ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నలభైనాలుగోచెస్ ఒలింపియాడ్ కోసం చరిత్రాత్మక టార్చ్ రిలే ను జూన్ 19 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి 


చెస్ ఒలింపియాడ్ కు భారతదేశం మొట్టమొదటిసారి గా ఆతిథేయి గా వ్యవహరించనుంది

ఒలింపిక్స్ తరహా లో టార్చ్ రిలే ను చెస్ ఒలింపియాడ్ లో ప్రప్రథమం గాప్రవేశపెట్టడం జరిగింది

చెస్ ఒలింపియాడ్ కు భవిష్యత్తు లో జరిగే టార్చ్ రిలేలన్నిటిని భారతదేశంనుంచి మొదలు పెట్టడం జరుగుతుంది

Posted On: 17 JUN 2022 4:47PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 44వ చెస్ ఒలింపియాడ్ తాలూకు చరిత్రాత్మకమైనటువంటి టార్చ్ రిలే కార్యక్రమాన్ని జూన్ 19వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ స్టేడియమ్ లో సాయంత్రం 5 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ఆయన ఒక సభ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ సంవత్సరం లో, మొట్టమొదటి సారి గా, అంతర్జాతీయ చదరంగం నిర్వాహక సంస్థ ఎఫ్ఐడిఇ (‘ఫిడే’) చెస్ ఒలింపియాడ్ టార్చ్ ను ప్రవేశపెట్టింది. ఒలింపిక్స్ సంప్రదాయం లో చెస్ ఒలింపియాడ్ టార్చ్ ఒక భాగం గా ఉంది; కానీ, చెస్ ఒలింపియాడ్ లో టార్చ్ రిలే ను ఎన్నడూ పాటించ లేదు. చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే సంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఒకటో దేశం గా భారతదేశం నిలవబోతోంది. భారతదేశం లో చదరంగం క్రీడ ను ఒక గొప్ప శిఖర స్థాయి కి తీసుకుపోయే క్రమం లో, చెస్ ఒలింపియాడ్ కోసమని ఈ టార్చ్ రిలే సంప్రదాయాన్ని ఇకమీదట భారతదేశం లోనే ఎల్లప్పుడూ ఆరంభించడం జరుగుతుంది; తరువాత ఈ టార్చ్ రిలే ఆతిథ్య దేశాన్ని చేరుకోవడాని కన్నా ముందు అన్ని ఖండాల గుండా పయనిస్తుంది.

ఫిడే అధ్యక్షుడు శ్రీ అర్ కాది దోర్ కొవిచ్ కాగడా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అప్పగించనున్నారు. ఆయన దానిని తన వంతు గా గ్రాండ్ మాస్టర్ శ్రీ విశ్వనాథన్ ఆనంద్ చేతి కి అందించనున్నారు. ఈ కాగడా ను అటు తరువాత 40 రోజుల వ్యవధి లో 75 నగరాల కు తీసుకుపోయి, చివర లో చెన్నై కు సమీపం లోని మహాబలిపురం లో ఉంచుతారు. ప్రతి మజిలీ లోనూ ఆ రాష్ట్రాని కి చెందిన చదరంగం గ్రాండ్ మాస్టర్ లు కాగడా ను స్వీకరిస్తారు.

నలభైనాలుగో చెస్ ఒలింపియాడ్ 2022వ సంవత్సరం లో జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ ల మధ్య చెన్నై లో జరుగనుంది. 1927వ సంవత్సరం నాటి నుంచి నిర్వహిస్తూ వస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ ని భారతదేశం లో ప్రప్రథమం గా మరియు ఆసియా లో 30 సంవత్సరాల తరువాత నిర్వహించడం జరుగుతున్నది. 189 దేశాలు పాలుపంచుకొంటుండడం తో, ఇది ఏదైనా చెస్ ఒలింపియాడ్ లో అతి పెద్ద ప్రాతినిధ్యం కలిగినటువంటిది గా గా లెక్క కు రానున్నది.

 

***


(Release ID: 1835554) Visitor Counter : 127