ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్ వెల్త్ గేమ్స్ 2022 కు బయలుదేరి వెళ్ళనున్న భారతీయ జట్టు తో జులై 20న సమావేశం కానున్న ప్రధాన మంత్రి

Posted On: 18 JUL 2022 5:06PM by PIB Hyderabad

కామన్ వెల్త్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో పాలుపంచుకోనున్న భారతీయ క్రీడాకారులు, క్రీడాకారిణుల జట్టు సభ్యుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 20వ తేదీ న ఉదయం 10 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమం లో క్రీడాకారులు, క్రీడాకారిణుల తో పాటు వారి కోచ్ లు కూడా పాల్గొంటారు.

ప్రధానమైన క్రీడా సంబంధిత కార్యక్రమాల లో క్రీడాకారులు, క్రీడాకారిణులు పాలుపంచుకునే సందర్భాల లో ముందస్తు గా వారి కి స్ఫూర్తి ని ఇవ్వడం కోసమని ప్రధాన మంత్రి క్రమం తప్పక చేస్తున్నటువంటి ప్రయత్నాల లో ఈ సమావేశం ఒక భాగం గా ఉంది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో పాల్గొనడానికి బయలుదేరిన భారతదేశం యొక్క క్రీడాకారులు, క్రీడాకారిణుల జట్టు తోను, టోక్యో 2020 పారాలింపిక్స్ గేమ్స్ తాలూకు భారతదేశం పారా ఏథ్ లీట్స్ జట్టు తోను కిందటి సంవత్సరం లో ప్రధాన మంత్రి సమావేశమయ్యారు.

క్రీడోత్సవాలు జరుగుతూ ఉన్న కాలం లో సైతం, క్రీడాకారులు, క్రీడాకారిణులు ఏవిధం గా పురోగమిస్తున్నదీ తెలుసుకుంటూ ఉండడం లో ప్రధాన మంత్రి మంచి కుతూహలాన్ని వ్యక్తపరిచారు. అనేక సందర్భాల లో క్రీడాకారులు, క్రీడాకారిణులు సఫలత ను సాధించినప్పుడు గాని, లేదా చిత్తశుద్ధి తో ప్రయత్నాలు చేసినప్పుడు గాని వారిని అభినందించడం కోసం కు ఆయన స్వయంగా ఫోన్ చేసి వారి తో మాట్లాడారు; వారు మరింత గా రాణించేటట్టు గా వారి లో ప్రేరణ ను రగిలిస్తూ వచ్చారు. దీనికి తోడు, వారు దేశాని కి తిరిగి వచ్చిన తరువాత కూడాను, ప్రధాన మంత్రి ఆయా క్రీడాకారుల, క్రీడాకారిణుల జట్టుల తో భేటీ అయ్యారు.

కామన్ వెల్త్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 జులై నెల 28వ తేదీ మొదలుకొని ఆగస్టు నెల 8వ తేదీ వరకు బర్మింగ్ హమ్ లో జరుగనుంది. మొత్తం 215 మంది క్రీడాకారులు, క్రీడాకారిణులు 19 క్రీడావిభాగాల లో 141 ఈవెంట్స్ లో పాల్గొని, భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించనున్నారు.

 

***(Release ID: 1842527) Visitor Counter : 87