మంత్రిమండలి
azadi ka amrit mahotsav

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సభ్య దేశాల అధీకృత సంస్థల మధ్య యువశక్తి రంగంలో సహకార ఒప్పందానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 14 JUN 2022 4:10PM by PIB Hyderabad

యువశక్తి రంగంలో కలిసి పనిచేయడానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సభ్య దేశాల అధీకృత సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ దృష్టికి తీసుకు రావడం జరిగింది. 

యువశక్తి రంగంలో కలిసి పనిచేయాలన్న అవగాహనకు 17.09.2021 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలు వచ్చాయి. ఒప్పందంపై  భారతదేశం తరఫున కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి సంతకం చేశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వ్యవహార అధికార భాషలుగా రష్యన్ మరియు చైనీస్ భాష ఉంటాయి. 

సహకార అంశాలు:

యువత, యువజన సంస్థలు ( సంఘాలు)ల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించి యువజన విధానాలను అమలు చేయడంతో పాటు అంతర్జాతీయంగా యువత మధ్య సహకారం పెంచడం లాంటి అంశాలపై పరస్పర సహకారంతో పనిచేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. యువతకు వృత్తిపరమైన నైపుణ్యాలు అందించడం,  శాస్త్రీయసూచన మరియు విధానపరమైన అంశాల  మార్పిడిజాతీయ సంస్థల పని అనుభవం పంచుకోవడంయువజన ప్రజా సంస్థలకు ప్రోత్సాహంయువజన విధానాల అమలులో సంబంధం ఉన్న సంస్థలుసంఘాల మధ్య అవగాహన కల్పించడంయువతకు సంబంధించిన అంశాలపై పరిశోధన సాగించిపరిశోధన ఫలాలను పరస్పరం అందించుకోవడంశాస్త్రీయ ప్రచురణల మార్పిడివిధ్వంసక కార్యక్రమాల్లో  యువత పాల్గొనకుండా చూసే విధంగా కార్యక్రమాలను అమలు చేయడం, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అవసరమైన   పరిశోధన సాగించడం,  యువత  ఉపాధి, శ్రేయస్సు లక్ష్యంగా  వ్యవస్థాపకత మరియు వినోద ప్రాజెక్టులను వారికి అందుబాటులోకి తేవడం, ఉమ్మడి ఆర్థిక మరియు వినూత్న  కార్యక్రమాలను ప్రోత్సహించడం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యువజన  కార్యకలాపాలకు పరస్పర సహకారం అందించే కోవాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. 

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల  మధ్య పరస్పర విశ్వాసం స్నేహపూర్వక సంబంధాలు, సహకారాన్ని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.  షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్   సభ్య దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచే అంశంలో  యువత పాత్ర గుర్తించి, దానికి తగినంత ప్రాధాన్యత కల్పించి,  అంతర్జాతీయ అనుభవం ఆధారంగా యువత మధ్య సహకారం పెంపొందేందుకు అవసరమైన  పరిస్థితులను మరింత మెరుగుపరచాలని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలు నిర్ణయించాయి. 

***


(Release ID: 1833916) Visitor Counter : 136