ప్రధాన మంత్రి కార్యాలయం

లోథాల్‌ లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ పనుల పురోగతిని అక్టోబర్ 18వ తేదీన సమీక్షించనున్న - ప్రధానమంత్రి


భారతదేశ గొప్ప, వైవిధ్యమైన సముద్ర వారసత్వాన్ని గొప్పగా ప్రదర్శించనున్న - ఎన్.ఎమ్.హెచ్.సి.


ఒక వైవిధ్యమైన అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనున్న - ఎన్.ఎమ్.హెచ్.సి.


దాదాపు 3, 500 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకోనున్న - ఎన్.ఎమ్.హెచ్.సి. ప్రాజెక్టు

Posted On: 17 OCT 2022 7:25PM by PIB Hyderabad

గుజరాత్‌ లోని లోథాల్‌ లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ కు చెందిన క్షేత్ర స్థాయి పనుల పురోగతిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 అక్టోబర్, 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షిస్తారు. అనంతరం, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

హరప్పా నాగరికత లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన "లోథాల్" ఇప్పుడు ఒక పురాతన మానవ నిర్మిత డాక్‌ యార్డ్ ఆవిష్కరణకు కూడా ప్రసిద్ధి చెందింది.  లోథాల్‌ లోని ఈ సముద్ర వారసత్వ ప్రాంగణం - చారిత్రక సంస్కృతి, వారసత్వాలకు తగిన నివాళిగా నిలుస్తుంది. 

భారతదేశ గొప్ప, వైవిధ్యమైన సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, లోథాల్ ను ఒక ప్రపంచ స్థాయి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఉద్భవించడానికి అనువైన ఒక వైవిధ్యమైన ప్రాజెక్టుగా లోథాల్‌ లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్.ఎం.హెచ్.సి) ను  అభివృద్ధి చేయడం జరుగుతోంది.   ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యాటక సామర్ధ్యం పెరగడంతో పాటు, ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధి కూడా పెరుగుతుంది. 

2022 మార్చి నెలలో ప్రారంభమైన ఈ కాంప్లెక్స్‌ ను దాదాపు 3,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు.  హరప్పా వాస్తుశిల్పం, జీవనశైలిని పునఃసృష్టి చేయడానికి లోథాల్ మినీ రిక్రియేషన్;  మెమోరియల్ థీమ్ పార్క్, మారిటైమ్ & నేవీ థీమ్ పార్క్, క్లైమేట్ థీమ్ పార్క్, అడ్వెంచర్ & అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ పేరుతో నాలుగు థీమ్ పార్కులు;  ప్రపంచంలోనే ఎత్తైన లైట్‌ హౌస్ మ్యూజియం;  హరప్పా కాలం నుండి ఇప్పటి వరకు భారతదేశ సముద్ర వారసత్వాన్ని గొప్పగా ప్రదర్శించే పద్నాలుగు గ్యాలరీలు;  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విభిన్న సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించే సముద్ర తీర రాష్ట్రాల పెవిలియన్;  వంటి అనేక వినూత్నమైన, ప్రత్యేక ఆకర్షణలు ఈ కాంప్లెక్స్ లో ఉంటాయి. 

 

*****



(Release ID: 1868662) Visitor Counter : 141