ప్రధాన మంత్రి కార్యాలయం
నాగాలాండ్ నుంచి వచ్చిన విద్యార్థినుల ప్రతినిధి వర్గాని కి ప్రధాన మంత్రిలోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసం లో ఆతిథ్యం ఇచ్చారు
ప్రతినిధివర్గం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం లో భాగం గా దిల్లీ నిసందర్శిస్తోంది
ప్రతినిధి వర్గం తో ప్రధాన మంత్రి అరమరికలకు తావు ఇవ్వకుండా మాట్లాడారు
విద్యార్థినులు ఈశాన్య ప్రాంతం పై ప్రధాన మంత్రి దృష్టి కోణం, నాగాలాండ్ లో ఆయన కు ఎదురైన అనుభూతులు, యోగ యొక్క ప్రాముఖ్యం వంటి అనేకవిధాలైన అంశాల ను గురించి చర్చించారు
Posted On:
09 JUN 2022 8:54PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న తన నివాసం లో నాగాలాండ్ కు చెందిన విద్యార్థినుల తో కూడిన ఒక ప్రతినిధి వర్గాని కి ఈ రోజు న ఆతిథేయి గా వ్యవహరించారు. ప్రతినిధి వర్గం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం లో భాగం గా దిల్లీ ని సందర్శిస్తున్నది.
ప్రధాన మంత్రి తో సమావేశం అయినందుకు విద్యార్థినులు వారి ప్రసన్నత ను వ్యక్తం చేశారు. అరమరికల కు తావు లేనటువంటి సంభాషణ లో, వారు ఈశాన్య ప్రాంతం విషయం లో ప్రధాన మంత్రి యొక్క దృష్టి కోణం ఎలా ఉందీ, నాగాలాండ్ లో ఆయన కు ఎదురైన అనుభవాలు ఏమేమిటి, యోగ యొక్క ప్రాముఖ్యం మొదలైన అనేక అంశాల పై చర్చ జరపడం తో పాటు ఆయా అంశాలపై ప్రధాన మంత్రి అభిప్రాయాల ను తెలియ జేయవలసింది గా అభ్యర్థించారు.
సంభాషణ సాగిన క్రమం లో, విద్యార్థినులు దిల్లీ లో వివిధ పర్యటన స్థలాల ను సందర్శించినప్పుడు వారికి కలిగిన అనుభూతి ని గురించి ప్రధాన మంత్రి అడిగి తెలుసుకున్నారు. దిల్లీ లో ఉన్న కాలం లో ‘పిఎమ్ సంగ్రహాలయ’ ను మరియు జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించండి అంటూ ప్రధాన మంత్రి విద్యార్థినుల కు సలహా ఇచ్చారు.
ప్రధాన మంత్రి తో ప్రతినిధి వర్గం యొక్క సమావేశాన్ని మహిళల జాతీయ సంఘం (ఎన్ సిడబ్ల్యు) ఏర్పాటు చేసింది.
***
(Release ID: 1832975)
Visitor Counter : 178
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam