మంత్రిమండలి

పరిశ్రమలు మరియు అధునాతనసాంకేతికత ల రంగం లో సహకారం అనే విషయం లో భారతదేశానికి మరియు యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ (యుఎఇ) కి మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 08 JUN 2022 5:03PM by PIB Hyderabad

పరిశ్రమలు మరియు అధునాతన సాంకేతికత ల రంగం లో సహకారం అనే విషయం లో భారతదేశానికి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కి మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం పై సంతకాలు చేసే ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

భారతదేశం, యుఎఇ ల మధ్య వృద్ధి చెందుతున్న ఆర్థిక సంబంధాలు మరియు వాణిజ్య సంబంధాలు ఇరు దేశాల మధ్య గాఢతరం అవుతున్న ద్వైపాక్షిక సంబంధం లో స్థిరత్వానికి మరియు శరవేగం గా వివిధీకరణ కు లోను కావడానికి తోడ్పడుతున్నాయి. భారతదేశం, యుఎఇ ల మధ్య ద్వైపాక్షిక వ్యాపారం విలువ ను ప్రతి ఒక్క సంవత్సరానికి 180 మిలియన్ యుఎస్ డాలర్ (1373 కోట్ల రూపాయలు) గా 1970వ దశకం లో లెక్కగట్టడం జరిగింది. అది 60 బిలియన్ యుఎస్ డాలర్ (4.57 లక్షల కోట్ల రూపాయల) కు పెరిగింది. దీనితో యుఎఇ 2019-20 సంవత్సరం లో భారతదేశం యొక్క మూడో అతి పెద్ద వ్యాపార భాగస్వామి గా మారింది. చైనా ఒకటో స్థానం లో, యుఎస్ రెండో స్థానం లో నిలచాయి. పైపెచ్చు, యుఎఇ 2019-2020 సంవత్సరానికి గాను 29 బిలియన్ యుఎస్ డాలర్ (2.21 లక్షల కోట్ల రూపాయల) ఎగుమతుల విలువ తో యుఎస్ తరువాత భారతదేశం యొక్క రెండో అతి పెద్ద ఎగుమతిదారు గా ఉన్నది. యుఎఇ 18 బిలియన్ యుఎస్ డాలర్ (1.37 లక్షల కోట్ల రూపాయల) విలువైన అంచనా పెట్టుబడుల తో భారతదేశం లో ఎనిమిదో అతి పెద్ద ఇన్వెస్టర్ గా ఉంది. యుఎఇ లో భారతదేశం పెట్టుబడులు దాదాపు గా 85 బిలియన్ డాలర్ (6.48 లక్షల కోట్ల రూపాయల) మేరకు ఉంటాయని ఒక అంచనా.

భారతదేశం మరియు యుఎఇ ఒక ద్వైపాక్షిక ‘‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) పై 2022 ఫిబ్రవరి 18వ తేదీ నాడు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందానికి భారతదేశం మరియు యుఎఇ ల మధ్య వ్యాపారాన్ని 60 బిలియన్ యుఎస్ డాలర్ (4.57 లక్షల కోట్ల రూపాయల) స్థాయి నుంచి రాబోయే అయిదు సంవత్సరాల లో 100 బిలియన్ యుఎస్ డాలర్ (7.63 లక్షల కోట్ల రూపాయల) కు పెంపొందించే సత్తా ఉంది.

దిగువ న పేర్కొన్న రంగాల లో పరస్పర లబ్ధి ఆధారం గా సహకరించుకోవాలని ఎమ్ఒయు లో పేర్కొనడం జరిగింది:

. పరిశ్రమల సరఫరా వ్యవస్థ సంబంధి ప్రతిఘాతుకత్వాన్ని బలోపేతం చేయడం

. నవీకరణ యోగ్యమైన మరియు శక్తి పరమైన సామర్థ్యం

. ఆరోగ్యం మరియు లైఫ్ సైన్సెస్

. అంతరిక్ష వ్యవస్థ లు

. ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్

. ఇండస్ట్రీ 4.0 ఇనేబ్లింగ్ టెక్నాలజీస్

. ప్రమాణీకరణం, తూనికల కు మరియు కొలతల కు సంబంధించిన శాస్త్రం, అనుగుణ్యత నిర్ధారణ, ప్రాతినిధ్యం, మరియు హలాల్ అంగీకారముద్ర.

పరిశ్రమల లో కీలకమైనటువంటి సాంకేతిక పరి జ్ఞ‌ానాన్ని ప్రవేశపెట్టడం ద్వారాను, సాంకేతికత బదలాయింపు ద్వారాను మరియు పెట్టబడుల ద్వారాను రెండు దేశాల లో పరిశ్రమల ను పటిష్టపరచడం తో పాటు గా పరిశ్రమల ను అభివృద్ధిపరచాలన్నది ఈ ఎమ్ఒయు ముఖ్యోద్దేశ్యం గా ఉంది.

పరస్పర హితం ముడిపడ్డ అన్ని రంగాల లో, మరీ ముఖ్యం గా నవీకరణ యోగ్య శక్తి, ఆర్టిషిశల్ ఇంటెలిజెన్స్, ఆరోగ్యం మరియు లైఫ్ సైన్స్, ఇంకా ఇండస్ట్రీ ఇనేబ్లింగ్ టెక్నాలజీస్ రంగాలలో పరిశోధన, నూతన ఆవిష్కరణ లు అధికం కావడానికి బాట ఏర్పడుతుంది. ఇది ఆయా రంగాల లో వృద్ధి కి, దేశీయ ఉత్పత్తి పెరుగుదల కు, ఎగుమతులు అధికం కావడానికి మరియు దిగుమతులు తగ్గడానికి దారితీయగలదు.

ఈ ఎమ్ఒయు పై సంతకాలు జరిగితే భారతదేశాన్ని ఒక స్వయంసమృద్ధి కలిగిన దేశం గా రూపొందించాలని గౌరవనీయులైన భారతదేశ ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు నకు అనుగుణం గా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడం లో తోడ్పాటు లభిస్తుంది.

 

***



(Release ID: 1832246) Visitor Counter : 187