సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాల ఆధారంగా రూపొందించిన ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ గేమ్‌ల సిరీస్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
బొమ్మలు, ఆటలతో ప్రజలకు కాలక్షేపం, వినోదంతో పాటు అవగాహన కల్పించేలా చూడాలన్న ప్రధానమంత్రి సూచన స్ఫూర్తిగా తీసుకుని రూపొందిన కార్యక్రమం ఇది
ఏడాదిపాటు జరిగిన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలు మొబైల్ ఆటల ద్వారా కొనసాగేలా చూసేందుకు జింగా ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ప్రచురణల డివిజన్
ఆన్‌లైన్ ఆటలకు ఉన్న భారీ మార్కెట్ అవకాశాలను కైవసం చేసుకుని, ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభం: శ్రీ అనురాగ్ ఠాకూర్
ఆన్‌లైన్ ఆటల ద్వారా భారత స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాల రూపంలో అందుబాటులోకి అంతులేని విజ్జాన గని : శ్రీ ఠాకూర్
ఇంగ్లీష్, హిందీ భాషల్లో భారతదేశంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల్లో ప్రారంభం
సెప్టెంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్న ఆటలు
Posted On:
24 AUG 2022 6:32PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా భారత స్వాతంత్ర్య పోరాట కథలను ఆటల రూపంలో పరిచయం చేసేందుకు ' ఆజాదీ క్వెస్ట్ ' పేరిట రూపొందిన ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్‌ల శ్రేణిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు ప్రారంభించారు. జింగా ఇండియా సహకారంతో ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్‌ల శ్రేణిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర తో పాటు జింగా ఇండియా కంట్రీ హెడ్ శ్రీ కిషోర్ కిచ్లీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీ అనురాగ్ ఠాకూర్ స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాలను గుర్తు చేసుకుని, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించి, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అంతగా గుర్తింపుకు నోచుకోని సమరయోధుల కథలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు జరుగుతున్న కృషిలో భాగంగా మొబైల్ ఆటలు రూపొందించామని అన్నారు.
భారతదేశంలో ఆన్‌లైన్ క్రీడలకు ఉన్న మార్కెట్ అవకాశాల ద్వారా ప్రయోజనం పొందడంతో పాటు ప్రజలకు ఆటల ద్వారా అవగాహనను కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించామని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అంతగా గుర్తింపుకు నోచుకోని సమరయోధులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు సేకరించాయని మంత్రి వివరించారు. అనేది ఈ జ్ఞానానికి సంబంధించిన అంశాలను ఆకర్షణీయంగా రూపొందించి సమగ్ర వివరాలతో ఆజాదీ క్వెస్ట్ రూపొందిందని మంత్రి వివరించారు. అన్ని వయసుల వారు ఈ ఆటల పట్ల ఆకర్షితులు అవుతారని అన్నారు. కుటుంబ సభ్యులందరూ ఆటలకు ఆకర్షితులవుతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
భారతదేశంలో ఏవిజిసి రంగం అభివృద్ధి చెందుతున్నదని శ్రీ ఠాకూర్ అన్నారు. భారతదేశంలో ఏవిజిసి రంగం మరింత అభివృద్ధి సాధించేందుకు అవసరమైన సహకారాన్ని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అందిస్తున్నదని హామీ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా గేమింగ్ రంగంలో ప్రపంచంలో మొదటి 5 స్థానాల్లో భారతదేశం స్థానం సాధించిందని శ్రీ ఠాకూర్ తెలిపారు. గేమింగ్ రంగం 2021లోనే 28% వృద్ధి చెందిందాని మంత్రి వెల్లడించారు. ఆన్‌లైన్ లో ఆటలు ఆడుతున్న వారి సంఖ్య 2020తో పోల్చి చూస్తే 2021లో 8 శాతం వరకు పెరిగిందని తెలిపారు. 2023 నాటికి ఆన్‌లైన్ లో ఆటలు ఆడుతున్న వారి సంఖ్య 45 కోట్లకు చేరుతుందని మంత్రి తెలిపారు.
కొత్తగా ఆవిష్కరించిన యాప్‌లు దేశ ఏవిజిసి రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అద్భుతమైన చరిత్రను ప్రపంచం నలుమూలలకు తీసుకు వెళతాయని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్‌లలో పొందుపరిచిన సమాచారాన్ని పబ్లికేషన్స్ డివిజన్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ క్రోడీకరించి పొందుపరిచాయని మంత్రి తెలిపారు. మన స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ప్రామాణికమైన సమాచారం సులభంగా లభిస్తుందని తెలిపిన మంత్రి సమాచారం జ్ఞాన నిధిగా ఉంటుందని అన్నారు.
ఈ యాప్‌లను రూపకల్పనలో జింగా ఇండియా చేసిన కృషిని మంత్రి అభినందించారు. అన్ని వయసుల వారు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని మంత్రి కోరారు. దేశ స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన విద్యా సాధనంగా యాప్ మారుతుందని అన్నారు.
యాప్ ఏకకాలంలో వినియోగదారులను అలరిస్తుంది, నిమగ్నం చేస్తుంది మరియు అవగాహన కల్పిస్తుంది.
కార్యక్రమంలో మాట్లడిన జింగా ఇండియా కంట్రీ హెడ్ శ్రీ కిషోర్ కిచ్లీ స్వాతంత్ర్య సంగ్రామం భారతదేశ చరిత్రలోకీలక ఘట్టంగా ఉంటుందని అన్నారు. చరిత్రను గౌరవించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో తమ సంస్థకు స్థానం లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆటల ద్వారా ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు జింగా కృషి చేస్తున్నదని వివరించారు. ఆటల ద్వారా అన్ని వయస్సుల వ్యక్తులను అలరించి, ఆటలను బోధనా అనుభవంగా మార్చాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను, స్వాతంత్ర్య సమరయోధుల పరాక్రమాన్ని ప్రదర్శించే ఆటలు మరియు బొమ్మలు అభివృద్ధి చేయాలని ఆటలు, బొమ్మల తయారీ రంగానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ఈ ఆటలు రూపుదిద్దుకున్నాయి. . 'ఆజాదీ క్వెస్ట్' సిరీస్‌లోని మొదటి రెండు గేమ్‌లు భారత స్వాతంత్ర్య పోరాట కథలు వివరిస్తాయి. కీలకమైన మైలురాళ్లు మరియు హీరోలను హైలైట్ చేస్తూ, సరదాగా గేమ్‌ప్లేతో అల్లుకున్నాయి. గేమ్‌ల ఇతివృతం సరళంగా సమగ్రంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ నిపుణులు పరిశీలించి ధ్రువీకరించిన అంశాలను పబ్లికేషన్స్ విభాగం ఆటల్లో పొందుపరిచింది.
ఆజాదీ క్వెస్ట్ గురించి:
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వరుస గేమ్‌లను అభివృద్ధి చేసేందుకు పబ్లికేషన్స్ విభాగం ఈరోజు జింగా ఇండియాతో ఎంఓయూపై సంతకం చేసింది. ఆజాదీ క్వెస్ట్ గేమ్‌లు ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పరికరాల కోసం ఆంగ్లం మరియు హిందీలో భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ జింగా ఇండియా 2010లో బెంగళూరులో స్థాపించబడింది. ప్రజాదరణ పొందిన అనేక మొబైల్ మరియు వెబ్ గేమ్‌లను జింగా అభివృద్ధి చేసింది.
'గేమిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్' అనే ఇతివృతం ఆధారంగా రూపొందిన గేమ్ సిరీస్ దేశంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుంది. ఆట -ఆధారిత అభ్యాసం తరగతి గది మరియు వయస్సు పరిధి దాటి విస్తరించడం ద్వారా అభ్యాస ప్రక్రియను, జీవితకాల విద్యను అందిస్తుంది. ఆజాదీ క్వెస్ట్ సిరీస్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటం మరియు దేశ స్వాతంత్ర్య సమరయోధుల ఇతిహాసాల జ్ఞానాన్ని అందిస్తుంది. దీనితో ఆట ఆడేవారు గర్వంతో గతాన్ని గుర్తు చేసుకుని తమ కర్తవ్యాన్ని తెలుసుకొనేందుకు వీలు కలుగుతుంది. ప్రధానమంత్రి తన 76వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించిన 'పంచ్ ప్రాణ్ ఆఫ్ అమృత్ కాల్' గుర్తు చేసి వలసవాద మనస్తత్వాన్ని తొలగించడంలో కీలకంగా ఉంటుంది.
ఆజాది క్వెస్ట్ సిరీస్‌లోని మొదటి గేమ్ - మ్యాచ్ 3 పజిల్ : 1857 నుండి 1947 వరకు సాగిన భారతదేశ స్వాతంత్ర్యం యుద్ధం వివరాలను ఆటగాళ్లకు సులభంగా అర్థమయ్యే రీతిలో సాధారణ గేమ్ గా మ్యాచ్ 3 పజిల్ రూపొందింది. 495 స్థాయిలలో గేమ్ ఉంటుంది. ఆటలో పురోగమిస్తున్న ఆటగాళ్ళు 75 ట్రివియా కార్డ్‌లు సేకరించగలరు. ఒకో కార్డు చరిత్రలో కీలక ఘట్టం కలిగి ఉంటుంది. లీడర్‌బోర్డ్‌లలో పోటీపది, ఆటలో పొందిన రివార్డ్‌లు, ప్రగతిని మరియు సోషల్ మీడియాలో పంచుకోవచ్చు.
ఆజాదీ క్వెస్ట్: హీరోస్ ఆఫ్ భారత్ 75 స్థాయిలలో 750 ప్రశ్నల ద్వారా భారతదేశ స్వాతంత్ర్య వీరుల గురించి ఆటగాళ్ల జ్ఞానాన్ని పరీక్షించడానికి క్విజ్ గేమ్‌గా రూపొందించబడింది. మరియు 75 'ఆజాదీ' ద్వారా అంతగా తెలియని హీరోల గురించి తెలియజేస్తుంది. . వీర్ కార్డ్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భాగస్వామ్యం చేయబడతాయి.
పబ్లికేషన్స్ విభాగం మరియు జింగా ఇండియా మధ్య ఏడాది పాటు కొనసాగే భాగస్వామ్యం మరిన్ని గేమ్‌లను అందిస్తుంది.భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో విభిన్న అంశాల గురించి ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు మరియు యువతకు అవగాహన కల్పించడానికి మరియు దేశభక్తి భావాన్ని పెంపొందించే దృష్టితో రూపొందిన అంశాలు, మరియు ఫీచర్ల పరంగా ఇప్పటికే ఉన్న గేమ్‌లను విస్తరిస్తుంది. ఆజాదీ క్వెస్ట్‌ను పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్‌తో సహా ప్రతి నెలా గేమ్‌లు ఆటగాళ్లకు ఉత్తేజకరమైన రివార్డులను అందిస్తాయి.
' ఆజాదీ క్వెస్ట్ ' బ్రోచర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: brochure: http://davp.nic.in/ebook/goi_print/index.html
గేమ్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి:
IOS పరికరాలు:
https://apps.apple.com/us/app/azadi-quest-match-3-puzzle/id1633367594
ఆండ్రాయిడ్ పరికరాలు
https://play.google.com/store/apps/details?id=com.zynga.missionazaadi
IOS పరికరాలు:
https://apps.apple.com/us/app/heroes-of-bharat/id1634605427
ఆండ్రాయిడ్ పరికరాలు
https://play.google.com/store/apps/details?id=com.zynga.heroes.of.bharat
(Release ID: 1854340)
Visitor Counter : 256
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada