ప్రధాన మంత్రి కార్యాలయం

ధంతేరాస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి


సాంప్రదాయ వైద్యం, యోగా రంగాల్లో పనిచేస్తున్న వారి ప్రయత్నాలను ప్రశంసించిన - నరేంద్ర మోదీ

ఇటీవల జరిగిన గ్లోబల్ ఆయుష్ సదస్సు లో తాను చేసిన ప్రసంగంలోని అంశాలను పంచుకున్న - గౌరవ ప్రధానమంత్రి

Posted On: 22 OCT 2022 7:21PM by PIB Hyderabad

ధంతేరాస్ పండుగ శుభ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.   ఆరోగ్యం మరియు క్షేమం తో ధంతేరాస్ కు గల సన్నిహిత అనుబంధం గురించి ప్రత్యేకంగా పేర్కొంటూ, భారతదేశ సాంప్రదాయ ఔషధాలు, యోగా పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ప్రధానమంత్రి, ఈ రంగాల్లో పనిచేస్తున్న వారి ప్రయత్నాలను ప్రశంసించారు.  ఇటీవల గ్లోబల్ ఆయుష్ సదస్సులో తాను చేసిన ప్రసంగంలోని అంశాలను కూడా పంచుకున్నారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ..... 

“ధంతేరాస్ పండుగ శుభ సందర్భంగా శుభాకాంక్షలు.  మన దేశ ప్రజలందరూ సమృద్ధిగా మంచి ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆశీర్వదించబడాలి.  సంపద సృష్టి స్ఫూర్తి మన సమాజంలో వికసిస్తూ ఉండాలి.  ధంతేరాస్ కు ఆరోగ్యం, క్షేమం తో కూడా సన్నిహిత సంబంధం ఉంది.  ఇటీవలి కాలంలో, భారత దేశ  సాంప్రదాయ ఔషధాలు, యోగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.  ఈ రంగాల్లో పనిచేస్తున్న వారిని అభినందిస్తున్నాను.  ఇటీవలి గ్లోబల్ ఆయుష్ సదస్సులో నా ప్రసంగాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను."  అని పేర్కొన్నారు.

*****

DS/TS

 

 

 



(Release ID: 1870450) Visitor Counter : 126