ప్రధాన మంత్రి కార్యాలయం
హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లో జరిగిన బస్సు దుర్ఘటన తో బాధపడ్డ ప్రధాన మంత్రి
బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఆయన ప్రకటించారు
నాడు పోస్టు చేయడమైనది:
04 JUL 2022 11:31AM by PIB Hyderabad
హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ జిల్లా లో జరిగిన దుఃఖదాయకమైనటువంటి బస్సు ప్రమాదం కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ‘ప్రధాన మంత్రి సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వడం జరుగుతుందని, ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతు న ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -
‘‘హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లో జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకం గా ఉంది. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఈ దు:ఖ ఘడియ లో ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు అతి తర్వలోనే కోలుకొంటారని నేను ఆశిస్తున్నాను. బాధితుల కు సాధ్యమైన అన్ని విధాలు గాను సహాయాన్ని స్థానిక పాలన యంత్రాంగం అందజేస్తోంది: ప్రధాన మంత్రి @narendramodi’’
‘‘హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన దుఃఖదాయకమైనటువంటి బస్సు దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని ఇచ్చేందుకు ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు; అలాగే, ఈ ఘటన లో గాయపడ్డ వారికి ఒక్కొక్కరి కి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.’’ అని పేర్కొంది.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1839096)
సందర్శకుల సూచీ సంఖ్య : : 184
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam