ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్ లోని సీతల్ కుచీ లో ఒక వ్యాను లో కరెంటు ప్రవహించడం తో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆయనప్రకటించారు
నాడు పోస్టు చేయడమైనది:
02 AUG 2022 5:34PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ లోని సీతల్ కుచీ లో ఒక వ్యాను విద్యుదాఘాతాని కి లోనైనందువల్ల ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -
‘‘పశ్చిమ బెంగాల్ లోని సీతల్ కుచీ లో ఒక వ్యాను విద్యుదాఘాతాని కి లోనైన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు కలత చెందాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరలోనే పునఃస్వస్థులు అగుదురు గాక: ప్రధాన మంత్రి’’
‘‘ఈ ఘటన లో మృతుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఘటన లో గాయపడ్డ వారి కి 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1847533)
సందర్శకుల సూచీ సంఖ్య : : 185
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada