ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్వెల్త్ గేమ్స్-2022 స్వర్ణ పతక విజేత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు ప్రధానమంత్రి అభినందన

Posted On: 30 JUL 2022 11:03PM by PIB Hyderabad

   బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌-2022 మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన మీరాబాయి చానును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో;

   “అసాధారణ క్రీడాకారిణి @mirabai_chanu భారతదేశం మరోసారి గర్వపడేలా చేశారు! బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో ఆమె స్వర్ణ పతక విజేతగా సరికొత్త కామన్వెల్త్ రికార్డు నెలకొల్పడంపై ప్రతి భారతీయుడు ఎంతో సంతోషిస్తున్నాడు. ఆమె విజయం అనేకమంది భారతీయులకు, ముఖ్యంగా వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH


(Release ID: 1846740) Visitor Counter : 154