ప్రధాన మంత్రి కార్యాలయం

‘హెల్థీ ఇండియా కు 8 సంవత్సరాలు’ వివరాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి


‘‘ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అనేది ‘న్యూ ఇండియా’ యొక్క ప్రతిన’’

‘‘రాబోయే సంవత్సరాలు ఆరోగ్య సంరక్షణ పై శ్రద్ధ చూపిన వారివే’’

Posted On: 08 JUN 2022 1:56PM by PIB Hyderabad

గడచిన 8 సంవత్సరాల కాలం లో భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలపరచడాని కి తీసుకొన్న చర్యల వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రతి ఒక్కరి కి ఆరోగ్యకరమైన జీవనం అనేదే న్యూ ఇండియాయొక్క దృఢ సంకల్పం గా ఉంది. ఆయుష్మాన్ భారత్ మొదలుకొని జన్ ఔషధీ కేంద్రాల వరకు, వైద్య రంగం లో మౌలిక సదుపాయాలు మొదలుకొని దేశ ప్రజల కు ఉచితం గా టీకా మందు ను ఇప్పించడం వరకు చూస్తే దేశం ఏదైతే మార్గం లో సాగాలని నిర్ణయించుకొందో, అది ప్రస్తుతం యావత్తు ప్రపంచాని కి ఒక ఉదాహరణ గా మారింది. #8YearsOfHealthyIndia”

‘‘రాబోయే కాలం ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ధ వహించిన వారిదే.

భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలపరచడం కోసం మా ప్రభుత్వం చేపట్టిన కార్యాల ను చూస్తే నాకు గర్వం గా ఉంది. #8YearsOfHealthyIndia”

ఆరోగ్య సంరక్షణ అనేది మన ప్రత్యేక శ్రద్ధ అవసరమైన రంగాల లో ఒక రంగం గా ఉంది. గత ఎనిమిదేళ్ళ లో ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల ను కల్పించడాన్ని వృద్ధి చేయడం, భారతదేశం లో ప్రతి ఒక్కరి కి తక్కువ ఖర్చు తో కూడినటువంటి మరియు నాణ్యమైనటువంటి ఆరోగ్య సంరక్షణ కు పూచీ పడడం, మరి అదే విధం గా ఈ రంగం తో సాంకేతిక విజ్ఞానాన్ని ముడిపెట్టడం జరిగాయి. #8YearsOfHealthyIndia’’

 

అని పేర్కొన్నారు.

*******

DS/ST

 

 

 

 



(Release ID: 1832144) Visitor Counter : 146