ప్రధాన మంత్రి కార్యాలయం

'ఇన్-సితు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్' కింద ఢిల్లీలోని కల్కాజీలో కొత్తగా నిర్మించిన 3024 ఫ్లాట్లను నవంబర్, 2వ తేదీన ప్రారంభించనున్న - ప్రధాన మంత్రి


భూమిహీన్ క్యాంప్‌ లో అర్హులైన జుగ్గీ జోప్రీ నివాసితులకు ఫ్లాట్ల తాళాలు అందజేయనున్న - ప్రధాన మంత్రి

అందరికీ ఇళ్లు అందించాలనే ప్రధానమంత్రి దార్శనికత కు అనుగుణంగా మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందిస్తూ, అన్ని పౌర సౌకర్యాలు, సదుపాయాలతో అమర్చబడిన - ఫ్లాట్లు


యాజమాన్య హక్కు తో పాటు భద్రతా భావాన్ని కల్పిస్తున్న - ఫ్లాట్లు

Posted On: 01 NOV 2022 4:54PM by PIB Hyderabad

ఢిల్లీ లోని కల్కాజీ లో 'ఇన్-సితు స్లమ్ రిహాబిలిటేషన్' ప్రాజెక్టు కింద మురికివాడల నివాసితులకు పునరావాసం కల్పించడం కోసం నిర్మించిన 3,024 ఈ.డబ్ల్యూ.ఎస్. ఫ్లాట్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.  2022 నవంబర్, 2వ తేదీ, సాయంత్రం నాలుగున్నర గంటలకు, ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఒక కార్యక్రమంలో భూమి హీన్ క్యాంపులో అర్హులైన లబ్ధిదారులకు ప్రధానమంత్రి తాళం చెవులు అందజేస్తారు. 

 

అందరికీ ఇళ్లు అందించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డి.డి.ఎ) ద్వారా 376 జుగ్గీ జోప్రీ క్లస్టర్ల లో ఇన్-సితు మురికివాడల పునరావాసం చేపట్టబడుతోంది.  జుగ్గీ జోప్రి క్లస్టర్ల నివాసులకు సరైన సదుపాయాలు, సౌకర్యాలతో మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించడం ఈ పునరావాస ప్రాజెక్టు లక్ష్యం. 

 

అటువంటి మూడు ప్రాజెక్టులను కల్కాజీ ఎక్స్‌టెన్షన్, జైలర్ వాలా బాగ్, కాత్‌ పుత్లీ కాలనీలలో డి.డి.ఏ. చేపట్టింది.  కల్కాజీ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు కింద, కల్కాజీలో ఉన్న భూమి హీన్ క్యాంపు, నవజీవన్ క్యాంపు, జవహర్ క్యాంపు అనే మూడు మురికివాడలకు చెందిన ఇన్-సితు మురికివాడల పునరావాసం దశలవారీగా చేపట్టడం జరుగుతుంది.  మొదటి దశ కింద, సమీపంలోని ఖాళీ వాణిజ్య కేంద్రానికి చెందిన స్థలంలో 3,024 ఈ.డబ్ల్యూ.ఎస్. ఫ్లాట్లు నిర్మించడం జరిగింది.  భూమి హీన్ క్యాంపు లోని అర్హులైన కుటుంబాలకు కొత్తగా నిర్మించిన ఈ.డబ్ల్యూ.ఎస్. ఫ్లాట్లలో పునరావాసం కల్పించడం ద్వారా భూమి హీన్ క్యాంప్‌ వద్ద ఉన్న జుగ్గీ జోప్రి స్థలాన్ని ఖాళీ చేయించడం జరుగుతుంది.  భూమి హీన్ క్యాంపు స్థలాన్ని ఖాళీ చేయించిన తర్వాత, రెండో దశ కింద ఈ ఖాళీ స్థలాన్ని నవజీవన్ క్యాంపు, జవహర్ క్యాంపు పునరావాసం కోసం వినియోగించడం జరుగుతుంది. 

 

ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తి అయ్యింది, 3,024 ఫ్లాట్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి.  ఈ ఫ్లాట్లను దాదాపు 345 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది.  విట్రిఫైడ్ ఫ్లోర్ టైల్స్, సెరామిక్స్ టైల్స్, వంటగదిలో ఉదయపూర్ గ్రీన్ మార్బుల్ కౌంటర్ మొదలైన వాటితో పూర్తి చేయడంతో సహా ఈ ఫ్లాట్లలో అన్ని పౌర సౌకర్యాలు కల్పించడం జరిగింది.   వీటితో పాటు, కమ్యూనిటీ పార్కులు, ఎలక్ట్రిక్ సబ్-స్టేషన్లు, మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంటు, రెండు నీటి సరఫరా పైపు లైన్లు, లిఫ్టులు, పరిశుభ్రమైన నీటి సరఫరా కోసం భూగర్భ రిజర్వాయర్ వంటి ప్రజా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.  ఫ్లాట్ల కేటాయింపు ప్రజలకు యాజమాన్య హక్కు తో పాటు భద్రతా భావాన్ని కూడా కల్పిస్తుంది.

 

*****



(Release ID: 1872914) Visitor Counter : 128