ప్రధాన మంత్రి కార్యాలయం

‘8సంవత్సరాల సుపరిపాలన’ తాలూకు ముఖ్యాంశాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 04 JUN 2022 2:46PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గడచిన 8 సంవత్సరాల లో దేశ పాలన లో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, సంస్కరణల ను గురించి తన వెబ్ సైట్ (narendramodi.in) లో నుంచి మరియు MyGov నుంచి వ్యాసాలను మరియు ట్వీట్ లను శేర్ చేశారు. ఈ వ్యాసాలు మరియు ట్వీట్ ల మాలిక, ఆత్మనిర్భర్ భారత్ యొక్క విభిన్న పార్శ్వాలు, పరిపాలన లో ప్రజల కు కేంద్ర స్థానాన్ని ఇవ్వడం మరియు మానవీయ దృష్టికోణం, రక్షణ రంగం లో సంస్కరణలతో పాటు పేదల అనుకూల పాలన కు ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రయాసల కు సంబంధించినవి.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘130 కోట్ల మంది భారతీయులు వారు భారతదేశాన్ని ఆత్మనిర్భరత కలిగింది గా తీర్చిదిద్దుతాం అంటూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆత్మనిర్భరత పట్ల మా శ్రద్ధ ప్రపంచ సమృద్ధి కి తోడ్పాటు ను అందించాలనే దృష్టికోణం తో ప్రేరణ ను పొందింది. #8YearsOfSushasan’’

‘‘మాది భారతదేశం లో ప్రతి ఒక్కరి సంరక్షణ పైనా శ్రద్ధ వహించే ప్రభుత్వం. మేం ప్రజల ను కేంద్ర స్థానం లో నిలపాలనే మరియు మానవీయ దృష్టికోణం నుంచి ప్రేరణ ను పొందిన టువంటి వారం. #8YearsOfSushasan”

‘‘నమో ఏప్ లోని ఈ వ్యాసం స్వదేశీకరణ పట్ల శ్రద్ధ తీసుకోవడం, డిఫెన్స్ కారిడర్ ను నిర్మించడం, రక్షణ సంబంధి ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం తో పాటు గా రక్షణ రంగం లో చోటు చేసుకొన్న సంస్కరణల క్రమాన్ని ప్రముఖం గా పేర్కొంటుంది. #8YearsOfSushasan”

‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్’’ అనే మంత్రం తో ప్రేరణ ను పొంది మా ప్రభుత్వం ప్రజానుకూల పాలన కు పుష్టి ని ఇవ్వడం కోసం అనేక ప్రయాసలు చేసింది. ఆ ప్రయాస లు పేదల కు, యువత కు, రైతుల కు, మహిళల కు మరియు మోసానికి గురైన సముదాయానికి సాయపడుతున్నాయి. #8YearsOfSushasan” అని పేర్కొన్నారు.

 

DS/ST

 



(Release ID: 1831546) Visitor Counter : 161