ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022వ సంవత్సరం లో పార్లమెంటు వర్షకాల సమావేశాలు మొదలవడాని కంటేముందు ప్రధాన మంత్రి చేసిన ప్రకటన పాఠం 

Posted On: 18 JUL 2022 10:25AM by PIB Hyderabad

మిత్రులారా నమస్కారం,

ఈ సమావేశాల కు వాతావరణం తో సంబంధం ఉన్నది. ఇప్పుడు దిల్లీ లోనూ వర్ష రుతువు తన ప్రవేశాన్ని ఆరంభించేసింది. అయినప్పటికీ బయటి ఉష్ణోగ్రత తగ్గడం లేదు; సభ లోపల సైతం వేడిమి తగ్గుతుందా తగ్గదా అన్నది తెలియదు. ఈ కాలఖండం ఒక విధం గా చాలా ముఖ్యమైనటువంటిది గా ఉంది. ఎలాగంటే ఇది మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకొంటున్న కాలం మరి. ఆగస్టు 15వ తేదీ కి ఒక విశేషమైన ప్రాముఖ్యం ఉన్నది; భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, దేశం మరో 25 సంవత్సరాల కు ఎప్పుడైతే శతాబ్ది వేడుక ను జరుపుకొంటుందో, 25 సంవత్సరాల కాలం లోనూ మన ప్రయాణం ఎలా ఉండాలి?, మనం ఎంత వేగం గా ముందుకు వెళ్ళగలం? సరికొత్త శిఖరాల కు ఏ విధం గా మనం చేరుకోగలం? అనే వాటి విషయం లో మనం ఒక ప్రణాళిక ను సిద్ధం చేసుకోవలసి ఉంది. ఈ కాలం ఆ తరహా సంకల్పాల ను చెప్పుకొని, ఆయా సంకల్పాల కు అంకితమై, దేశాని కి ఒక దిశ ను ఇవ్వడానికి సంబంధించింది. సభ దేశాని కి నాయకత్వాన్ని వహించవలసి ఉంది. దేశ ప్రజల లో నూతన శక్తి ని నింపడం కోసం సభ లోని గౌరవనీయులైన సభ్యులంతా ఒక సాధనం వలె మారాలి. అందువల్ల, ఈ సమావేశాలు ఆ దృష్టికోణం లో నుంచి చూసినప్పుడు చాలా ప్రాముఖ్యం కలిగినవి గా ఉన్నాయి.

ఈ సమావేశాలు మరో కారణం గా కూడా కీలకం. అది ఎలాగంటే, ఇదే కాలఖండం లో రాష్ట్రపతి పదవి కి మరియు ఉప రాష్ట్రపతి పదవి కి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రోజు న వోటింగు కూడా కొనసాగుతున్నది. మరి ఇదే కాలఖండంలో కొత్త రాష్ట్రపతి మరియు కొత్త ఉపరాష్ట్రపతి ల పదవీకాలం కూడా మొదలై వారి మార్గదర్శనం ఆరంభం అవుతుందన్నమాట.

సభ ను భావ ప్రసారం తాలూకు ఒక ప్రభావశీల మాధ్యమం గాను, తీర్థ క్షేత్రం గాను మనం ఎల్లవేళ ల భావిస్తాం; ఎక్కడయితే అరమరికల కు తావు ఉండనటువంటి బుద్ధి తో చర్చ జరుగుతుందో, చర్చోపచర్చ లు సాగి, విమర్శ లు కూడా చోటు చేసుకొని మరి సమగ్ర విశ్లేషణ ద్వారా విధానాల లోను, నిర్ణయాల లోను అతి సకారాత్మకతమైన తోడ్పాటు లభిస్తుందో. సభ ను వీలైనంత మేరకు ఫలప్రదం గా, నిర్మాణాత్మకం గా తీర్చిదిద్దడానికి కలసి రావలసిందంటూ మాన్య ఎంపి లు అందరి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కారణం గా ప్రతి ఒక్కరు వారి వారి ప్రయత్నాల ద్వారా మాత్రమే ప్రజాస్వామిక విలువల ను వర్ధిల్ల జేయగలుగుతారు. అందరి కృషి తో సభ ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్కరి ప్రయాసల తోనే సభ ఉత్తమ నిర్ణయాన్ని తీసుకోగలుగుతుంది. మరి ఇందువల్ల, మనం సభ యొక్క హుందాతనాన్ని మెరుగు పరచడానికి గాను మనం మన విధుల ను నెరవేర్చుతూనే దేశ ప్రజల హితం కోసం వీలున్నంత ఎక్కువ స్థాయి లో ఈ సమావేశాల ను వినియోగించుకోవాలి. స్వేచ్ఛ కోసం ఎవరైతే వారి జీవనం లోని యవ్వన దశ తో పాటు వారి యావత్తు జీవనాన్ని కూడాను సమర్పణం చేశారో, వారి జీవనాన్ని కారాగారం లో గడిపివేశారో, ఎంతటి త్యాగాల కు సిద్ధపడ్డారో అటువంటి వారు కన్న కలల ను మనం నెరవేర్చవలసిన అవసరం ఉందని మనం సదా జ్ఞాపకం పెట్టుకోవాలి. వారి స్వప్నాల ను దృష్టి లో పెట్టుకొని, ఆగస్టు 15వ తేదీ సమీపిస్తుండగా మనం సభ ను సర్వాధిక సకారాత్మక రీతి లో ఉపయోగించుకొనేటట్టు చూడవలసి ఉంది. నేను ఆశపడుతున్నది ఇదే.
మీ అందరి కి హృదయపూర్వక ధన్యవాదాలు.

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

 

***


(Release ID: 1842376) Visitor Counter : 188