ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ర‌ష్య‌న్ ఫెడ‌రేష‌న్‌ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 01 JUL 2022 3:43PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ర‌ష్యన్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు హిజ్ ఎక్స‌లెన్సీ వ్లాదిమిర్ పుతిన్ తో  టెలిఫోన్ లో మాట్లాడారు. ఇరువురు నాయ‌కులు 2021 డిసెంబ‌ర్‌లో అధ్య‌క్షుడు పుతిన్ భార‌త‌దేశ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా తీసుకున్న నిర్ణ‌యాల అమ‌లు గురించి స‌మీక్షించారు. ప్ర‌త్యేకించి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు, ఎరువులు, ఫార్మాఉత్ప‌త్తుల‌కు సంబంధించి ద్వైపాక్షిక వాణిజ్యంపై వారు తమ ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు. దీనిని మ‌రింత ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించారు.
ఇరువురు నాయ‌కులు అంత‌ర్జాతీయ ఇంధ‌నం, ఫుడ్ మార్కెట్ తో పాటు ప‌లు అంత‌ర్జాతీయ అంశాల‌ను చ‌ర్చించారు.
ఉక్రెయిన్‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి, చ‌ర్చ‌లు , దౌత్య మార్గాల‌లో స‌మ‌స్య ప‌రిష్కారం కావాల‌న్న భార‌త‌దేశ‌పు దీర్ఘ‌కాల విధానాన్నే ఈ సంద‌ర్భంగా పున‌రుద్ఘాటించారు.
అంత‌ర్జాతీయ‌, ద్వైపాక్షిక అంశాల‌పై నాయకులు ఇరువురూ ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దించుకుంటూ ఉండేందుకు వారు అంగీక‌రించారు 

***(Release ID: 1838610) Visitor Counter : 86