ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ట్రపతి గా శ్రీమతి ద్రౌపది ముర్మూ గారు ఎన్నికైనందుకు ఆమె కు అభినందన లుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 21 JUL 2022 9:12PM by PIB Hyderabad

భారతదేశాని కి రాష్ట్రపతి గా శ్రీమతి ద్రౌపది ముర్మూ గారు ఎన్నికయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘భారతదేశం చరిత్ర ను లిఖించింది. 130 కోట్ల మంది భారతీయులు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను జరుపుకొంటున్న కాలం లో, భారతదేశం లోని తూర్పు ప్రాంతం లో గల ఓ మారుమూల గ్రామం లో జన్మించినటువంటి, ఆదివాసీ సముదాయాని కి చెందినటువంటి ఒక కుమార్తె ను మన రాష్ట్రపతి పదవి కి ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్య సాధన కు గాను శ్రీమతి ద్రౌపది ముర్మూ గారి కి ఇవే అభినందన లు.’’

 

‘‘శ్రీమతి ద్రౌపది ముర్మూ గారి జీవనం, ఆమె ఆరంభిక సంఘర్షణ లు, ఆమె అందించినటువంటి సమృద్ధ సేవ లు మరియు మార్గదర్శకప్రాయమైనటువంటి ఆవిడ సాఫల్యం.. ఇవి భారతదేశం లో ప్రతి ఒక్క వ్యక్తి కి ప్రేరణ ను అందించేటటువంటివి గా ఉన్నాయి. ఆమె మన పౌరుల కు, విశేషించి పేదల కు, ఆదరణ కు దూరం గా ఉండిపోయిన వర్గాల వారి కి మరియు బలహీన వర్గాల వారికి ఒక ఆశా కిరణం వలె ఉదయించారు.’’

 

‘‘శ్రీమతి ద్రౌపది ముర్మూ గారు ఒక శ్రేష్ఠ శాసన సభ్యురాలు గా మరియు మంత్రి గా విధుల ను నిర్వర్తించారు. ఝార్ ఖండ్ కు గవర్నరు గా ఆమె పదవీకాలం ఉత్కృష్టంగా ఉండింది. నాకు నమ్మకం ఉంది.. ఆమె ఒక విశిష్టమైనటువంటి రాష్ట్రపతి కాగలరని, ముందువరుస లో నిలబడి నాయకత్వాన్ని అందిస్తారని, ఇంకా భారతదేశం యొక్క అభివృద్ధి ప్రస్థానాన్ని బలోపేతం చేస్తారనీనూ.’’

 

‘‘శ్రీమతి ద్రౌపది ముర్మూ గారి అభ్యర్థిత్వాన్ని సమర్ధించినటువంటి వేరు వేరు రాజకీయపక్షాల కు చెందిన ఎంపీ లు మరియు శాసనసభ్యులందరికి నేను ధన్యవాదాలు తెలియజేయదలచుకొన్నాను. ఆమె రికార్డు విజయం మన ప్రజాస్వామ్యాని కి ఒక మంచి శకునం గా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

India scripts history. At a time when 1.3 billion Indians are marking Azadi Ka Amrit Mahotsav, a daughter of India hailing from a tribal community born in a remote part of eastern India has been elected our President!

Congratulations to Smt. Droupadi Murmu Ji on this feat.

— Narendra Modi (@narendramodi) July 21, 2022

Smt. Droupadi Murmu Ji's life, her early struggles, her rich service and her exemplary success motivates each and every Indian. She has emerged as a ray of hope for our citizens, especially the poor, marginalised and the downtrodden.

— Narendra Modi (@narendramodi) July 21, 2022

Smt. Droupadi Murmu Ji has been an outstanding MLA and Minister. She had an excellent tenure as Jharkhand Governor. I am certain she will be an outstanding President who will lead from the front and strengthen India's development journey.

— Narendra Modi (@narendramodi) July 21, 2022

I would like to thank all those MPs and MLAs across party lines who have supported the candidature of Smt. Droupadi Murmu Ji. Her record victory augurs well for our democracy.

— Narendra Modi (@narendramodi) July 21, 2022

****



(Release ID: 1843800) Visitor Counter : 171