ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని రాజ్ కోట్‌లో 5,860 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
లైట్‌హౌస్ ప్రాజెక్టు కింద నిర్మించిన 1100 ఇళ్లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
ఇండియా అర్బన్ హౌసింగ్ సమ్మేళనం 2022ను ప్రారంభించిన ప్రధానమంత్రి
“అభివృద్ధి చెందిన ఇండియా కోసం అభివృద్ధి చెందిన గుజరాత్ మంత్రం దిశగా మనం కదులుతున్నాం”
“ రాజ్‌కోట్ నాకు నేర్పిస్తోంది. నేను నేర్చుకుంటున్నాను. రాజ్ కోట్‌నా మొదటి పాఠశాల”
“ మౌలికసదుపాయాలు,గౌరవం లేని జీవితంలో పేదరికం నుంచి బయటపడడం అసాద్యం”
“ గరీబీ హటావొ, రోటి-కపడా-మకాన్ వంటి నినాదాలు ఇచ్చి దశాబ్దాలు గడిచింది. అవి నినాదాలుగానే మిగిలాయి.”
“ గత ప్రభుత్వాలు ఒక బాధ్యతగా కాక, వారికి ఏదో మేలుచేస్తున్నట్టు ఇళ్లను నిర్మించాయి. అయితే పేదల ఇళ్లను మరింత మెరుగ్గా ఉండేలా చూడడం మా నిరంతర ప్రయత్నం”
“ గత రెండు దశాబ్దాలలో, రాజ్‌కోట్‌నుంచి ఇంజనీరింగ్ సంబంధిత ఎగుమతులు 5 కోట్ల రూపాయలను దాటాయి”
Posted On:
19 OCT 2022 8:17PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 5,860 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు . ప్రధానమంత్రి ఈ సందర్భంగా 2022 అర్బన్ హౌసింగ్ సమ్మేళనాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి లైట్‌హౌస్ ప్రాజెక్టు కింద 1100కుపైగా ఇళ్లను జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి జాతికి అంకితంచ ఏసిన ఇతర ప్రాజెక్టులలో నీటిసరఫరా ప్రాజెక్టు, బ్రహ్మణి -2 డామ్ నుంచి నర్మదా కెనాల్ పంపింగ్ స్టేషన్ వరకు మోర్బి బల్క్ పైప్ లైన్‌ప్రాజెక్టు, ప్రాంతీయ సైన్స్ సెంటర్, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, ఇతర రోడ్డు అనుసంధానిత ప్రాజెక్టులు ఉన్నాయి.
ప్రధానమంత్రి ప్రస్తతం గుజరాత్‌లని ఎన్‌హెచ్ 27 సెక్షన్ లో నాలుగులేన్లుగా ఉన్న రాజ్‌కోట్-గొండాల్-జేత్‌పూర్ మార్గాన్ని ఆరులేన్లగా మార్చే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే జిఐడిసి పారిశ్రామిక పార్కుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. మోర్బి, రాజ్‌కోడ్, బొటాడ్, జామ్‌నగర్, కచ్‌లలో 2950 కోట్ల రూపాయల వ్యయంతో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తారు.
ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టులలో గధకలోని ఎఎంయుఎల్-ఫెడ్‌డెయిరీ ప్లాంట్, రాజ్ కోట్‌లో ఇండోర్‌స్పోర్ట్స్ కాంప్లెక్స్, రెండు నీటిసరఫరా ప్రాజెక్టులు, రోడ్డు, రైల్వే రంగానికి సంబంధించి ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, నూతన సంకల్పాలు చేసుకునేందుకు, కొత్త ప్రారంభానికి ఇది సమయమని అన్నారు. కథియవార్, రాజ్‌కోట్ అభివృద్దికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేసుకుని మరికొన్ని ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్న సమయం ఇది అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులలో అనుసంధానత, పరిశ్రమలు, నీటిసరఫరా, ప్రజాసదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయని, ఇవి ప్రజల జీవితాన్ని మరింత సులభతరం చేయనున్నాయని అన్నారు.లైట్‌హౌస్ ప్రాజెక్టుకు సంబంధించి దేశంలోని ఆరు ప్రాంతాలలో రాజ్‌కోట్ ఒకటి అని ప్రధానమంత్రి చెప్పారు. 1144 ఇళ్లను అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించి జాతికి అంకితం చేయడం జరిగిందని ఆయన చెప్పారు. దీపావళికి ముందు వందలాది మందిపేదలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఇళ్లను పేదలకు అందించడంలో ఉన్న సంతోషం చెప్పనలవి కానిదని ఆయన అన్నారు. ఈ ఇళ్లకు యజమానులైన సోదరీమణులకు అభినందనలు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఇళ్లలో ఈ దీపావళికి లక్ష్మీ దేవి కొలువుదీరగలదన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
గడచిన 21 సంవత్సరాలలో మనం అందరం కలిసి ఎన్నో కలలుకన్నాం, ఎన్నో చర్యలు తీసుకున్నాం. ఎన్నో విజయాలూ సాధించాం అని ప్రధానమంత్రి గత సంవత్సరాలను ఒకసారి గుర్తుచేసుకున్నారు. “రాజ్ కోట్ నాకు ఎప్పుడూ నేర్పిస్తుంటుంది.నేను నేర్చుకుంటుంటాను. రాజ్ కోట్ నా ప్రథమ పాఠశాల” అని ప్రధానమంత్రి అన్నారు. మహాత్మాగాంధీ గారు కూడా ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. నేను ఎన్నటికీ మీ రుణం తీర్చుకోలేను. అని ప్రధానమంత్రి అన్నారు. మన విజయానికి ప్రత్యక్ష నిదర్శనం, ఇవాళ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు, లేదా ఇప్పటికే ఉద్యోగాలలో చేరిన వారని ఆయన అన్నారు.
రాజ్‌కోట్‌లో, మొత్తం రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడిన పరిస్థితి గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. యువకులు ఎలాంటి భయం లేకుండా పొద్దుపోయేవరకు బయట తమ పనులలో తిరుగుతూ తమ జీవితానికి సంబంధించిన పనులు చేసుకుంటుండడం చూసి తనకు ఎంతో సంతృప్తిగా ఉన్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. నేరస్థులు, మాఫియా, అల్లరిమూకలు, ఉగ్రవాదులను ఏరివేయడానికి తాము రాత్రింబగళ్లు శ్రమించామని అందుకే ఇది సంతృప్తిని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు. తమ శ్రమ వృధా కాలేదని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకోసం శాంతి సామరస్యంతో పనిచేస్తుండడం చూసి ఎంతో ఆనందంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు.
గడచిన కొన్ని దశాబ్దాలుగా ప్రతి గుజరాతీ వీలైనంత ఎక్కువ సామర్ధ్యం ,సమర్దత కలిగిఉండేట్టు తాము నిరంతరం కృషిచేస్తూ వచ్చినట్టు చెప్పారు. ఇందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడంతోపాటు , ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమైన చోట ప్రోత్సాహం అందించడమూ జరుగుతున్నదని అన్నారు. అభివృద్ధి చెందిన ఇండియాకోసం అభివృద్ది చెందిన గుజరాత్ అనే నినాదంతో ముందుకువెళుతున్నట్టు ఆయన తెలిపారు. వైబ్రంట్ గుజరాత్ ప్రచారం ద్వారా పెద్ద ఎత్తు పెట్టుబడులను ఆకర్షించడంపైన, పారిశ్రామిక ప్రగతిపైన ఒకవైపు దృష్టిపెట్టడంతోపాటు మరోవైపు గ్రామాలకు, పేదలకు సాధికారత కల్పించడానికి, కృషి మహోత్సవ్, గరీబ్ కల్యాణ్ మేలాల ద్వారా కృషి చేస్తున్నట్టుచెప్పారు. పేదలకు సాధికారత కల్పించినట్టయితే వారు పేదరికంనుంచి బయటపడడానికి సత్వర మార్గం ఉంటుందని ఆయన అన్నారు.
కనీస మౌలిక సదుపాయాలు లేని , గౌరవం లేని జీవితంతో పేదరికం నుంచి బయటపడడం అసాధ్యమని ప్రధానమంత్రి అన్నారు. టాయిలెట్, విద్యుత్, పైప్‌ద్వారానీటిసరఫరా, వంటగ్యాస్ సరఫరా, ఇంటర్నెట్ అనుసంధానత తో కూడిన ఇళ్లను పేదలకు కల్పిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.ఇలాగే ఏదైనా అనారోగ్యం ఏర్పడితే కుటుంబాలు పేదరికంలోకి జారిపోతాయని అంటూ, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయుష్మాన్‌భారత్ , పిఎంజెఎవై-ఎం.ఎ ను తీసుకువచ్చామని, పేదల కుటుంబాలకు నాణ్యమైన ఉచిత వైద్యం దీని ద్వారా లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు, పేదల పరిస్థితిని అర్థంచ చేసుకోలేదని అయన అన్నారు.అందుకే గరీబీ హటావో, రోటి-కపడా-మకాన్, వంటి నినాదాలు దశాబ్దాలక్రితమే ఇచ్చినా అవి కేవలం నినాదాలుగానే మిగిలిపోయాయని చెప్పారు. నినాదాలు ఇచ్చి, ఓట్లు పొంది స్వీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారన్నారు.
గత 8 సంవత్సరాలలో దేశంలోని గ్రామాలు, నగరాలలోని సుమారు 3 కొట్ల మంది పేదలకు పక్కా గృహాలు మంజూరు చేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. గుజరాత్‌లోని పట్టణాలలో పేదలకు 10 లక్షల గృహాలను ఆమోదించగా ఏడు లక్షల గృహాల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయినట్టు ప్రధానమంత్రి చెప్పారు. భూపేంద్ర భాయ్, ఆయన బృందం పేదలకు ఇళ్లనిర్మాణంలో అద్బుత కృషిచేస్తున్నారు. పేదలకే కాకుండా మధ్యతరగతి సొంత ఇంటి నిర్మాణ కలను కూడా సాకారం చేస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. గుజరాత్ లో మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు లక్షలాది మధ్యతరగతి కుటుంబాలకు 11 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసినట్టు ఆయన తెలిపారు. ఇదేకాకుండా పొరుగునగరాలనుంచి పనికోసం ఇక్కడకు వచ్చిన వర్కర్లకు తక్కువ అద్దెతో ఇళ్లు అందుబాటులో ఉండేట్టుచేసినట్టు తెలిపారు.
గత ప్రభుత్వాలు పేదల కోసం ఇళ్లను బాధ్యతో నిర్మించడం కాక వారికేదో మేలు చేస్తున్నట్టు నిర్మించారన్నారు. ఆ పద్ధతిని తాము మార్చామని ప్రధానమంత్రి అన్నారు. ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్లలలో చేరుతున్నవారికి తమ ఇంటిని తమకు ఇష్టమైన రీతిలో కట్టుకోవడానికి , దానిని అందంగా అలంకరించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు చెప్పారు. పేదల ఇళ్లు మరింత మెరుగ్గా ఉండేలా చూసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు. రాజ్‌కోట్ లో లైట్ హౌస్ ప్రాజెక్టు ఈ కోవలోనిదేనని అన్నారు. ఈ ప్రాజెక్టు విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి రాజ్ కోట్ ఇళ్ల నమూనాను తిలకించేందుకు దేశం వివిధ ప్రాంతాలనుంచి ఎంతోమంది వచ్చారని ఆయన అన్నారు. ఇవాళ గుజరాత్ ఆధునిక సదుపాయాలతో నిర్మించిన 11వందల ఇళ్లను నిర్మించుకుందని, భవిష్యత్తులో లక్షలాది మంది పేద ప్రజలు పక్కా ఇళ్లను పొందనున్నారని ఆయన తెలిపారు.
ఈ గృహాల ప్రయోజనం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, రాజ్‌కోట్‌లో నిర్మించిన అధునాతన ఇళ్లు అందుబాటుధరలో , ఇళ్లను నిర్మించడంలో భారీ ముందడుగుగా చెప్పారు. ఇది గృహ నిర్మాణరంగంలో విప్లవాత్మక మార్పుకు దారితీస్తుందని అన్నారు.ఈ రకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంలో మన యువత చొరవ తీసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, దేశంలో కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ వేలాది మందియువతకు శిక్షణనిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు.
రోడ్లు, బజార్లు, మాల్స్, ప్లాజాలు మాత్రమే కాకుండా నగర జీవితానికి సంబంధించిన సదుపాయాలు కూడా ముఖ్యమని ప్రధానమంత్రి అన్నారు. తొలిసారిగా, ప్రభుత్వం వీధివ్యాపారుల బాధ్యతను అర్ధం చేసుకుందని అన్నారు. తొలిసారిగా, వారిని బ్యాంకులతో అనుసంధానం చేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ఇవాళ వీరు స్వనిధి పథకం కింద సులభ రుణాలు పొందుతున్నారని, వ్యాపారాలను విస్తరించుకునే విషయం ఆలోచిస్తున్నారని అన్నారు. ఇవాళ వెండర్లు డిజిటల్ లావాదేవీల ద్వారా డిజిటల్ ఇండియాకు బలం చేకూరుస్తున్నారన్నారు.
రాజ్ కోట్ లో ఎం.ఎస్.ఎం.ఇల సంఖ్య గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, పారిశ్రామిక నగరంగా రాజ్‌కోట్‌కు పేరున్నదని ఎం.ఎస్.ఎం.ఇలకు ఇది కీలక కేంద్రమని అన్నారు. రాజ్ కోట్ లో తయారైన పంపులు,యంత్రాలు,ఉపకరణాలు వాడని ప్రదేశం దేశంలో లేదని ఆయనన్నారు. ఇందుకు ఉదాహరణ చెబుతూ ప్రధానమంత్రి ఫాల్కన్ పంప్, ఫీల్డ్ మార్షన్, ఏంజెల్ పంప్, ఫ్లోటెక్ ఇంజనీరింగ్, జలగంగాపంప్, సిల్వర్ పంప్, రోటెక్‌పంప్, సిద్ధి ఇంజనీర్స్, గుజరాత్ ఫోర్జింగ్, టాప్‌లాండ్ ల గురించి ప్రస్తావించారు. రాజ్‌కోట్ ఉత్పత్తులు, ప్రపంచంలో, దేశంలో ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయని ఆయన అన్నారు.
గడచిన రెండు దశాబ్దాలలో రాజ్ కోట్ నుంచి ఎగుమతి అవుతున్న ఇంజినీరింగి్ సంబంధిత ఉత్పత్తుల విలువ 5 వేల కోట్ల రూపాయలను దాటిందని ప్రధానమంత్రి తెలిపారు. రాజ్‌కోట్‌లో ఫ్యాక్టరీల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ అయ్యాయని, కార్మికుల సంఖ్యకూడా ఎన్నో రెట్లు పెరిగిందని అన్నారు. ఇలాంటి వాతావరణంలో వేలాది మంది మన శ్రామికులకు ఉపాధి లభించిందని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే మోర్బి కూడా అద్భుత ప్రగతి సాధించిందన్నారు. మోర్బి సిరామిక్ టైల్స్ ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి చెందాయని ఆయన తెలిపారు.గోడలు, రూము నేల, బాత్‌రూంలు, టాయిలెట్లు ఇలా ఏవైనా మోర్బి టైల్స్‌లేకుండా పూర్తి కావని అన్నారు. 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సిరామిక్ పార్క్‌ను నిర్మిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు . ప్రగతిదాయక పారిశ్రామిక విధానం కలిగినందుకు రాష్ట్రప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర హౌసింగ్, అర్బన్ వ్యవహారాల కేంద్ర మంత్రి శ్రీహర్దీప్‌సింగ్‌పూరి, కేంద్ర గృహ, ప్టటణ వ్యవహారాల శాఖసహాయమంత్రి శ్రీ కౌశల్ కిషోర్, గుజరాత్ మాజీ గవర్నర్ శ్రీ వాజుభాయి వాల, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాని, పార్లమెంటు సభ్యలు శ్రీమోహన్‌భాయ్‌కుండరియా, శ్రీరమాభాయ్ కొమారియా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేపథ్యంః
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో 5960 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలుచేశారు. ప్రధానమంత్రి ఈ సందర్బంగా ఇండియా అర్బన్ హౌసింగ్ సమ్మేళనాన్ని కూడా ప్రారంభించారు. దేశంలో గృహ నిర్మాణం, ప్లానింగ్, డిజైన్, విధాన నిర్ణయాలు, నియంత్రణలు, అమలు , మన్నిక, సమ్మిళితత్వం వంటి పలు అంశాలపై ఇందులో చర్చిస్తారు. ప్రధానమంత్రి వినూత్న నిర్మాణ విధానాలపై ఎగ్జిబిషన్ నుప్రారంభించారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల సందర్భంగా ప్రధానమంత్రి లైట్ హైస్ ప్రాజెక్టు కింద చేపట్టిన 1100 ఇళ్లను జాతికి అంకితం చేశారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. బ్రహ్మని డామ్ -2 నుంచి నర్మదా కెనాల్ పంపింగ్ స్టేషన్ వరకు మోర్బి-బల్క్ పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ప్రాంతీయ సైన్స్‌సెంటర్, ఫ్లైఓవర్లు,బ్రిడ్జిలు, పలు రహదారుల ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.
గుజరాత్ లోని ఎన్‌హెచ్ 27 సెక్షన్‌లో రాజ్‌కోట్ -గొండాల్-జేత్‌పూర్ మార్గంలో ప్రస్తుతం ఉన్న నాలుగులేన్ల మార్గాన్ని ఆరులేన్ల మార్గంగా మార్చే కార్యక్రమానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే ప్రధానమంత్రి మోర్బి, రాజ్‌కోట్, బొటాడ్, జామ్‌నగర్,కచ్‌లలో పలు ప్రాంతాలలో రూ 2950 కోట్ల రూపాయల వ్యయంతో జిఐడిసి పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ఇతర ప్రాజెక్టులలో గధక వద్దఎఎంయుఎల్ డైరీప్లాంటు, రాజ్‌కోట్‌లో ఇండోర్ క్రీడా ప్రాంగణం నిర్మాణం, రెండు నీటిసరఫరా ప్రాజెక్టులు, రోడ్డు , రైల్వే సెక్టర్లో పలు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి.
*****
DS/TS
(Release ID: 1869644)
Visitor Counter : 182
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam