ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మోర్ బీ లో జరిగిన దుర్ఘటన ను గురించి గుజరాత్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 OCT 2022 7:51PM by PIB Hyderabad

మోర్ బీ లో జరిగిన దుర్ఘటన ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయి పటేల్ తోను, ఇతర అధికారుల తోను మాట్లాడారు. బాధితుల ను కాపాడే కార్యకలాపాల ను చేపట్టడం కోసం సంబంధి జట్టుల ను తక్షణ ప్రాతిపదిక న సమీకరించవలసింది గా ప్రధాన మంత్రి కోరారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘మోర్ బీ లో జరిగిన దుర్ఘటన ను గురించి గుజరాత్ ముఖ్యమంత్రి తో మరియు ఇతర అధికారుల తో ప్రధాన మంత్రి @narendramodi మాట్లాడారు. రక్షణ, సహాయక కార్యకలాపాల కోసం తగిన జట్టుల ను అత్యవసరం గా సమీకరించవలసిందని ఆయన కోరారు. స్థితి ని దగ్గరి నుండి అదే పని గా పర్యవేక్షిస్తూ ఉండవలసిందిగాను, దీనితో పాటు గా బాధితులైన వ్యక్తుల కు సాధ్యమైన అన్ని విధాల సహాయాన్ని అందించవలసిందిగాను ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.’’ అని తెలిపింది.

*****
DS/ST

 

 

 

 


(रिलीज़ आईडी: 1872091) आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam