ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బిఆర్ఐసిఎస్ 14వ శిఖర సమ్మేళనం 2022 లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చినప్రారంభిక ప్రసంగం 

Posted On: 23 JUN 2022 8:01PM by PIB Hyderabad

శ్రేష్ఠుడు అధ్యక్షుడు శ్రీ శీ ,

శ్రేష్ఠుడు అధ్య‌క్షుడు శ్రీ రామాఫోసా ,

శ్రేష్ఠుడు అధ్య‌క్షుడు శ్రీ బోల్సోనారొ ,

శ్రేష్ఠుడు అధ్యక్షుడు శ్రీ పుతిన్ ,
అన్నింటి కంటే ముందుగా, అంతర్జాతీయ యోగ దినం సందర్భం లో బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్’) సభ్యత్వ దేశాలు అన్నింటి లో చోటు చేసుకొన్న అద్భుతమైనటువంటి కార్యక్రమాల కు గాను మీ అందరికీ ఇవే నా అభినందన లు. మీ మీ జట్ల నుంచి మాకు అందినటువంటి మద్దతు కు గాను నా కృతజ్ఞతల ను కూడా నేను వ్యక్తం చేయదలచుకొన్నాను.
శ్రేష్ఠులారా,
ఈ రోజు న వరుస గా మూడో సంవత్సరం లో మనం కోవిడ్ మహమ్మారి రువ్విన సవాళ్ళ మధ్య వర్చువల్ మాధ్యమం ద్వారా కలుసుకొంటున్నాం.

ప్రపంచ స్థాయి లో మహమ్మారి ప్రకోపం ఇదివరకటి తో పోలిస్తే తగ్గింది; అయినప్పటికీ, దాని తాలూకు అనేక దుస్ప్రభావాలు ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో కనిపిస్తూనే ఉన్నాయి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క గవర్నెన్స్ విషయం లో మన బ్రిక్స్ సభ్యత్వ దేశాల దృష్టికోణం చాలావరకు సమానమైంది గా ఉంటూ వచ్చింది.
మరి, ఈ కారణం గా మన పరస్పర సహకారం కోవిడ్ అనంతర కాలం లో ప్రపంచం తిరిగి కోలుకోవడానికి ఒక ఉపయోగకరమైనటువంటి తోడ్పాటును ఇవ్వగలుగుతుంది.
కొన్ని సంవత్సరాలు గా మనం బ్రిక్స్ లో అనేక సంస్థాగతమైన సంస్కరణల ను తీసుకు వచ్చాం, ఆ సంస్కరణ లు ఈ సంస్థ యొక్క ప్రభావశీలత ను పెంచివేశాయి.
మన న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ లో సభ్యత్వాలు కూడా వృద్ధి చెందడం అనేది కూడాను సంతోషదాయకమైన విషయం.
మన పరస్పర సహకారం వల్ల మన పౌరుల జీవితాల లో ప్రత్యక్ష లబ్ధి ఒనగూరుతున్న రంగాలంటూ అనేకం ఉన్నాయి.
ఉదాహరణ కు తీసుకొంటే, టీకా మందు సంబంధిత పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ ఎండ్ డి) కేంద్రం తో పాటు కస్టమ్స్ విభాగాల మధ్య నెలకొన్న సమన్వయం, కృత్రిమ ఉపగ్రహాల ను ఉమ్మడి గా ఏర్పాటు చేయడం, ఔషధ రంగ ఉత్పత్తుల కు పరస్పరం గుర్తింపు ను ఇచ్చుకోవడం వంటి అంశాల ను గురించి ప్రస్తావించుకోవచ్చును.
ఈ తరహా ఆచరణీయ చర్య లు బ్రిక్స్ ను ఒక విశిష్టమైన అంతర్జాతీయ సంస్థ గా తీర్చిదిద్దుతాయి; అంటే ఈ సంస్థ దృష్టి కేవలం చర్చ వరకే పరిమితం కాదు అన్నమాట.
బ్రిక్స్ యువజన శిఖర సమ్మేళనలు, బ్రిక్స్ క్రీడలు, మన పౌర సమాజ సంస్థలు మరియు మన మేధావి బృందాల మధ్య ఆదాన ప్రదానాలు మన ప్రజల మధ్య పరస్పర సంప్రదింపుల ను పటిష్టం చేశాయి.
ఈ రోజు న జరిగే చర్చ మన బ్రిక్స్ సంబంధాల ను మరింత బలోపేతం చేయడానికి అనేక సూచనల ను అందిస్తుందన్న నమ్మకం నాలో ఉంది.
మీ అందరి కి ధన్యవాదాలు.

అస్వీకరణ - ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

***


(Release ID: 1836720) Visitor Counter : 219