ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇజ్రాయల్ సాధారణ ఎన్నికల లో శ్రీ బెంజామిన్ నెతన్యాహూ గెలిచినందుకు గాను ఆయన కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి


భారతదేశం-ఇజ్రాయల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాథమ్యాన్ని కట్టబెట్టినందుకు గాను యేర్లేపిడ్ కు కూడా ధన్యవాదాల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 04 NOV 2022 9:03AM by PIB Hyderabad

ఇజ్ రాయల్ సాధారణ ఎన్నికల లో శ్రీ బెంజామిన్ నెతన్యాహూ గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

భారతదేశం-ఇజ్ రాయల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాథమ్యాన్ని కట్టబెట్టినందుకు గాను యేర్ లేపిడ్ కు కూడా శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నా మిత్రుడా @netanyahu , మీరు సాధించిన ఎన్నికల సాఫల్యానికి గాను మీకు ఇవే అభినందన లు. భారతదేశం- ఇజ్ రాయల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం లో మన సంయుక్త ప్రయాసల ను కొనసాగించాలి అని నేను ఆశపడుతున్నాను.

‘‘అలాగ, భారతదేశం- ఇజ్ రాయల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మీరు కట్టబెట్టినటువంటి ప్రాథమ్యానికి గాను మీకు ఇవే ధన్యవాదాలు @yairlapid . మన ప్రజల పరస్పర ప్రయోజనం కోసం ఉపాయాల ను ఫలప్రదం గా వెల్లడించుకోవడాన్ని మనం ఇక మీదట కూడా కొనసాగించాలి అని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

*****

DS/ST


(Release ID: 1873647) Visitor Counter : 176