రైల్వే మంత్రిత్వ శాఖ
రైలులో ప్రయాణించే పిల్లలకు టిక్కెట్ల బుకింగ్‌కి సంబంధించిన నిబంధనలలో ఎలాంటి మార్పు లేదు
ఐదేళ్ళలోపు పిల్లలకు టిక్కెట్ కొని & బెర్త్‌ను బుక్ చేయడం ప్రయాణీకులకు ఐచ్ఛికం
బెర్త్ బుక్ చేయకపోతే 5ఏళ్ళలోపు పిల్లలకు ఉచిత ప్రయాణానికి అనుమతి
Posted On:
17 AUG 2022 2:02PM by PIB Hyderabad
రైలులో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల బుకింగ్‌కి సంబంధించి భారతీయ రైల్వేలు నిబంధనలు మార్చినట్టు ఇటీవల కొన్ని వార్తా పత్రికలు పేర్కొన్నాయి. ఈ వార్తల ప్రకారం ఏడాది నుంచి నాలుగేళ్ళ వయసు వరకు ఉన్న పిల్లలకు కూడా రైలులో ప్రయాణించేందుకు టిక్కెట్లు కొనవలసి ఉంటుంది.
ఈ వార్తలు, మీడియా నివేదికలు తప్పు దోవపట్టించే విధంగా ఉన్నాయి. రైలులో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల బుకింగ్‌కి సంబంధించి భారతీయ రైల్వేలు ఎటువంటి మార్పులను ప్రవేశపెట్టలేదని తెలియచేయడం జరుగుతోంది. ప్రయాణీకుల డిమాండ్‌పై 5 ఏళ్ళ వయసులోపు ఉన్నపిల్లలకు తల్లిదండ్రులు/ సంరక్షకులు కావాలనుకుంటే టిక్కెట్టు కొని, బెర్త్‌ను బుక్ చేసుకొనే ప్రత్యామ్నాయాన్ని ఇవ్వడం మాత్రమే జరిగింది. వారికి ప్రత్యేక బెర్తు అవసరం లేకపోతే, ఇంతకు ముందు లాగే పిల్లలకు ఉచితమే.
ఐదేళ్ళ లోపు వయసు ఉన్న పిల్లలకు ప్రయాణం ఉచితమని రైల్వే మంత్రిత్వ శాఖ 06.03.2020న జారీ చేసిన సర్క్యులర్ పేర్కొంటోంది. అయితే, వారికి ప్రత్యేక సీటు (చైర్ కార్‌లో) లేదా బెర్తు ఇవ్వడం జరుగదు. ప్రత్యేక బెర్తును కోరకపోతే, వారు ఎటువంటి టిక్కెట్టును కొనవలసిన అవసరం లేదు. కానీ, ఐదేళ్ళ వయసులోపు పిల్లలకు బెర్తు / సీటు స్వచ్ఛందంగా కోరితే, అప్పుడు దానికి వయోజనులకు లాగే పూర్తి ఛార్జీ వసూలు చేయడం జరుగుతుంది.
***
(Release ID: 1852519)
Visitor Counter : 803
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam