ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ గుజరాత్‌లోని అంబాజీలో రూ 7200 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్దిపనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపట్టిన 45,000 ఇళ్లను జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు.
తరంగా హిల్- అంబాజీ- అబూరోడ్ కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రసాద్ పథకం కింద అంబాజీ ఆలయం వద్ద ప్రయాణికుల సదుపాయాల అభివృద్దికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
పశ్చిమ సరకు రవాణా ప్రత్యేక కారిడార్‌లోని నూతన పలన్‌పూర్- నూతన మహెసనా సెక్షన్‌లోని 62 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ను, 13 కిలోమీటర్ల పొడవైన న్యూ పాలన్‌పూర్ - న్యూ ఛతోదార్‌సెక్షన్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.
“అంబా మాత దీవెనలతో, మనం మన సంకల్పాలన్నింటినీ నెరవేర్చుకునేందుకు తగిన శక్తిని సమకూర్చుకుంటాము”
“ మనం మన భారతదేశాన్ని భరత మాతగా చూస్తాం. మనం అందరం మనల్ని ఆ తల్లి బిడ్డలుగా భావించుకుంటాం”
“ దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ ఇచ్చే పథకానికి కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నది”
“ పండగ సీజన్ లో సోదరీమణులు, తల్లులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో పిఎంజికెఎవైని పొడి
Posted On:
30 SEP 2022 8:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ఈ రోజు అంబాజీలో 7200 కోట్ల రూపాయలకు పైగా విలువగల వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపనలు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 45,000 ఇళ్లను జాతికిఅంకితం చేసి, శంకుస్థాపనలు చేశారు. తరంగా హిల్-అంబాజి- అబురోడ్ కొత్త బ్రాడ్ గేజ్ లైన్ కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే అంబాజి ఆలయం వద్ద ప్రసాద్ పథకం కింద యాత్రికులకు సదుపాయాల అభివృద్దికి శంకుస్థాపన చేశారు.పశ్చిమ ప్రత్యేక సరకురవాణాకారిడార్ లోని 62 కిలోమీటర్ల పొడవుగల న్యూ పలన్‌పూర్-న్యూ మహెసానా సెక్షన్‌ను అలాగే 13 కిలోమీటర్ల పొడవుగల న్యూ పలన్‌పూర్ -న్యూ చతోదార్ సెక్షన్ (పలన్‌పూర్ బైపాస్ లేన్)ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.
మిథా-థరడ్- దీశా రోడ్‌తోపాటు పలు రోడ్డు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.
వివిధ గృహనిర్మాణ పథకాల కింద ఏడుగురు లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఇంటి తాళాలను అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి గోమాతా పోషణ్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించి గోశాలలకు చెక్కులు అందజేశారు. ఇళ్లను పొందిన పలువురు లబ్ధిదారులతో ప్రదానమంత్రి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.
ఈ సందర్భంగా సమావేశమైన వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నవరాత్రులలో ఐదవరోజున మా అంబాదేవి దర్శనం చేసుకునే అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు దేశం సంకల్పం చెప్పుకున్న సమయంలో తాను అంబాజీ మాత దర్శనానికి వచ్చినట్టు ప్రధానమంత్రి అన్నారు. మా అంబా దేవి ఆశీస్సులతో మన సంకల్పాలను నెరవేర్చుకునే శక్తి మనకు లభించగలదని ప్రధానమంత్రి అన్నారు.
గృహనిర్మాణ పథకాల కింద ప్రయోజనం పొందిన 61 వేల మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. వారికి అద్భతమైన దీపావళి వారికోసం ఎదురుచూస్తున్నదని అన్నారు. భారతదేశంలో మహిళలను గౌరవించుకునే సంప్రదాయం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. మహిళలను గౌరవించుకోవడం గురించిన ప్రస్తావన వచ్చినపుడు , సహజంగానే మన గురించిన ప్రస్తావనే వస్తుంది . మనం దీనిని సీరియస్‌గా ఆలోచించినపుడు, మన సంస్కృతిలో మహిళలకు సంబంధించి ఎంత సంస్కారం ఉందో చూడండి.ఇతర దేశాలలో లాగా కాకుండా మన సంస్కృతిలో శక్తి కి ప్రతిరూపంగా మహిళని భావిస్తాం. గొప్పగొప్ప యోధులను స్మరించుకునేటపుడు వారిపేర్లను వారి తల్లిగారి పేరుతో కలిపి స్మరించుకునే సంప్రదాయం మనది. అర్జునుడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడి పేర్లను ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇది మన సంస్కారం అని ఆయన అన్నారు. మన దేశాన్ని భరతమాత అంటామని, తల్లిగా భావిస్తామని ప్రధానమంత్రి అన్నారు. మనం భరతమాత బిడ్డలుగా చెప్పుకుంటామన్నారు. ఇంతేకాకుండా గతంలో మహిళలకు ఆర్ధిక విషయాలలో పరిమిత హక్కులు, వారి మాట చెల్లుబడి కావడం ఉండేదని కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. చాలా ఇళ్లల్లో ఇప్పుడు వివిధ గృహ పథకాల కింద ఇళ్లకు మహిళలు యజమానులుగానో లేక సహ యజమానులుగా నో ఉన్నారని గుర్తుచేశారు. దేశంలో 3 కోట్ల ఇళ్లను పేదల కుటుంబాలకు అందజేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు.
ఈ పండగ సీజన్ లో ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలియజేశారు. దీనివల్ల 80 కోట్ల మంది ప్రజలకు ఉపశమనం లభిస్తోందని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన సోదరీమణులు,తల్లులు పండగ సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించినట్టు తెలిపారు.గత రెండు దశాబ్దాలుగా సోదరీమణులు, తల్లుల సాధికారత కోసం కృషిచేసే అవకాశం తనకు లభించడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మార్పునకు బనస్కంఠ సాక్ష్యమని ఆయన అన్నారు.
ఈ ప్రాంత మహిళలకు తాను ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి గుర్తుచేసుకుంటూ, తన పిలుపును గౌరవించినందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నర్మాదనది నీరు ఈ ప్రాంత ప్రజలలో సంతోషాన్ని నింపిందని అంటూ బాలికలు ఎంతో ఉత్సాహంతో పాఠశాలలు ,కళాశాలలకు హాజరవుతున్నారన్నారు. పౌష్టికాహార లోపంపై యుద్ధం ప్రకటించడంలో వారి సహకారాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. 2014 తర్వాత దేశంలోని మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క పార్శ్వం విషయంలో శ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. వారు దేశ ప్రగతికి చోదకశక్తులుగా మారారని ఆయన తెలిపారు.
దేశంలో మహిళా శక్తి గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్నప్రతి పథకంలో మహిళలే కీలకమని ఆయన అన్నారు. టాయిలెట్ల నిర్మాణ, గ్యాస్ కనెక్షన్లు, హర్ ఘర్ జల్, జన్ ధన్ ఖాతాలు, లేదా ముద్రా పథకం కింద గ్యారంటీ అవసరం లేని రుణాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తల్లి సంతోషంగా ఉంటే , కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటే సమాజం సంతోషంగా ఉంటుంది, సమాజం సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుది. ఇది సరైన అభివృద్ధి. ఇందుకోసంమేం నిరంతరం కృషి చేస్తున్నాం అని ప్రధానమంత్రి అన్నారు.
తరంగాహిల్- అంబాజి- అబూరోడ్ లైన్ నిర్మాణం గురించి 1930లో బ్రిటిషవారి హయాంలో ఆలోచన చేశారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ మార్గం అవసరాన్ని వంద సంవత్సరాల క్రితం గుర్తించారని, అయితే దురదృష్టవశాత్తు ఇంత సుదీర్ఘకాలం అది సాకారం కాలేదని అన్నారు. అయితే మా అంబా ఈ పనిని తనచేత చేయించాలని అనుకున్నారని అంటూ ప్రధానమంత్రి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఈ మార్గాన్ని అంబా మాత పాదాల చెంత జాతికి అంకితం చేసుకునే అదృష్టం లభించిందని ఆయన అన్నారు. ఈ రైల్వే లైను, బై పాస్ లైన్ ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తుందని, మార్బుల్ పరిశ్రమకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కిసాన్ రైల్ ఇక్కడినుంచే ప్రారంభమవుతున్నందువల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. గబ్బర్ తీర్థ్ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కృషి చేయడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
అంబా మా ఆలయ పరిసరాలలో ఎన్నో ఆకర్షణీయ ప్రదేశాలను తీర్చిదిద్దడం తన లక్ష్యమని , దీనితో వీటిని దర్శించడానికి ప్రజలు రెండు మూడు రోజులు ఈ పరిసర ప్రాంతాలలో గడపగలుగుతారన్నారు. ఒక వైపు అంబాజీ ఆలయం విశ్వాసానికి , ఆరాధనకు సంబంధించినదని మరోవైపు దగ్గరలోనే భారరత సరిహద్దులు ఉన్నాయని, అక్కడ మన జవాన్లు సరిహద్దులను కాపాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సుయిగమ్‌తాలూకాలో సీమా దర్శన్ ప్రాజెక్టును ప్రారంభించిన విషయాన్ని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు , సరిహద్దు భద్రతా దళానికి చెందిన భారతీయ జవాన్ల జీవన శైలిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇది ఉపయోగపడుతుందని అన్నారు. పర్యాటకులకు కూడా ఇదే అనుభవాన్ని కలిగిస్తుందన్నారు. ఇది రాష్ట్రీయ ఏకత (జాతీయ సమైక్యత)కు మరింత శక్తిని ఇస్తుందని , ఈ ప్రాంతంలో పర్యాటకంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని పంచ ప్రాణ్ (ఐదు సంకల్పాలలో) ఇది ఒకటి అని ఆయన అన్నారు. దీశా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఏర్పాటుకానున్న రన్‌వే, ఇతర అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో మన వాయుసేన రక్షణ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను పెద్ద ఎత్తున చేపట్టడానికి అవసరమైన ఊపును ఇది సమకూరుస్తుందన్నారు.
గత రెండు దశాబ్దాలలో ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల బనస్కంఠ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ప్రధానమంత్రి అన్నారు. క్షేత్ర స్థాయిలో ఈ మార్పు ను సాధించడం వెనుక మహిళల కృషి ఉందని ప్రధానమంత్రి ప్రశంసించారు. నర్మదా నీరు, సుజలాం సుఫలాం, డ్రిప్ ఇరిగేషన్ వంటివి ఈ ప్రాంతంలో పరిస్థితుల మార్పులో కీలక పాత్ర పోషించాయని ప్రధానమంత్రి అన్నారు. రైతులు , మహిళలు, యువత, ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులవల్ల ప్రయోజనం పొందనున్నారని అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ , కేంద్ర రైల్వేశాఖమంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్, కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీమతి దర్శన విక్రంజర్దోష్, పార్లమెంటు సభ్యులు శ్రీ సి.ఆర్. పాటిల్, శ్రీ ప్రభాత్ భాయ్ పటేల్, శ్రీ బారాసిన్హ్ ధాబి, శ్రీ దినేష్ భౄయ్ అనవైద్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబాజీలో సుమారు 7,200 కోట్ల రూపాయల విలువగల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పలు పథకాలకు శంకుస్థాపన చేశారు. పిఎం ఆవాస్ యోజన కింద చేపట్టిన 45,000 ఇళ్ల పథకానికి ప్రధానమంత్రి శంకుస్థాపనచేశారు. తరంగా హిల్- అంబాజి- అబురోడ్ కొత్త బ్రాడ్‌గేజ్ లైన్ పథకానికి ,ప్రసాద్ పథకం కింద అంబాజి ఆలయానికి యాత్రికుల సదుపాయాల అభివృద్ధికి ప్రధానమంత్రి శంకుస్థాపనచేశారు. ఈ కొత్త రైల్వే లైన్ పథకం అంబాజిని దర్శించే లక్షలాది మంది యాత్రికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇది భక్తులకు మరింత భక్తి భావన కల్పిస్తుంది.ఇతర ప్రాజెక్టులలో దీశా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రన్‌వే నిర్మాణంఆనికి శంకుస్థాపన, అంబాజీ బైపాస్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన ఉన్నాయి.
ప్రధానమంత్రి, పశ్చిమ సరకురవాణా ప్రత్యేక కారిడార్ కింద 62 కిలోమీటర్ల పాలన్‌పూర్ - న్యూ మహెసనా సెక్షన్, 13 కిలోమీటర్ల పొడవైన న్యూ పాలన్‌పూర్ - న్యూ చతోదర్ సెక్షన్ (పాలన్‌పూర్ బైపాస్ లైన్)లను జాతికి అంకితం చేశారు. ఇది పిపావ్, దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ (కాండ్లా), ముంద్ర, గుజరాత్‌లోని ఇతర పోర్టులతో అనుసంధానాన్ని మెరుగు పరుస్తుంది. ఈ సెక్షన్ల ప్రారంభంతో 734 కిలీమీటర్ల పొడవైన పశ్చిమ ప్రత్యేక సరకురవాణా కారిడార్ ఉపయోగంలోకి వస్తుంది. ఈ సెక్షన్ల ప్రారంభంతో మెహసనా- గుజరాత్‌లోని పాలన్‌పూర్, స్వరూప్ గంజ్, కేశవ్‌గంజ్, రాజస్థాన్ లోని కిషన్‌ఘర్, హర్యానాలోని రేవారి- మనేసర్, నర్నౌల్‌లలోని పరిశ్రమలు ఎంతో ప్రయోజనం పొందుతాయి. ప్రధానమంత్రి మిథా- థారడ్- దీశారోడ్డు వెడల్లపుతోపాటు పలు రోడ్డు ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేశారు.
పలు అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు కల్పించాలని, నగర ప్రాంతాలలో ప్రయాణసదుపాయాలను సుఖవంతంగా తీర్చిదిద్దాలని, బహుళ ప్రయోజనకర రవాణా అనుసంధానతను కల్పించాలన్న ప్రధానమంత్రి గారి సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సామాన్యుడి సులభతర జీవనాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం దృష్టిపెడుతున్నదాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
(Release ID: 1864323)
Visitor Counter : 206
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam