ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మన్కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమానికి ఆలోచనల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 15 JUL 2022 9:29AM by PIB Hyderabad

మన్ కీ బాత్’ (మనసు లో మాట’) శ్రేణి లో తదుపరి కార్యక్రమం 2022వ సంవత్సరం జులై 31వ తేదీ న ఉదయం 11 గంటల వేళ కు ప్రసారం కానుండగా, ఆ కార్యక్రమాని కై ప్రజలు వారి వారి ఆలోచనల ను మరియు సూచనల ను పంపవలసింది గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఆలోచనల ను మైగవ్ (MyGov), నమో ఏప్ (Namo App) ల ద్వారా వెల్లడి చేయవచ్చును; లేదా, 1800-11-7800 నంబరు కు డయల్ చేసి సందేశాన్ని నమోదు చేయగలరు.

మైగవ్ (MyGov) ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి శేర్ చేస్తూ, ఒక ట్వీట్ లో -

‘‘ఈ నెల 31న ప్రసారం అయ్యేటటువంటి #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి గాను మీరు ఏవైనా సూచనలు చేయదలచుకున్నారా? నేను వాటి ని గురించి తెలుసుకోవాలి అని ఆశ పడుతున్నాను.. వాటి ని మైగవ్ (MyGov) లో గాని లేదా నమో ఏప్ (Namo App) లో గాని తెలియజేయండి. మీ యొక్క సందేశాన్ని 1800-11-7800 నంబరు కు డయల్ చేసి రెకార్డ్ చేయగలరు.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 

 

 

 

 

 


(रिलीज़ आईडी: 1841813) आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam