ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లాన్‌బౌల్ పురుషుల టీమ్ ర‌జ‌త ప‌త‌కం సాధించినందుకు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 06 AUG 2022 10:05PM by PIB Hyderabad

బ‌ర్మింగ్‌హామ్ లో జ‌రుగుతున్న‌ 2022 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో లాన్ బౌల్ పురుషుల టీమ్ ర‌జ‌త ప‌త‌కం సాధించ‌చ‌చినందుకు ప్ర‌ధానమంత్రి సునీల్‌బ‌హ‌దూర్‌, న‌వ‌నీత్‌సింగ్, చంద‌న్‌కుమార్ సింగ్‌, దినేష్ కుమార్ ల‌ను అభినందించారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
లాన్‌బౌల్ లో ర‌జ‌త‌ప‌త‌కం సాధించిన సునీల్ బ‌హ‌దూర్‌, న‌వ‌నీత్ సింగ్‌, చంద‌న్ కుమార్ సింగ్‌, దినేష్ కుమార్‌ల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. వారి స‌మ‌ష్టి కృషి , ప‌ట్టుద‌ల అద్భుతం. వారి ఉజ్వ‌ల భ‌విష్య‌త్‌కు శుభాకాంక్షలు అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు

 


(Release ID: 1849584) Visitor Counter : 106