భారత ఎన్నికల సంఘం
ఓటర్ల జాబితాలో చేరడానికి యువతకు మరిన్ని అవకాశాలు
నమోదు చేసుకోవడానికి ఒక సంవత్సరంలో నాలుగు అవకాశాలు - జనవరి 1 క్వాలిఫైయింగ్ తేదీ వరకు మాత్రమే వేచి ఉండాల్సిన అవసరం లేదు
17+ సంవత్సరాల యువతకు అడ్వాన్స్ అప్లికేషన్ సదుపాయం
1.8.22 నుంచి ఓటరు నమోదు కోసం కొత్త యూజర్ ఫ్రెండ్లీ ఫారాలు
ఒకవేళ అవసరం అయితే, ఎంట్రీల కరెక్షన్ కొరకు సింగిల్ ఫారం 8
వోటర్ కార్డుతో లింక్ చేయడానికి స్వచ్ఛంద ఆధార్ సేకరణ
డెమోగ్రాఫిక్ పరంగా/ఫోటో సారూప్య ఎంట్రీలను తొలగించడంపై దృష్టి
వార్షిక సమ్మరీ సవరణకు కమిషన్ ఆదేశాలు; ఆగస్టులో ప్రీ రివిజన్ యాక్టివిటీ ప్రారంభం
ఆరోగ్యవంతమైన ఓటర్ల జాబితా కోసం తనిఖీ/ పర్యవేక్షణ
प्रविष्टि तिथि:
28 JUL 2022 12:08PM by PIB Hyderabad
17 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న యువకులు ఇప్పుడు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు సంవత్సరం లో జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండాలన్న నిబంధన కోసం వేచి ఉండాల్సిన అవసరం ఇక లేదు
ప్ర ధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్ శ్రీ అనూప్ చంద్ర పాండే నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల సిఇఒలు/ఈఆర్ వోలు/ఏఈఆర్ వోల ను ఈ మేరకు సాంకేతిక ఆధారిత పరిష్కారాల ను రూపొందించాలని ఆదేశించింది.
జనవరి 1వ తేదీనే కాకుండా ఏప్రిల్ 01, జూలై 01, అక్టోబర్ 01 తేదీలకు సంబంధించి తమ అడ్వాన్స్ దరఖాస్తులు దాఖలు చేయడానికి యువతకు వీలు కల్పించే విధంగా సాంకేతిక ఆధారిత ప రిష్కారాల ను రూపొందించాలని అన్ని రాష్ట్రాల సిఇఓలు/ఈఆర్ వోలు/ఏఈ
ఆర్ వోల ను ఈసీఐ ఆదేశించింది. ఇక నుంచి, ప్రతి త్రైమాసికానికి ఓటరు జాబితా ను నవీకరిస్తారు. అర్హత కలిగిన యువకులు 18 సంవత్సరాల అర్హత వయస్సును చేరుకున్న సంవత్సరం తదుపరి త్రైమాసికంలో నమోదు చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తరువాత, అతడు/ఆమెకు ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్) జారీ అవుతుంది. 2023 ఏప్రిల్ 1, జూలై 1, 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ఏ పౌరుడైనా ఓటరు జాబితా ముసాయిదా ప్రచురణ తేదీ నుంచి ఓటరుగా నమోదు కోసం ముందస్తు దరఖాస్తును సమర్పించవచ్చు.
ఆర్పీ యాక్ట్ 1950 సెక్షన్ 14(బి )లోని చట్టపరమైన సవరణలు, 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల్లో సవరణలకు అనుగుణంగా అసెంబ్లీ/పార్లమెంటరీ నియోజక వర్గం ఓటర్ల జాబితా తయారీ/సవరణకు అవసరమైన మార్పులను తీసుకువచ్చే ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇసిఐ సిఫారసుల మేరకు, న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవల యువత ఓటరు నమోదు కు జనవరి 01, ఏప్రిల్ 01, జూలై 01 ,అక్టోబర్ 01 వ తేదీలను అర్హత తేదిలుగా పరిగణిస్తూ ఆర్పి చట్టాన్ని సవరించిన విషయం తెలిసిందే. జనవరి 1, 01 మరియు అక్టోబర్ 01 వ తేదీలను కల్పించింది. అంతకుముందు వరకు జనవరి ఒకటి మాత్రమే 18 సంవత్సరాల యువత ఓటరు నమోదుకు అర్హత తేదీ గా ఉండేది.
ప్రస్తుత విధానం ప్రకారం, రాబోయే ఏడాది జనవరి 1వ తేదీని పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాల సవరణ సాధారణంగా అన్ని రాష్ట్రాలు/యూటీలలో (సాధారణంగా ఏడాది చివరి త్రైమాసికంలో) ప్రతి సంవత్సరం చివరి భాగంలో అర్హత తేదీగా జరుగుతుంది. తద్వారా ఓటర్ల జాబితాల తుది ప్రచురణ వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో జరుగుతుంది. అంటే జనవరి 1వ తేదీ తర్వాత 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీయువకులు నమోదు కోసం వచ్చే ఏడాది స్పెషల్ సమ్మరీ రివిజన్ కోసం వేచి ఉండాల్సి వస్తోంది. అలాంటి వారు ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికలలో పాల్గొనలేకపోతున్నారు.
రిజిస్ట్రేషన్ ఫారాలను మరింత యూజర్ ఫ్రెండ్లీగా సరళంగా కూడా ఎన్నికల సంఘం చేసింది. కొత్తగా సవరించిన ఫారాలు 2022 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2022 ఆగస్టు 1వ తేదీ లోపు స్వీకరించిన పాత ఫారాల్లోని అన్ని అప్లికేషన్ల (క్లెయింలు ,అభ్యంతరాలు) ను కూడా ప్రాసెస్ చేసి పరిష్కరిస్తారు. అటువంటి సందర్భాల్లో, కొత్త ఫారాల్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో అర్హత తేదీగా 01.01.2023ని సూచిస్తూ వార్షిక సమ్మరీ సవరణ కు కమిషన్ ఆదేశించింది. కమిషన్ ప్రస్తుత సూచనలు, మార్గదర్శకాలు, ఎలక్టోరల్ రోల్, 2016పై మాన్యువల్ ,పోలింగ్ స్టేషన్లపై మాన్యువల్, 2020కి అనుగుణంగా అన్ని ముందస్తు సవరణ కార్యకలాపాలను చేపడతారు. జాతీయ ఓటర్ల దినోత్సవం (ప్రతి సంవత్సరం జనవరి 25) కంటే ముందే ఓటర్ల జాబితాలు ప్రచురించబడే విధంగా పునఃసమీక్ష, ముందస్తు సవరణ కార్యకలాపాలు జరుగుతాయి, తద్వారా కొత్త ఓటర్లకు ముఖ్యంగా యువ ఓటర్లకు (18-19 సంవత్సరాలు) జాతీయ ఓటర్ల దినోత్సవం (ఎన్విడి)రోజున ఉత్సవ పద్ధతి లో ఓటరు కార్డులను పంపిణీ చేయవచ్చు.
పోలింగ్ స్టేషన్ ల హేతుబద్ధీకరణ/రీ అరేంజ్ మెంట్; డెమోగ్రాఫిక్ పరంగా/ఫోటో సారూప్య ఎంట్రీల వ్యత్యాసాలను తొలగించడం; అర్హత తేదీగా 01.10.2022కు రిఫరెన్స్ గా సప్లిమెంట్ లు, ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ తయారు చేయడం
ప్రీ రివిజన్ యాక్టివిటీస్ లో భాగం. ప్రస్తుత విడత ప్రీ-రివిజన్ కార్యకలాపాల సమయంలో ఎలక్టోరల్ రోల్ , ఇ పి ఐ సి లలో వ్యత్యాసాల నుండి డిఎస్ఇలు/ పిఎస్ఇలను 100% తొలగించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది.
నవంబర్లో ప్రారంభం కానున్న రివిజన్ కార్యకలాపాల్లో ఏకీకృత ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత స్వీకరించిన క్లెయిమ్లు , అభ్యంతరాల తొలగింపు ఉంటుంది. ప్రత్యేక సమ్మరీ రివిజన్ కింద, డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో క్లెయిమ్లు అభ్యంతరాలను దాఖలు చేయడానికి ఒక నెల వ్యవధి అందుబాటులో ఉంటుంది. వారాంతాల్లో సిఈవోల ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడతాయి, వీటి తేదీ వివరాలను సంబంధిత సి ఇ ఓ ల ద్వారా అందిస్తారు. తుది ఓటర్ల జాబితా 2023 జనవరి 5న ప్రచురితమవుతుంది.
పోలింగ్ స్టేషన్ హేతుబద్ధీకరణ
వార్షిక సమ్మరీ రివిజన్ లో భాగంగా, పోలింగ్ స్టేషన్, 2020 మాన్యువల్లో ఉన్న సూచనలకు అనుగుణంగా ఓటర్ల జాబితాల ముసాయిదా ప్రచురణకు ముందు.1500 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం హేతుబద్ధీకరించాలి / సవరించాలి, సాధ్యమైనంత వరకు పక్క ప్రక్కనే ఉన్న పోలింగ్ కేంద్రాలకు విభాగాలను హేతుబద్ధీకరించిన తరువాత మాత్రమే ఒక కొత్త పోలింగ్ స్టేషన్ సృష్టించబడుతుంది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ఇతర లక్ష్యాలు కుటుంబ సభ్యులు , పొరుగువారిని ఒక విభాగంలో సమూహం చేయడం.
ఎపిక్-ఆధార్ అనుసంధానం
ఓటర్ల జాబితా డేటాతో ఆధార్ సంఖ్యను అనుసంధానించడానికి, ఓటర్ల ఆధార్ వివరాలను పొందడానికి సవరించిన రిజిస్ట్రేషన్ ఫారాల్లో ఏర్పాట్లు చేశారు.ఇప్పటికే ఉన్న ఓటర్ల ఆధార్ సంఖ్యను సేకరించడానికి కొత్త ఫారం - 6 బి ని కూడా ప్రవేశపెట్టారు.
కాగా, ఓటరు జాబితాలో పేరును చేర్చడానికి ఎటువంటి దరఖాస్తును తిరస్కరించరాదు ఆధార్ నెంబర్ సమర్పించడానికి లేదా తెలియజేయని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదు.
దరఖాస్తుదారుల ఆధార్ నంబర్ను నిర్వహించేటప్పుడు, ఆధార్ (ఆర్థిక మరియు ఇతర రాయితీలు, ప్రయోజనాలు మరియు సేవలను లక్ష్యంగా చేసుకున్న డెలివరీ) చట్టం, 2016లోని సెక్షన్ 37లోని నిబంధన కు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని నొక్కి చెప్పబడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది బహిర్గతం కాకూడదు. బహిరంగ ప్రదర్శన కోసం ఓటర్ల సమాచారాన్ని ఉంచాల్సిన అవసరం ఉంటే, ఆధార్ వివరాలను తొలగించాలి లేదా మరుగు పరచాలి..
ప్రస్తుతం ఉన్న ఓటర్ల ఆధార్ నెంబరు సేకరణ కోసం 01.8.22 నుంచి నిర్ణీత కాల వ్యవధి డ్రైవ్ మొదలవుతుంది. ఆధార్ సంఖ్యను సమర్పించడం పూర్తిగా స్వచ్ఛందం. ఓటర్ల కు స్థిరమైన గుర్తింపును కల్పించడం , ఓటర్ల జాబితాలోని ఎంట్రీల ధృవీకరణ ఈ కార్యక్రమం లక్ష్యం.
ఓటర్ల జాబితా నుంచి రిపీట్/మల్టిపుల్ ఎంట్రీల తొలగింపు
రిపీట్/మల్టిపుల్ ఎంట్రీల తొలగింపు నకు సమగ్ర ప్రక్రియను నిర్దేశించారు. వ్యక్తిగత పౌరులు, రాజకీయ పార్టీల బిఎల్ ఎలు లేదా ఆర్ దబ్ల్యు ఏ ద్వారా నివేదించబడ్డ పునరావృత/బహుళ ఎంట్రీల్లో, ప్రతి కేసులో ఫీల్డ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా జరుగుతుంది. అతడు/ఆమె సాధారణంగా నివసిస్తున్నట్లుగా కనుగొనబడని ప్రదేశంలో మాత్రమే ఓటరు పేరు ను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు.
సమగ్రమైన, ఆరోగ్యవంతమైన ఓటర్ల జాబితా కోసం క్షేత్ర స్థాయి / సూపర్ తనిఖీ వ్యవస్థ
ఓటర్ల జాబితా సమగ్రతను మెరుగుపరచడానికి, బూత్ స్థాయి అధికారులచే క్షేత్ర ధృవీకరణ అవసరాన్ని ఎన్నికల సంఘం నొక్కి చెప్పింది.సూపర్ వైజర్ లు, ఈఆర్ వోలు ,ఏఈఆర్ వోలు వంటి వివిధ స్థాయిల ఎన్నికల అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా చేసే పనులపై కచ్చితమైన జవాబుదారీతనాన్ని అమలు చేయడం కోసం పర్యవేక్షణ , తనిఖీ లకు ఒక యంత్రాంగం ఉంది. అదేవిధంగా, డీఈవోలు, రోల్ అబ్జర్వర్లు , సిఇఒలు కూడా క్లెయింలు ,అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈఆర్వోలు చేసిన పనిని తనిఖీ చేస్తారు. అంతేకాకుండా, ఈసిఐ, ఓ/ఓ సిఇఓల నుండి అధికారులు కూడా తదుపరి యాదృచ్ఛిక తనిఖీలకు, పర్యవేక్షించడానికి నియమించబడతారు.
భాగస్వామ్య ప్రక్రియ: బి ఎల్ ఎల పాత్ర
రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని మరింత నిర్ధారించడానికి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఎలు) ఒక బిఎల్ఎ ఒక సమయంలో / ఒక రోజులో బిఎల్ఓకు 10 కంటే ఎక్కువ ఫారాలను సమర్పించరాదనే షరతుకు లోబడి.
పెద్ద మొత్తంలో దరఖాస్తులను దాఖలు చేయడానికి కమిషన్ అనుమతించింది, క్లెయింలు ,అభ్యంతరాలను దాఖలు చేసే మొత్తం కాలంలో బిఎల్ఎ 30 కంటే ఎక్కువ అప్లికేషన్ లు/ఫారాలను ఫైల్ చేసినట్లయితే, అప్పుడు క్రాస్ వెరిఫికేషన్ ని ఇ ఆర్ ఓ/ ఏ ఇ ఆర్ ఓ స్వయంగా చేయాలి. తదుపరి, దరఖాస్తు ఫారాల వివరాలను తాను వ్యక్తిగతంగా తనిఖీ చేశానని ,అవి సరైనవని సంతృప్తి చెందినట్లు డిక్లరేషన్ తో బిఎల్ఎ అప్లికేషన్ ఫారాల జాబితాను కూడా సబ్మిట్ చేయాలి
****
(रिलीज़ आईडी: 1845930)
आगंतुक पटल : 1902
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam