ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యెయిర్ లాపిడ్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
01 JUL 2022 1:17PM by PIB Hyderabad
ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన, హిజ్ ఎక్సలెన్సీ యెయిర్ లాపిడ్‌కు ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే హిజ్ ఎక్సలెన్సీ నఫ్తలి బెన్నెట్ భారత్ కు నిజమైన స్నేహితుడుగా ఉన్నారని అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇందుకు సంబంధించి వరుస ట్వీట్లు చేస్తూ ప్రధానమంత్రి,
"హిజ్ ఎక్సలెన్సీ యెయిర్‌లాపిడ్ ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక అభినందనలు. ఇరుదేశాల మధ్య పూర్తి స్థాయి దౌత్యసంబంధాలు ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఎదురుచూస్తున్నాను" అని ప్రధానమంత్రి తమ సందేశంలో తెలిపారు.
అలాగే, "హిజ్ ఎక్సలెన్సీ నఫ్తాలిబెన్నెట్, భారతదేశానికి నిజమైన స్నేహితుడిగా ఉన్నందుకు వారికి కృతజ్ఞతలు , మన మధ్య ఫలవంతమైన చర్చల జ్ఞాపకాలను నేను గుర్తుచేసుకుంటున్నాను. మీ నూతన పాత్రలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1838568)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam