ప్రధాన మంత్రి కార్యాలయం

సెమికండక్టర్ మరియు డిస్ప్లే ఫేబ్ ల తయారీ కోసం వేదాంత- ఫాక్స్ కాన్ గ్రూపు తో 1.54లక్షల కోట్ల రూపాయల ఎమ్ఒయు పై గుజరాత్ ప్రభుత్వం సంతకాలు చేసిన అనంతరం ఆశావాదాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


1.54 లక్షల కోట్ల రూపాయలపెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని ఇవ్వడం తో పాటు గా ఉద్యోగాల కు ఒకగణనీయమైన ప్రభావాన్ని ఏర్పరచనుంది

Posted On: 13 SEP 2022 2:32PM by PIB Hyderabad

సెమి-కండక్టర్ మరియు డిస్ ప్లే ఫేబ్ ల తయారీ కోసం 1.54 లక్షల కోట్ల రూపాయల ఎమ్ఒయు పై గుజరాత్ ప్రభుత్వం సంతకాలు చేసిన తరువాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ పరిణామం పై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని ఇవ్వడం తో పాటు గా ఉద్యోగాల కల్పన లో ఒక గణనీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. తద్ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఇ స్)కు సహాయకారి అవుతుంది అని కూడా ఆయన అన్నారు.

 

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ మరొక ట్వీట్ లో -

‘‘ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) భారతదేశం యొక్క సెమి-కండక్టర్ తయారీ సంబంధి ఆకాంక్షల ను త్వరితం చేయడం లో ఒక ముఖ్యమైనటువంటి అడుగు అని చెప్పాలి. 1.54 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని ఇవ్వడం తో పాటు గా ఉద్యోగాల కల్పన లో ఒక గణనీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. ఇది అనుబంధ పరిశ్రమల కు కూడా ఒక భారీ ఇకోసిస్టమ్ ను సృజించ‌డంతో పాటు మన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల కు సాయపడుతుంది.’’ అని పేర్కొన్నారు.




(Release ID: 1858935) Visitor Counter : 145