వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

మొదటి బ్యాచ్ గ్రామ ఇంజనీర్లకు ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది; మోడల్‌ను ఇతర జిల్లాలకు అనుకరించాలి


ఆత్మనిర్భర్ భారత్‌కు వెళ్లే మార్గం ఆత్మనిర్భర్ గ్రామాల గుండా ప్రయాణిస్తుంది - శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

నైపుణ్యాలు శ్రేయస్సుకు పాస్‌పోర్ట్ -శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 30 JUN 2022 1:27PM by PIB Hyderabad

గ్రామీణ యువకుల సాధికారతతో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప్ ప్రారంభమవుతుంది. ఆత్మనిర్భర్ భారత్‌కు వెళ్లే రహదారి ఆత్మనిర్భర్ గ్రామాల గుండా వెళుతుంది. స్థానికంగా ఉపాధి/స్వయం ఉపాధి మరియు వ్యవస్థాపకత వంటి కొత్త అవకాశాలను సృష్టించడం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి విశ్వాసం కలిగించే ఆంశమని నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద గిరిజన యువతకు రూరల్ ట్రైబల్ టెక్నికల్ ట్రైనింగ్ లేదా గ్రామీణ ఉద్యమి కార్యక్రమం భోపాల్ లోని రాజ్ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.



image.png
 

ఈరోజు మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో..గ్రామీణ ఇంజనీర్లుగా మారిన సుమారు 140 మంది గిరిజన యువకులకు స్కిల్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు మరియు "పాస్‌పోర్ట్ టు ప్రోస్పెరిటీ"గా పేర్కొన్న నైపుణ్యాలను సాధించినందుకు ట్రైనీలను ఆయన అభినందించారు.

పైలట్ ప్రాజెక్ట్‌పై తన సంతృప్తిని వ్యక్తం చేసిన మంత్రి.. పైలట్ ప్రోగ్రామ్ విజయం దేశంలోని ఇతర జిల్లాలకు ప్రతిబింబించేలా లాంచ్ ప్యాడ్‌ను అందజేస్తుందని చెప్పారు. ఇది స్థానికంగా అవకాశాలను అందుబాటులో ఉంచడం ద్వారా గిరిజన యువతకు సాధికారతను కల్పిస్తుందని తద్వారా వలసల నిర్మూల జరుగుతుందని తెలిపారు. ఇది స్వయం ప్రతిపత్తి లేదా ఆత్మనిర్భర్తపై దృష్టి సారించే ప్రభుత్వ కొత్త ఆర్థిక దృక్పథానికి అనుగుణంగా జిల్లాల్లో స్థానిక స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుందని అన్నారాయన.

విద్యుత్ మరియు సౌరశక్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ఇ-గవర్నెన్స్, ప్లంబింగ్ మరియు తాపీపని, ద్విచక్ర వాహనాల మరమ్మతు మరియు నిర్వహణ వంటి 5 విభాగాలలో లబ్ధిదారులకు ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ అందించబడింది.  యువత తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేలా ఈ శిక్షణ చేస్తుంది. తద్వారా ఇతర యువతకు కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మల్టీ స్కిల్లింగ్ మరియు నిరుద్యోగ యువతను విలేజ్ ఇంజనీర్లుగా మార్చడం అనే కాన్సెప్ట్ ఇతర జిల్లాల్లో కూడా పునరావృతమవుతుంది.

కోవిడ్ అనంతర కాలంలో నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను మంత్రి హైలైట్ చేశారు. కోవిడ్ మహమ్మారి భారతదేశంతో పాటు భారతీయులకు భారీ అవకాశాలను అందించే సాంప్రదాయ సరఫరా గొలుసులలో అంతరాయాలకు దారితీసిందని ఆయన అన్నారు. ప్రపంచం ఇప్పుడు విశ్వసనీయ భాగస్వామి కోసం వెతుకుతోంది. ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నందున..గ్లోబల్ స్కిల్స్ హబ్‌గా ఎదగడానికి మన యువతకు నైపుణ్యం అవసరం. స్కిల్ ఇండియా 1.0 యొక్క లాభాలను పెంపొందించడానికి & కోవిడ్ తర్వాత అభివృద్ధి చెందుతున్న న్యూ వరల్డ్ ఆర్డర్‌లో భారతదేశానికి అందించబడిన కొత్త ఆర్థిక అవకాశాలను ఉపయోగించుకోవడానికి నైపుణ్యం పట్ల ఒక కొత్త విధానాన్ని రూపొందించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమని ఆదేశించారని మంత్రి చెప్పారు.

భారతదేశంలోని 6 రాష్ట్రాలు - మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా నుండి ఎంపిక చేయబడిన 17 జిల్లాల్లోని 17 క్లస్టర్లలో 250 మంది లబ్ధిదారుల శిక్షణ కోసం సంసదియ సంకుల్ పరియోజన కింద పైలట్ ప్రాజెక్ట్ 13 మే 2022న ప్రారంభించబడింది. మధ్యప్రదేశ్ సీఎం శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఎంఓఎస్ రాజీవ్ చంద్రశేఖర్, శ్రీ బీఎల్ సంతోష్ ఇతర ప్రముఖుల సమక్షంలో దీనిని ప్రారంభించారు.

గ్రామీణ యువతకు మరిన్ని అవకాశాలను అందించడానికి అలాగే స్థానిక గ్రామ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నైపుణ్యానికి ఒక ముఖ్యమైన అంశంగా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి 700 జిల్లాలకు జిల్లా నైపుణ్య ప్రణాళికలను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోను నియమించింది. వారు స్థానిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను రూపొందించడంలో జిల్లా ప్రజా ప్రతినిధిగా స్థానిక జిల్లా కలెక్టర్‌తో కలిసి పని చేస్తారు. స్థానికంగా  ఏ రకమైన నైపుణ్యాలు అవసరం, అక్కడ ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి మరియు రాష్ట్రంలో మరియు దేశంలోని స్థానిక సంఘం వెలుపల నైపుణ్యాల కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే ఆంశాల ఆధారంగా దీనిని వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యవసాయేతర ఆర్థిక వ్యవస్థగా విభజించారు.


 

******



(Release ID: 1838256) Visitor Counter : 198