ప్రధాన మంత్రి కార్యాలయం
సూరత్ లో 3,400 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన వివిధప్రాజెక్టుల కు శంకుస్థాపన చేసి వాటి ని దేశప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
‘‘ప్రజల సంఘీభావం మరియు పబ్లిక్ భాగస్వామ్యం.. ఈ రెండిటి కి ఒక అద్భుతమైన ఉదాహరణ గా సూరత్ ఉంది’’
‘‘4 పి అంటే ప్రజలు, పబ్లిక్, ప్రైవేటు మరియు పార్ట్ నర్ శిప్ లు అనిఅర్థం; ఈ నమూనా సూరత్ ను విశిష్టమైంది గా చేస్తోంది’’
‘‘జోడు ఇంజిన్ ప్రభుత్వం లో, క్లియరెన్సు లు మరియు అభివృద్ధి పనుల అమలుఇదివరకు ఎన్నడు లేనంతటి వేగగతి ని అందుకొన్నాయి’’
‘‘కొత్త నేశనల్ లాజిస్టిక్స్ పాలిసీ సూరత్ కు చాలా లబ్ధి కలగనుంది’’
‘‘సూరత్ అతి త్వరలో విద్యుత్తు వాహనాల తయారీదారు గా కూడా ప్రసిద్ధం కానుంది’’
‘‘విశ్వాసం వృద్ధి చెందినప్పుడు, ప్రయాస వృద్ధి చెందినప్పుడు మరి దేశాభివృద్ధి తాలూకువేగం ‘సబ్ కా ప్రయాస్’ ద్వారా జోరందుకొంది’’
Posted On:
29 SEP 2022 1:09PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 3,400 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన వివిధ ప్రాజెక్టుల కు సూరత్ లో ఈ రోజు న శంకుస్థాపన చేయడంతో పాటు గా ఆయా ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేశారు. రహదారి మౌలిక సదుపాయాల యొక్క ఒకటో దశ పనుల ను మరియు డాయమండ్ రిసర్చ్ ఎండ్ మర్కంటైల్ (డిఆర్ఇఎఎమ్- డ్రీమ్) సిటీ యొక్క ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు తాలూకు రెండో దశ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. దీనికి తోడు, భీమ్ రాడ్ - బమ్ రోలీ వంతెన, డాక్టర్ హెడ్గేవార్ వంతెన ల మధ్య న ఉన్నటువంటి 87 హెక్టేర్ ల ప్రాంతం లో నిర్మిస్తున్న బయోడైవర్సిటీ పార్కు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. సూరత్ లో గల సైన్స్ సెంటర్ లో ఖోజ్ మ్యూజియాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మంగళప్రదం అయినటువంటి నవరాత్రి సందర్భం లో సూరత్ లో అనేక ప్రాజెక్టుల కు ప్రారంభించే, త్వరలో రూపుదాల్చే ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేసే అవకాశం లభించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పసందైన వంటకాల కు నిలయం అయినటువంటి సూరత్ కు రావడం అంటే అది నవరాత్రి ఉపవాస దీక్ష ను పాటిస్తున్న తన వంటి ఒక వ్యక్తి కి కాస్త భయపెట్టే విషయమే సుమా అంటూ ఆయన చమత్కరించారు. 75 అమృత్ సరోవరాల నిర్మాణ పని పూర్తి స్థాయి లో జరుగుతూ ఉండటం పట్ల సైతం ప్రధాన మంత్రి తన ప్రసన్నత ను వ్యక్తం చేశారు. ప్రజల సంఘీభావాని కి మరియు సార్వజనిక భాగస్వామ్యాని కి సూరత్ నగరం ఒక అపురూపమైనటువంటి ఉదాహరణ గా ఉంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. సూరత్ లో అత్యంత ప్రధానమైన అంశాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ అది ఈ నగరం శ్రమ ను సమ్మానించడమేనన్నారు. ‘‘సూరత్ నేల మీద నివసించని వ్యక్తులు భారతదేశం లో ఏ ప్రాంతం లోనూ ఉండరు; ఇది ఓ బుల్లి భారతదేశం వంటిది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఈ శతాబ్దం లోని తొలి దశాబ్దుల లో ‘3 పి’ లను గురించి ప్రపంచం లో చర్చించడం జరిగింది అని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, ఆ మూడు పబ్లిక్, ప్రైవేటు, పార్ట్ నర్ శిప్ లు అని వివరించారు. అయితే, సూరత్ ‘4 పి’ లకు ఒక దృష్టాంతం గా నిలచింది అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ‘‘ఆ ‘4 పి’ లు ఏవేవి అంటే పీపల్ (ప్రజలు), పబ్లిక్, ప్రైవేట్ మరియు పార్ట్ నర్ శిప్ లే అని ఆయన చెప్పారు. ఈ నమూనా సూరత్ ను ప్రత్యేకమైందిగా దిద్దితీర్చింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం, ప్రపంచం లో కెల్లా అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న నగరాల సరసన సూరత్ స్థానాన్ని సంపాదించుకొంది, ఇది అంటువ్యాధుల కు మరియు వరదల కు ఈ నగరం మారుపేరు అనేటటువంటి అపఖ్యాతి ని తెచ్చుకొన్న కాలం కంటే చాలా భిన్నమైంది అని ఆయన అన్నారు. సూరత్ నాగరిక జీవనం లో బయోడైవర్సిటీ పార్కు తీసుకురాగల ప్రయోజనాల ను గురించి ఆయన సమగ్రం గా తెలియజేశారు.
జంట ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఒనగూరిన సకారాత్మక ప్రభావాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, సూరత్ లో పేద ప్రజలు మరియు మధ్యతరగతి కుటుంబాల కు ఇళ్ళ నిర్మాణం, ఇతర సదుపాయాలు చెప్పుకోదగినంత గా పెరిగాయి అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అందిన లాభాల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, దేశం లో ఇంతవరకు సుమారు 40 మిలియన్ పేద రోగులు ఈ పథకం లో ఉచిత చికిత్స ను అందుకొన్నారు అని పేర్కొన్నారు. ‘‘వారిలో గుజరాత్ నుండి 32 లక్షల మంది కి పైగా రోగులు ఉన్నారు, అందులో సూరత్ నుండే దాదాపు గా 1.25 లక్షల మంది ఉన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
సూరత్ లో వస్త్రాల వ్యాపారాన్ని గురించి మరియు వజ్రాల వ్యాపారాన్ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, అది దేశం అంతటా అనేక కుటుంబాల మనుగడ కు ఊతం గా నిలుస్తున్నది అని పేర్కొన్నారు. డ్రీమ్ సిటీ ప్రాజెక్టు పూర్తి అయింది అంటే గనక సూరత్ ప్రపంచం లోని అత్యంత భద్రమైనటువంటి మరియు అత్యధిక సౌకర్యవంతం అయినటువంటి వజ్రాల వ్యాపార కేంద్రాల లో ఒకటి గా అభివృద్ధి చెందుతుందన్నారు. నగరం లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, నగరం నుండి విమానాశ్రయాని కి దారి తీసే రహదారి ఈ నగరం యొక్క సంస్కృతి కి, సమృద్ధి కి మరియు ఆధునికత్వాని కి అద్దం పడుతోందన్నారు. అప్పట్లో దిల్లీ లో అధికారం లో ఉన్న ప్రభుత్వం ఈ నగరాని కి ఒక విమానాశ్రయం ఏర్పడవలసిన అవసరాన్ని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘చూడండి ఇవాళ, ఎన్ని విమాన సర్వీసులు ఇక్కడ నుండి నడుస్తున్నాయో, ఎంత మంది రోజూ ఇక్కడ కు విచ్చేస్తున్నారో ’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సూరత్ మెట్రో కు ఆమోదం అవసరపడిన వేళ సైతం ఇటువంటి స్థితే తలెత్తింది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు.
లాజిస్టిక్స్ కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఏ వ్యాపారాని కి అయినా ఇది ఎంత ముఖ్యమో సూరత్ ప్రజలే ఎరుగుదురు అన్నారు. నేశనల్ లాజిస్టిక్స్ పాలిసీ ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, బహుళ విధ సంధానం ఆధారితమైన ఒక భారీ ప్రాజెక్టు పనులు పురోగతి లో ఉన్నాయి అన్నారు. హజీరా ఘోఘా రోపాక్స్ ఫెరీ సర్వీసు 400 కిలో మీటర్ ల రహదారి మార్గం దూరాన్ని కుదించివేయడం ద్వారా అటు కాలాన్ని, ఇటు డబ్బు ను.. ఈ రెండిటి ని ఆదా చేస్తున్నది. రోపాక్స్ గుండా వెళ్తే 10 నుండి 12 గంట లు పట్టేది కాస్తా నాటకీయం గా 3 లేక 4 గంటల కు తగ్గిపోతుంది అన్నారు. సూరత్ నుండి కాశీ కి మరియు ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాల కు సంధానాన్ని గురించి ప్రధాన మంత్రి ఒక ఉదాహరణ గా చెప్తూ, ట్రక్కు ల నిండా వస్తువుల ను రవాణా చేయడం జరుగుతోంది, మరి ఇప్పుడు రైల్ వే, ఇంకా కోస్టల్ డిపార్ట్ మెంటు లు సరకు ల రవాణా కోసం విశిష్ట నూతన ఆవిష్కరణల తో ముందుకు వచ్చాయి అని ఆయన అన్నారు. ‘‘రైల్ వే లు వాటి రైలుపెట్టె ల డిజైన్ ను అందులోకి కార్గో ఇట్టే ఇమిడిపోయేటట్టు మార్చివేశాయి. దీని కోసం ఒక టన్ను సామగ్రి ని చేరవేసే కంటేనర్ ల ను కూడా ప్రత్యేకం గా తయారు చేయడమైంది. ఈ కంటేనర్ లలోకి సరకు ను నింపడం, మరి ఆ సరకుల ను దింపడం సులభ సాధ్యం. ఆరంభ దశ లో సఫలత సిద్ధించాక, ప్రస్తుతం సూరత్ నుండి కాశీ కి ఒక కొత్త రైలు ను నడిపే ప్రయత్నం జరుగుతున్నది. ఈ రైలు వస్తు సామగ్రి ని సూరత్ నుండి కాశీ కి తీసుకు పోతుంది’’ అంటూ ఆయన వివరించారు.
సూరత్ కు ఆది లో వజ్రాల నగరం అనే గుర్తింపు ఉండగా, తరువాత అది కాస్తా వంతెన ల నగరం గా మారింది, ప్రస్తుతం విద్యుత్తు వాహనాల నగరం అనే సరికొత్త గుర్తింపు లభిస్తుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. నగరం లో విద్యుత్తు వాహనాలు పెద్ద సంఖ్య లో కనిపిస్తూ ఉండడం గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ, సూరత్ అతి త్వరలోనే విద్యుత్తు వాహనాల కు కూడాను ప్రసిద్ధి ని పొందుతుందన్నారు. ప్రస్తుతాని కి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తం గా విద్యుత్తు వాహనాల ను నడపడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల కు సాయపడుతోంది, మరి సూరత్ ఈ విషయం లో దేశం లోని ఇతర నగరాల తో పోల్చి చూసినప్పుడు ఒక మెట్టు పైనే నిలచింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఈ రోజు న సూరత్ నగరం లో 25 చార్జింగ్ స్టేశన్ లను ప్రారంభించడం జరిగింది. మరి అంతే సంఖ్య లో స్టేశన్ లకు శంకుస్థాపన చేయడమైంది. ఇది సమీప భవిష్యత్తు లో సూరత్ లో 500 ఛార్జింగ్ స్టేశన్ ల స్థాపన దిశ లో ఒక అతి ప్రధానమైన అడుగు గా ఉంది’’ అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, సూరత్ లో గత రెండు దశాబ్దాల లో అభివృద్ధి శరవేగం గా చోటు చేసుకొన్న అంశాన్ని వివరించారు. అభివృద్ధి వేగం రాబోయే సంవత్సరాల లో మరింత పెరుగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ అభివృద్ధి అనేది ఈ రోజు న జోడు ఇంజిన్ ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకం రూపాన కనిపిస్తున్నది. విశ్వాసం పెరిగితే, ప్రయత్నం వృద్ధి చెందితే మరి దేశాభివృద్ధి తాలూకు వేగం ‘సబ్ కా ప్రయాస్’ ద్వారా జోరందుకొంటుంది’’ అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమాని కి హాజరు అయిన వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యులు శ్రీ సి.ఆర్. పాటిల్, శ్రీ ప్రభుభాయి వసావా లతో పాటు కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి దర్శన విక్రమ్ జర్ దోశ్ మరియు గుజరాత్ హోం శాఖ మంత్రి శ్రీ హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు.
పూర్వరంగం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 3400 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన వేరు వేరు ప్రాజెక్టుల కు సూరత్ లో శంకుస్థాపన చేయడం తో పాటుగా దేశ ప్రజల కు అంకితం కూడా చేశారు. ఆ ప్రాజెక్టుల లో నీటి సరఫరా కు ఉద్దేశించిన పనులు, మురుగునీటి పథకాలు, డ్రీమ్ సిటీ, బయోడైవర్సిటీ పార్కు మరియు పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వారసత్వ పునరుద్ధరణ, సిటీ బస్/ బిఆర్ టిఎస్ సంబంధి మౌలిక సదుపాయాలు, విద్యుత్తు వాహనాల కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు వంటివి ఉన్నాయి.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రహదారి మౌలిక సదుపాయాల పనుల తాలూకు ఒకటో దశ ను మరియు డాయమండ్ రిసర్చ్ ఎండ్ మర్కంటైల్ (డిఆర్ఇఎఎమ్ - డ్రీమ్) సిటీ యొక్క ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ప్రారంభించారు. సూరత్ లో శరవేగం గా వృద్ధి చెందుతున్న వజ్రాల క్రయ విక్రయాల వ్యాపారానికి పూరకం గా ఉండేటట్లుగా వాణిజ్య భవనాల ను మరియు నివాస భవనాల ను ఏర్పాటు చేయాలన్న డిమాండు ను నెరవేర్చడం కోసం ప్రారంభించిందే ఈ డ్రీమ్ సిటీ ప్రాజెక్టు. ప్రాజెక్టు యొక్క రెండో దశ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బయోడైవర్సిటీ పార్కు కు శంకుస్థాపన చేశారు. ఈ పార్కు ను డాక్టర్ హెడ్గేవార్ వంతెన నుండి భీమ్ రాడ్-బమ్ రోలీ వంతెన వరకు విస్తరించి ఉన్న 87 హెక్టేర్ లకు పైగా స్థలం లో నిర్మించడం జరుగుతోంది. ప్రధాన మంత్రి సూరత్ లోని సైన్స్ సెంటర్ లో ఖోజ్ మ్యూజియమ్ ను కూడా ప్రారంభించారు. బాలల కోసం నిర్మించినటువంటి ఈ మ్యూజియమ్ లో ఇంటరాక్టివ్ డిస్ ప్లే స్, అడిగి తెలుసుకొనే పద్ధతి పై ఆధారపడిన కార్యకలాపాలు మరియు ఆసక్తి ఆధారిత అన్వేషణ లు చోటు చేసుకోనున్నాయి.
ఈ విధమైన విస్తృత శ్రేణి అభివృద్ధి పథకాల ప్రారంభం మరియు శంకుస్థాపన లు ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచాలన్న, పట్టణ ప్రాంతాల లో గతిశీలత ను పెంచాలన్న, బహుళ విధ సంధానాన్ని మెరుగు పరచాలన్న ప్రధాన మంత్రి వచనబద్ధత ను ప్రతిబింబిస్తున్నాయి. అంతేకాకుండా ఇది సామాన్య మానవుడి జీవన సౌలభ్యాన్ని అధికం చేయాలన్న ఆయన ప్రభుత్వం యొక్క నిరంతర శ్రద్ధ ను కూడా కళ్ళ కు కడుతున్నది.
*****
DS/TS
(Release ID: 1863432)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam