల పై ఒక రోజు లో కనీసం 30 నిమిషాల సేపు సార్వజనిక సేవా ప్రధాన ప్రసారాన్ని (సాధ్యం కాని సందర్భాలు మినహా) అందించవచ్చును.
b. సి బ్యాండు కంటే వేరైన ఫ్రీక్వెన్సీ బ్యాండు లో అప్ లింకింగ్ చేసేటటువంటి టెలివిజన్ చానల్స్ వాటి యొక్క సిగ్నల్స్ ను తప్పక ఎన్ క్రిప్ట్ చేయవలసి ఉంటుంది.
c. నవీకరణ కాలం లో మార్గదర్శక సూత్రాల ప్రకారం అనుమతుల ను సంపాదించిన కంపెనీ లు/ఎల్ఎల్ పి లు వాటి నెట్ వర్త్ నిబంధన ను అనుసరించవలసి ఉంటుంది.
d. బకాయి ల చెల్లింపున కు పూచీ పడడం కోసం సెక్యూరిటీ డిపాజిట్ ల నిబంధన ను తీసుకు రావడమైంది.
విస్తృతమైన మార్గదర్శక సూత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు
***
(Release ID: 1874763)
Visitor Counter : 269
Read this release in:
Marathi
,
Manipuri
,
Assamese
,
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam