ప్రధాన మంత్రి కార్యాలయం

మాతృభాష లో వైద్య విద్య బోధన మొదలవడం పట్ల అభినందనల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 16 OCT 2022 7:07PM by PIB Hyderabad

భోపాల్  లో వైద్య విద్య బోధన హిందీ లో ఆరంభం కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మకమైనటువంటి ప్రస్థానం లక్షల కొద్దీ విద్యార్థుల ను వైద్యాన్ని వారి యొక్క మాతృ భాష లో అభ్యసించేందుకు సశక్తులను గా చేయడం తో పాటు దేశం లో ఒక సకారాత్మకమైన పరివర్తన ను తీసుకు వస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. అంతేకాక, ఇది విద్యార్థుల కు అవకాశాల తాలూకు అనేకమైన ద్వారాల ను తెరుస్తుంది అని కూడా ఆయన అన్నారు.

హోం శాఖ మంత్రి శ్రీ అమిత శాహ్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి తాను ఒక ట్వీట్ లో శేర్ చేస్తూ, అందులో -

‘‘వైద్య విద్య రంగం లో జరిగినటువంటి శుభారంభం దేశం లో ఒక పెద్ద సకారాత్మకమైన మార్పు ను తీసుకురాబోతోంది. దీని వల్ల లక్షల కొద్దీ విద్యార్థులు వారి భాష లో చదువుకోగలుగుతారు, అంతేకాకుండా వారికి అవకాశాలు అనేకం లభిస్తాయి కూడాను.’’ అని పేర్కొన్నారు.

मेडिकल शिक्षा के क्षेत्र में हुआ यह शुभारंभ देश में एक बड़ा सकारात्मक बदलाव लाने वाला है। इससे लाखों विद्यार्थी जहां अपनी भाषा में पढ़ाई कर सकेंगे, वहीं उनके लिए अवसरों के भी अनेक द्वार खुलेंगे। https://t.co/kuD9CErsPu

— Narendra Modi (@narendramodi) October 16, 2022

*****

DS/TS

 

 



(Release ID: 1868356) Visitor Counter : 146