ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

మరో రైతు స్నేహపూర్వక చర్యగా, 2022-23 చక్కెర సీజన్ కు చెరకు రైతులకు చక్కెర మిల్లులు చెల్లించే చెరకు సరసమైన, ప్రోత్సాహక ధరకు ప్రభుత్వం ఆమోదం


చెరకు రైతులకు (గన్నా కిసాన్)
క్వింటాల్ కు రూ. 305 అత్యధిక సరసమైన , ప్రోత్సాహక ధర (గన్నా కిసాన్) కు ఆమోదం

రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం గత 8 సంవత్సరాల్లో ఎఫ్ ఆర్ పి ని 34% కంటే ఎక్కువగా పెంచిన ప్రభుత్వం

రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్న భారత ప్రభుత్వం

ఈ నిర్ణయం వల్ల ఐదు కోట్ల మంది చెరకు రైతులు (గన్నా కిసాన్) , వారి మీద ఆధారపడిన వారితో పాటు చక్కెర మిల్లులు , సంబంధిత అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న ఐదు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం

Posted On: 03 AUG 2022 6:19PM by PIB Hyderabad

చెరకు రైతుల (గన్నా కిసాన్) ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ చక్కెర సీజన్ 2022-23 (అక్టోబర్ - సెప్టెంబర్) కు చెరకు హేతుబద్ధ , ప్రోత్సాహక ధర (ఎఫ్ ఆర్ పి) ను 10.25% ప్రాథమిక రికవరీ రేటుకు క్వింటాల్ కు రూ. 305 గా  ఆమోదించింది, ఇది ప్రతి 0.05% కంటే ఎక్కువ రికవరీ రేటుకు రూ. 3.05/క్వింటాల్ కు  ప్రీమియంను అందిస్తుంది.  రికవరీలో ప్రతి 0.1% తగ్గుదలకు ఎఫ్ ఆర్ పి లో రూ. 3.05/ క్వింటాల్  తగ్గింపు ఉంటుంది.

అయితే, చెరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రికవరీ 9.5% కంటే తక్కువగా ఉన్న చక్కెర మిల్లుల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండరాదని కూడా నిర్ణయించింది. అటువంటి రైతులకు 2021-22 ప్రస్తుత చక్కెర సీజన్లో క్వింటాల్ కు  రూ.275.50 చొప్పున, 2022-23లో చెరకుకు క్వింటాల్ కు  రూ.282.125 చొప్పున లభిస్తుంది.

 

2022-23 చక్కెర సీజన్ కు చెరకు ఉత్పత్తి ఏ2 + ఎఫ్ ఎల్ ఖర్చు (అంటే వాస్తవంగా చెల్లించిన అవుట్ కాస్ట్ ప్లస్ ఫ్యామిలీ లేబర్ ఇంప్యూటెడ్ వాల్యూ) రూ. 162/ క్వింటాల్  10.25% రికవరీ రేటుతో రూ. 305/ క్వింటాల్  ఈ ఎఫ్ ఆర్ పి, ఉత్పత్తి ఖర్చు కంటే 88.3% ఎక్కువగా ఉంది, తద్వారా రైతులకు వారి ఖర్చు కంటే 50% కంటే ఎక్కువ రాబడిని ఇస్తుందనే వాగ్దానాన్ని ధృవీకరిస్తుంది. చక్కెర సీజన్ 2021-22 కంటే 2022-23 చక్కెర సీజన్ కోసం ఎఫ్ఆర్పి 2.6% ఎక్కువ.

 

కేంద్ర ప్రభుత్వ క్రియాశీల విధానాల

కారణంగా, చెరకు సాగు , చక్కెర పరిశ్రమ గత 8 సంవత్సరాలలో ఎంతో పురోగమించి ఇప్పుడు స్వీయ సుస్థిరత స్థాయికి చేరుకుంది. చక్కెర పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాలు,  అదేవిధంగా రైతులతో సకాలంలో ప్రభుత్వ జోక్యం ,సహకార సమిష్టి ఫలితం ఇది. ఇటీవలి సంవత్సరాల్లో షుగర్ సెక్టార్ కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి:

 

*చెరకు రైతులకు ఖచ్చిత హామీ  ధరను ధృవీకరించడం కోసం చెరకు ఎఫ్ ఆర్ పీ ని నిర్ధారిస్తారు .

 

*గత 8 సంవత్సరాలలో ప్రభుత్వం ఎఫ్ ఆర్ పిని 34% కంటే ఎక్కువ పెంచింది.

 

*చక్కెర ఎక్స్ మిల్ ధరలు పడిపోకుండా ,చెరకు బకాయిలు పేరుకుపోకుండా నిరోధించడం కోసం ప్రభుత్వం చక్కెర కనీస అమ్మకపు ధర (ఎం ఎస్ పి) అనే భావనను కూడా ప్రవేశపెట్టింది. (ఎం ఎస్ పి ప్రాథమికంగా 07-06-2018 నుంచి రూ. 29/ కే జి గా నిర్ణయించబడింది; 14-02-2019 నుంచి రూ. 31/ కే జి కు సవరించబడింది).

*చక్కెర ఎగుమతిని సులభతరం చేయడానికి, బఫర్ స్టాక్స్ నిర్వహించడానికి, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, రైతుల బకాయిలను క్లియరెన్స్ చేయడానికి చక్కెర మిల్లులకు ₹ 18,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించారు.

 

*ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం చక్కెర మిల్లుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి దారి తీసింది. తత్ఫలితంగా, వారు చెరకు బకాయిలను ముందుగానే చెల్లించ గలరు.

 

*ఎగుమతులు ,చక్కెరను ఇథనాల్ కు మళ్లించడం వల్ల, చక్కెర రంగం స్వీయ-సుస్థిరమైనదిగా మారింది ఎగుమతి,  బఫర్ కు బడ్జెటరీ మద్దతు మిల్లుల లిక్విడిటీని మెరుగుపరచడానికి అవసరం లేదు.

 

ఇంకా, గత కొన్ని చక్కెర సీజన్లలో చక్కెర రంగం కోసం తీసుకున్న వివిధ ఇతర చర్యల కారణంగా, అధిక దిగుబడినిచ్చే చెరకు రకాలను ప్రవేశపెట్టడం, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను అవలంబించడం, చక్కెర ప్లాంట్ ఇతర పరిశోధన -అభివృద్ధి కార్యకలాపాలను ఆధునీకరించడం, చెరకు సాగు విస్తీర్ణం, చెరకు ఉత్పత్తి, చెరకు క్రష్, చక్కెర ఉత్పత్తి దాని రికవరీ శాతం ,రైతులకు చెల్లింపు గణనీయంగా పెరిగింది.

 

రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:

 

ఈ నిర్ణయం ద్వారా 5 కోట్ల మంది చెరకు రైతులు (గన్నా కిసాన్) , వారి మీద ఆధారపడిన వారికి, అలాగే చక్కెర మిల్లులు, సంబంధిత అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. 9 సంవత్సరాల క్రితం, 2013-14 చక్కెర సీజన్ లో ఎఫ్ ఆర్ పి కేవలం రూ. 210/ క్వింటాల్ మాత్రమే. అలాగే చక్కెర మిల్లుల ద్వారా కేవలం 2397 ఎల్ ఎం టి చెరకును మాత్రమే కొనుగోలు చేసింది. చెరకును చక్కెర మిల్లులకు విక్రయించడం ద్వారా రైతులకు కేవలం రూ.51,000 కోట్లు మాత్రమే అందుతున్నాయి. అయితే, గ త 8 సంవత్సరాల లో ప్రభుత్వం ఎఫ్ ఆర్ పి ని 34% కంటే ఎక్కువ గా పెంచింది. ప్రస్తుత చక్కెర సీజన్ 2021-22లో రూ.1,15,196 కోట్ల విలువైన 3,530 లక్షల టన్నుల చెరకును చక్కెర మిల్లులు కొనుగోలు చేశాయి.

 

2022-23 చక్కెర సీజన్ లో చెరకు సాగు విస్తీర్ణం పెరగడం , చెరకు ఆ మచనా ఉత్పత్తి బట్టి 3,600 లక్షల టన్నులకు పైగా చెరకును చక్కెర మిల్లులు కొనుగోలు చేసే అవకాశం ఉంది, దీని కోసం చెరకు రైతులకు మొత్తం రెమిటెన్స్ రూ. 1,20,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రభుత్వం తన రైతు అనుకూల చర్యల ద్వారా చెరకు రైతులు సకాలంలో వారి బాకీలను పొందేలా చూస్తుంది.

 

గత చక్కెర సీజన్ 2020-21లో సుమారు రూ.92,938 కోట్ల చెరకు బకాయిలు చెల్లించాల్సి ఉండగా, అందులో రూ.92,710 కోట్లు చెల్లించగా, కేవలం రూ.228 కోట్ల బకాయిలు మాత్రమే పెండింగ్ లో  ఉన్నాయి.

ప్రస్తుత చక్కెర సీజన్ 2021-22లో రూ.1,15,196 కోట్ల చెరకు బకాయిల్లో రూ.1,05,322 కోట్లు రైతులకు చెల్లించారు. అందువలన, 91.42% చెరకు బకాయిలు క్లియర్ చేయబడ్డాయి, ఇది మునుపటి సీజన్ల కంటే ఎక్కువ.

 

ప్రస్తుత చక్కెర సీజన్ లో చక్కెర ఉత్పత్తిలో భారతదేశం బ్రెజిల్ ను అధిగమించింది. గత 8 సంవత్సరాలలో చక్కెర ఉత్పత్తిలో పెరుగుదలతో, భారతదేశం దేశీయ వినియోగానికి తన అవసరాలను తీర్చడమే కాకుండా, చక్కెరను కూడా స్థిరంగా ఎగుమతి చేస్తోంది, ఇది మన ద్రవ్యలోటును తగ్గించడంలో సహాయపడింది. గత 4 చక్కెర సీజన్లలో 2017-18, 2018-19, 2019-20 & 2020-21, సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ ఎం టి), 38 ఎల్ ఎం టి  , 59.60 ఎల్ ఎం టి , 70 ఎల్ ఎం టి చక్కెర ఎగుమతి జరిగింది. ప్రస్తుత చక్కెర సీజన్ 2021-22 లో 01.08.2022 వరకు సుమారు 100 ఎల్ ఎం టి చక్కెర ను ఎగుమతి చేశారు. ఇంకా ఎగుమతులు 112 ఎల్ ఎం టి లను చేరే అవకాశం ఉంది

 

ఇంధన రంగానికి దోహదపడుతున్న చెరకు రైతులు ,చక్కెర పరిశ్రమ

 

భారతదేశ 85% ముడి చమురు అవసరాలను దిగుమతుల ద్వారా తీరుస్తారు. అయితే ,ముడిచమురుపై దిగుమతి బిల్లును తగ్గించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, భారతదేశాన్ని పెట్రోలియం రంగంలో ఆత్మనిర్భర్ గా మార్చడానికి, ఇథనాల్ బ్లెండెడ్ విత్ పెట్రోల్ కార్యక్రమం కింద ఉత్పత్తిని పెంచడానికి ,పెట్రోల్ తో ఇథనాల్ ను కలపడానికి ప్రభుత్వం చురుకుగా ముందుకు సాగుతోంది. అదనపు చెరకును పెట్రోల్ తో కలిపిన ఇథనాల్ కు మళ్లించడానికి ప్రభుత్వం చక్కెర మిల్లులను ప్రోత్సహిస్తోంది, ఇది ఆకుపచ్చ ఇంధనంగా పనిచేయడమే కాకుండా ముడి చమురు దిగుమతి కారణంగా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుంది. 2018-19, 2019-20 ,2020-21 చక్కెర సీజన్లలో, సుమారు 3.37 ఎల్  ఎం టి, , 9.26 ఎల్  ఎం టి, 22 ఎల్  ఎం టి చక్కెర ను ఇథనాల్ కు మళ్లించారు. ప్రస్తుత చక్కెర సీజన్ 2021-22లో, సుమారు 35 ఎల్  ఎం టి చక్కెరను మళ్లించవచ్చని అంచనా. 2025-26 నాటికి 60 ఎల్ ఎం టి కంటే ఎక్కువ చక్కెరను ఇథనాల్ కు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇది అదనపు చెరకు సమస్యను పరిష్కరిస్తుంది. రైతులకు సకాలంలో చెల్లింపు జరుగుతుంది. 

 

2022 నాటికి పెట్రోల్ తో ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్ ను 10% ,2025 నాటికి 20% బ్లెండింగ్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

2014 సంవత్సరం వరకు, మొలాసిస్ ఆధారిత డిస్టిలరీల ఇథనాల్ స్వేదనం సామర్థ్యం 215 కోట్ల లీటర్లు మాత్రమే. అయితే, గ త 8 సంవత్సరాల లో ప్రభుత్వం చేసిన విధాన మార్పుల కారణంగా మొలాసిస్ ఆధారిత డిస్టిలరీల సామ ర్థ్యం 595 కోట్ల

లీటర్లకు పెరిగింది. 2014 లో 208 కోట్ల లీటర్లు ఉన్న గ్రెయిన్ ఆధారిత డిస్టిలరీల సామర్థ్యం ఇప్పుడు 296 కోట్ల లీటర్లకు పెరిగింది. 2014లో 421 కోట్ల లీటర్లుగా ఉన్న ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గత 8 ఏళ్లలో రెట్టింపు కాగా, 2022 జూలైలో 893 కోట్ల లీటర్లకు చేరింది. ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడానికి బ్యాంకుల నుండి పొందిన రుణాల కోసం చక్కెర మిల్లులు / డిస్టిలరీలకు వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం విస్తరిస్తోంది. ఇథనాల్ రంగంలో సుమారు 41,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.

 

ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఇఎస్ వై) 2013-14 లో, ఒఎమ్ సిలకు ఇథనాల్ సరఫరా కేవలం 38 కోట్ల లీటర్లు మాత్రమే, బ్లెండింగ్ లెవల్స్ కేవలం 1.53% మాత్రమే. ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్ ఉత్పత్తి , ఓ ఎం సి లకు దాని సరఫరా 2013-14తో పోలిస్తే 8 రెట్లు పెరిగింది. ఇథనాల్ సరఫరా సంవత్సరం 2020-21 (డిసెంబర్ - నవంబర్) లో, సుమారు 302.30 కోట్ల లీటర్ల ఇథనాల్ ఓఎంసిలకు సరఫరా చేయబడింది, తద్వారా 8.1% బ్లెండింగ్ స్థాయిలను సాధించింది.ప్రస్తుత ఇ ఎస్ వై 2021-22లో, మనం 10.17% బ్లెండింగ్ స్థాయిలను సాధించగలిగాము. ప్రస్తుత ఇ ఎస్ వై 2021-22లో పెట్రోల్ తో  కలపడానికి చక్కెర మిల్లులు/ డిస్టిలరీల ద్వారా 400 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా అయ్యే అవకాశం ఉంది, ఇది 2013-14 లో సరఫరాతో పోలిస్తే 10 రెట్లు ఉంటుంది.

 

స్వీయ-సుస్థిరంగా చక్కెర పరిశ్రమ

 

ఇంతకు ముందు, చక్కెర మిల్లులు ఆదాయాలను సృష్టించడానికి చక్కెర అమ్మకాలపై ప్రధానంగా ఆధారపడేవి. ఏ సీజన్ లోనైనా మిగులు ఉత్పత్తి వాటి లిక్విడిటీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది, ఇది రైతుల చెరకు ధరల బకాయిలు పేరుకుపోవడానికి దారితీస్తుంది.

లిక్విడిటీని మెరుగుపరచడానికి ప్రభుత్వ జోక్యాలు నియతానుసారంగా చేయబడ్డాయి. ఏదేమైనా, మిగులు చక్కెరను ఎగుమతి చేయడానికి ,చక్కెరను ఇథనాల్ కు మళ్లించడానికి ప్రోత్సాహంతో సహా కేంద్ర ప్రభుత్వ క్రియాశీల విధానాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా, చక్కెర పరిశ్రమ ఇప్పుడు స్వీయ-సుస్థిరంగా మారింది.

 

2013-14 నుంచి చక్కెర మిల్లుల ద్వారా ఇథనాల్ ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) విక్రయించడం ద్వారా సుమారు రూ.49,000 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుత చక్కెర సీజన్ 2021-22లో ఇథనాల్ ను  ఓఎంసీలకు విక్రయించడం ద్వారా చక్కెర మిల్లుల ద్వారా సుమారు రూ.20,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇది చక్కెర మిల్లుల లిక్విడిటీని మెరుగుపరిచింది, ఇది రైతుల చెరకు బకాయిలను క్లియర్ చేయడానికి వారికి వీలు కల్పించింది. చక్కెర, దాని ఉప ఉత్పత్తుల అమ్మకం, ఓ ఎం సి లకు ఇథనాల్ సరఫరా, బగాస్సే ఆధారిత కోజెనరేషన్ ప్లాంట్ ల నుంచి విద్యుత్ ఉత్పత్తి, ప్రెస్ మడ్ నుంచి ఉత్పత్తి చేయబడ్డ పొటాష్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం, చక్కెర మిల్లుల టాప్ లైన్ ,బాటమ్ లైన్ ఎదుగుదలను మెరుగుపరిచింది.

 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు,  ఎఫ్ ఆర్ పి పెంపుదల రైతులను చెరకు పండించ డానికి  ప్రోత్సహించాయి.  దేశీయంగా చక్కెర ఉత్పత్తి కోసం చక్కెర కర్మాగారాలను

కొనసాగించడానికి వీలు కల్పించాయి. చక్కెర రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న క్రియాశీలక మైన విధానాల కారణంగా భారత దేశం కూడా ఇప్పుడు ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ గా మారుతోంది.

 

********



(Release ID: 1848125) Visitor Counter : 260