ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోవిడ్ 19 కాలాని కంటే ముందు కాలం నుండి ఇప్పటి వరకు అత్యధికసంఖ్య లో ప్రయాణికుల కు సేవల ను అందించినందుకు గాను భారతదేశం పౌర విమాన యాన రంగాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 11 OCT 2022 10:26AM by PIB Hyderabad

భారతదేశం లో విమానయాన రంగం రోజువారీ 4 లక్షల మంది ప్రయాణికుల స్థాయి ని అందుకోవడం ఒక్కటే కాకుండా కోవిడ్ 19 విజృంభణ కాలం కంటే మునుపటి నుండి ఇప్పటి వరకు చూస్తే అత్యధిక సంఖ్య లో ప్రయాణికుల కు సేవల ను అందించినందుకు కూడా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసల ను వ్యక్తం చేశారు. భారతదేశం అంతటా కనెక్టివిటీ ని మరింత గా మెరుగుపరచడం పైన శ్రద్ధ వహించడం జరుగుతోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది జీవనాన్ని సులభతరం గా తీర్చిదిద్దడం కోసం మరియు ఆర్థిక ప్రగతి కోసం ముఖ్యం అని కూడా ఆయన అన్నారు.

పౌర విమాన యానం శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియా చేసిన ఒక ట్వీట్ ను ప్రధానమంత్రి ఉదాహరిస్తూ -

‘‘ఇది ఒక గొప్ప సంకేతం గా ఉంది. భారతదేశం అంతటా కనెక్టివిటీ ని మరింతగా మెరుగుపరచడం పైనే మా శ్రద్ధ అంతా. ఇది జీవనాన్ని సులభతరం గా తీర్రిదిద్దడం తో పాటు ఆర్థిక ప్రగతి కి కూడా ముఖ్యం.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1866726) आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam