యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

మొదటి ఖేలో ఇండియా మహిళల జూడో టోర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  గౌహతి సెంటర్‌లో 27 ఆగస్టు 2022 నుండి ప్రారంభమవుతుంది

Posted On: 25 AUG 2022 1:40PM by PIB Hyderabad

మొదటి ఖేలో ఇండియా మహిళల జూడో టోర్నమెంట్ ఆగస్టు 27 నుండి భారతదేశంలోని నాలుగు జోన్లలో  జరుగుతుంది. ఈ జూడో టోర్నమెంట్‌లు మహిళల కోసం క్రీడా కార్యక్రమాలకు మద్దతుగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన కార్యక్రమాలలో ఒకటి.

 

ఈ ఓపెన్ కాంపిటీషన్ అనేది జాతీయ రౌండ్‌కు ముందు నాలుగు జోన్లలో జరిగే డివిజనల్ స్థాయి ర్యాంకింగ్ పోటీ. నాలుగు వయో సమూహాలలో పోటీదారుల కేటగిరీలు క్రింది విధంగా ఉన్నాయి:

 

సబ్-జూనియర్ (12 నుండి 15 సంవత్సరాలు) ,

క్యాడెట్ (15 నుండి 17 సంవత్సరాలు) ,

జూనియర్ (15 నుండి 20 సంవత్సరాలు)

మరియు సీనియర్ (15 సంవత్సరాల కంటే ఎక్కువ).

 

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖలోని క్రీడా విభాగం ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం మొత్తం రూ. 1.74 కోట్లు కేటాయించింది , ఇందులో రూ. 48.86 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది.

 

బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో రజత పతకాన్ని గెలుచుకున్న సుశీలా దేవి మాట్లాడుతూ, “ జూడో కోసం ఇలాంటి టోర్నమెంట్‌ను నిర్వహించి, దేశంలో క్రీడను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకున్నందుకు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు ధన్యవాదాలు. . ఇది భారతదేశంలో జూడో క్రీడా అభివృద్ధి కి దోహదపడుతుంది.

 

మొత్తం నాలుగు విభాగాల్లో పోటీ తర్వాత టోర్నమెంట్ యొక్క జాతీయ రౌండ్ అక్టోబర్ 20-23 వరకు న్యూఢిల్లీలోని కె.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది.

 

4 జోన్‌ల పోటీ షెడ్యూల్ వివరాలు:

తేదీలు: ఆగస్ట్ 27-31 | సెప్టెంబర్ 1-5 | సెప్టెంబర్ 5-9 | సెప్టెంబర్ 11-15

జోన్: ఈస్ట్ జోన్ | సౌత్ జోన్ | నార్త్ జోన్ | వెస్ట్ జోన్

 

వేదిక: SAI సెంటర్ గౌహతి, అస్సాం | VKN మీనన్ స్టేడియం, త్రిసూర్, కేరళ | పెస్టిల్ వుడ్ స్కూల్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ |సర్దార్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, గుజరాత్



(Release ID: 1854430) Visitor Counter : 135