ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సీఆర్పీఎఫ్‌ తోటల పెంపకం కార్యక్రమంపై ప్ర‌ధానమంత్రి ప్రశంస

Posted On: 29 OCT 2022 10:30PM by PIB Hyderabad

   సీఆర్పీఎఫ్‌ సిబ్బంది తోటల పెంపకం కార్యక్రమం చేపట్టడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. విశ్వనాథ క్షేత్రం, జ్ఞానవాపి భద్రత కోసం నియమితులైన  సీఆర్పీఎఫ్‌ బృందం 75,000 మొక్కలు నాటడం యావద్దేశానికీ స్ఫూర్తినిస్తుంద ప్రధాని పేర్కొన్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

   “సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రదర్శించిన చొరవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. భద్రతకు కాపలాదారుగానే కాకుండా పర్యావరణ పరిరక్షణ దిశగానూ వారి కృషి యావద్దేశానికీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది... @crpfindia” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1872167)