ప్రధాన మంత్రి కార్యాలయం

ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఐకానిక్ వీక్ వేడుకల ను  ప్రారంభించినప్రధాన మంత్రి

పరపతి తో ముడిపెట్టిన ప్రభుత్వ పథకాల కోసం ఒక జాతీయ పోర్టల్  - ‘జన్ సమర్థ్ పోర్టల్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

‘‘ఇది మన స్వాతంత్య్ర యోధుల కలల కు ఒక కొత్త శక్తి ని ఇచ్చి, మరి మనం కొత్త ప్రతిజ్ఞల ను పూనవలసిన ఘడియ’’

‘‘ప్రజల ప్రాతినిధ్యం పెరగడం దేశాభివృద్ధి కి ప్రేరణ ను, నిరుపేదల కుసాధికారత ను ఇచ్చింది’’

‘‘లేకుండాచేసే మనస్తత్వం నుంచి బయటపడి పెద్ద పెద్ద కలల ను కనేందుకు పౌరుల లో ఒక సరికొత్తఆత్మవిశ్వాసం ఏర్పడడాన్ని మనం గమనిస్తున్నాం’’

‘‘ప్రజలను కేంద్ర స్థానం లో నిలిపిన పరిపాలన వైఖరి తో 21వ శతాబ్దాని కి చెందిన భారతదేశం ముందుకు సాగిపోతోంది’’

‘‘మనం ఎప్పుడైతే సంస్కరణల శక్తి, సరళీకరణంమరియు సౌలభ్యం ల యొక్క శక్తి తో ముందుకు సాగుతామో, మనం సౌకర్యం తాలూకు ఒక కొత్తస్థాయి ని సంపాదించుకొంటాం అన్నమాట’’

‘‘ప్రపంచం మనకేసి ఆశ తో, విశ్వాసం తో చూస్తున్నది; మన వద్ద ఒక సమర్ధమైనటువంటి, మేలు మలుపు ను తీసుకు వచ్చేటటువంటి, సృజన శీలమైనటువంటి మరియు వినూత్నమైనటువంటిఇకోసిస్టమ్ ఉండడమే దీనికి కారణం’’

‘‘భారతదేశం లో సామాన్య పౌరుల జ్ఞానం పట్లమేం నమ్మకాన్ని ఉంచాం.  వృద్ధి లో వివేకం కలిగిన భాగస్వాములు గా ప్రజల ను మేంప్రోత్సహించాం’’

Posted On: 06 JUN 2022 12:09PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఐకానిక్ వీక్ ఉత్సవాల ను ప్రారంభించారు. ఈ వారాన్ని 2022 జూన్ 6వ తేదీ మొదలుకొని 11వ తేదీ మధ్య కాలం లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (ఎకెఎఎమ్) లో భాగం గా నిర్వహిస్తున్నారు. పరపతి తో ముడిపెట్టిన ప్రభుత్వ పథకాల తాలూకు ఒక జాతీయ పోర్టల్ అయిన జన్ సమర్ధ్ పోర్టల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. గడచిన 8 సంవత్సరాల లో రెండు మంత్రిత్వ శాఖల ప్రస్థానాన్ని కళ్ళకు కట్టే ఒక డిజిటల్ ఎగ్జిబిశన్ ను కూడా ఆయన ప్రారంభించారు. అంతేకాక ఒక రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు మరియు 20 రూపాయల ప్రత్యేక శ్రేణి నాణేల ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు. ఈ ప్రత్యేక శ్రేణి నాణేలు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ తాలూకు ఇతివృత్తం తో కూడిన ఒక గుర్తింపు చిహ్నాన్ని కలిగి ఉంటాయి. మరి ఇవి దృశ్య జ్ఞానం లోపించిన వ్యక్తులు సైతం వీటిని ఇట్టే గుర్తుపట్టేవి గా ఉంటాయి.

 

ప్రధాన మంత్రి సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, స్వాతంత్య్రం కోసం అంటూ జరిగిన దీర్ఘకాలిక పోరాటం లో ఎవరు పాల్గొన్నప్పటికీ వారంతా ఈ ఉద్యమాని కి ఒక భిన్న పార్శ్వాన్ని జత చేస్తూ వచ్చి, మరి దీని యొక్క శక్తి ని వృద్ధి చెందింప చేశారన్నారు. కొంత మంది సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తే, మరికొంత మంది ఆయుధాల బాట ను ఎంచుకొన్నారు; కొందరు మతం మరియు ఆధ్యాత్మికత పథం లో వెళితే, మరికొందరు స్వాతంత్య్ర జ్వాల ప్రకాశవంతం గా మండుతూ ఉండేందుకు మేధస్సు పరం గా సాయపడ్డారు. మరి ఈ రోజు అటువంటి వారందరికీ మనం గుర్తింపు ను ఇస్తున్న రోజు అని ప్రధాన మంత్రి అన్నారు.

 

నేటి రోజు న ఎప్పుడైతే మనం స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకొంటున్నామో ఈ వేళ లో దేశం యొక్క అభివృద్ధి కి గాను ప్రతి ఒక్క వ్యక్తి వారి వారి సొంత స్థాయిల లో ఒక ప్రత్యేకమైనటువంటి తోడ్పాటును అందించడం అనేది వారి యొక్క కర్తవ్యంగా ఉంది. ఇది మన స్వాతంత్య్ర యోధులు కన్న కలల ను సాకారం చేయడం కోసం ఒక కొత్త శక్తి ని జోడించేటటువంటి సందర్భమే కాకుండా మనం కొత్త ప్రతిజ్ఞల ను తీసుకోవలసినటువంటి సందర్భం కూడాను అని ప్రధాన మంత్రి అన్నారు.

గత ఎనిమిది సంవత్సరాల లో భిన్నమైన పార్శ్వాల పట్ల సైతం భారతదేశం కృషి చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కాలం లో దేశం లో సార్వజనిక భాగస్వామ్యం అధికం అయ్యి దేశాభివృద్ధి కి ఉత్తేజాన్ని ఇచ్చింది. అంతేకాకుండా, దేశం లో నిరుపేద వ్యక్తుల కు సాధికారిత ను కట్టబెట్టింది అని ఆయన చెప్పారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్ అనేది పేదలు గౌరవం గా జీవించడాని కి ఒక అవకాశాన్ని ఇచ్చింది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. పక్కా ఇళ్ళు, విద్యుత్తు, గ్యాస్ , నీరు మరియు ఉచిత చికిత్స ల వంటి సౌకర్యాలు పేదల గౌరవాన్ని పెంచడం తో పాటు సదుపాయాల ను కూడా మెరుగు పరచాయన్నారు. కరోనా కాలం లో ఉచితం గా ఆహార పదార్థాల ను పంపిణీ చేసిన పథకం 80 కోట్ల మంది కి పైగా ప్రజల ను ఆకలి తాలూకు భయం నుంచి విముక్తం చేసింది అని ఆయన చెప్పారు. ‘‘కొరత తాలూకు మనస్తత్వం నుంచి బయటపడి పెద్ద పెద్ద కలలు కనడాని కి పౌరుల లో ప్రస్తుతం ఒక కొత్త ఆత్మవిశ్వాసం జతపడడాన్ని మనం గమనిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

 

గతం లో ప్రభుత్వమే కేంద్ర స్థానం లో ఉంటూ వచ్చినటువంటి పాలన తాలూకు ప్రారబ్దాన్ని దేశం అనుభవించింది అని ప్రధాన మంత్రి అన్నారు. అయితే, ఈ రోజు న 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం ప్రజల ను కేంద్ర స్థానం లో నిలిపిన పాలన తాలూకు వైఖరి అండగా ముందంజ వేస్తోంది అని ఆయన అన్నారు. ఇంతకు మునుపు పథకాల తాలూకు ప్రయోజనాన్ని పొందడం కోసం ప్రజలు ప్రభుత్వం వద్దకు వెళ్ళవలసి వచ్చేది అని ఆయన చెప్పారు. ప్రస్తుతం పాలన ను ప్రజల వద్ద కు తీసుకు వెళ్ళి మరి వేరు వేరు మంత్రిత్వ శాఖ లు మరియు వెబ్ సైట్ ల చుట్టూ తిరగవలసిన అగత్యం బారి నుంచి వారిని విముక్తం చేయడం పైన శ్రద్ధ వహించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి వివరించారు. జన్ సమర్ధ్ పోర్టల్పేరు తో పరపతి ని ముడి పెట్టిన ప్రభుత్వ పథకాల కోసం ఒక జాతీయ పోర్టల్ ను ప్రారంభించడం అనేది ఈ దిశ లో పడిన ఒక ప్రధానమైనటువంటి అడుగు. ఈ పోర్టల్ విద్యార్థుల జీవితాల ను, రైతు ల , వ్యాపారస్తుల, ఎమ్ఎస్ఎమ్ఇ నవ పారిశ్రామికవేత్త ల జీవితాల ను మెరుగు పరచి వారు వారి కలల ను నెరవేర్చుకోవడం లో సాయపడుతుంది అని కూడా ఆయన చెప్పారు.

ఏ సంస్కరణ అయినప్పటికీ, దాని తాలూకు ఉద్దేశ్యాలు మరియు లక్ష్యాలు స్పష్టమైనవి గా ఉండి ఆ సంస్కరణ అమలు లో గంభీరత్వం చోటు చేసుకొందీ అంటే అటువంటప్పుడు సత్ఫలితాలు రావడం ఖాయం అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన ఎనిమిది సంవత్సరాల లో దేశం అమలుపరచిన సంస్కరణల కు కేంద్ర స్థానం లో మన దేశ యువత ను నిలబెట్టడం జరిగింది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇది వారి యొక్క సామర్ధ్యాన్ని చాటుకోవడం లో తోడ్పడగలుగుతుంది అని ఆయన అన్నారు. మన యువతీ యువకులు వారు కోరుకొన్న కంపెనీ ని ఇట్టే ప్రారంభించవచ్చును. వారు వారి యొక్క వ్యాపార సంస్థల ను సులభం గా మొదలు పెట్టుకోవచ్చును. మరి వారు వాటిని అంతే సులభం గా నిర్వహించుకోవచ్చును. అందువల్ల 30 వేల కు పైగా నియమాల ను తగ్గించడం ద్వారా, 1500 కు పైగా చట్టాల ను రద్దు చేయడం ద్వారా మరియు కంపెనీల చట్టం లో అనేక నిబంధనల ను డీక్రిమినలైజ్ చేయడం ద్వారా మేం భారతీయ కంపెనీ లు ముందంజ వేసేలాగానే కాక సరికొత్త శిఖరాల ను అందుకొనేటట్లు కూడా పూచీపడ్డాం అని ఆయన అన్నారు.

 

సంస్కరణల లో ప్రభుత్వం సరళీకరణం పైన దృష్టి సారించింది అని ప్రధాన మంత్రి అన్నారు. కేంద్రం లో మరియు రాష్ట్రాల లో ఉన్న అనేక పన్నుల స్థానం లో ప్రస్తుతం జిఎస్ టి వచ్చింది. దేశం సైతం ఈ సరళీకరణ యొక్క ఫలితాన్ని గమనిస్తున్నది. ప్రస్తుతం జిఎస్ టి వసూళ్ళు ప్రతి నెల లక్ష కోట్ల రూపాయల స్థాయి ని మించడం అనేది పరిపాటి గా మారిపోయింది అని ఆయన అన్నారు. జిఇఎమ్ పోర్టల్ ప్రభుత్వం లో కొనుగోళ్ళ కు సరికొత్త సౌలభ్యాన్ని తీసుకు వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాని కి విక్రయించడం చాలా సులభం అయిపోయింది. ఈ పోర్టల్ ద్వారా కొనుగోళ్ళు ఒక లక్ష కోట్ల స్థాయి ని మించాయి అని ప్రధాన మంత్రి తెలిపారు. వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం కొని తెస్తున్న పోర్టల్స్ ను గురించి ఆయన ప్రస్తావించారు. పెట్టుబడి అవకాశాల కు సంబంధించిన అవసరమైన సమాచారం కోసం ఇన్ వెస్ట్ ఇండియా పోర్టల్, వ్యాపార పరమైన లాంఛనాల కు సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ ఉన్నాయి అని ఆయన వివరించారు. ‘ఇదే శ్రేణి లో ఈ జన సమర్థ్ పోర్టల్దేశం లో యువత కు మరియు స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ కు సహాయకారి కానుంది’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘ప్రస్తుతం ఎప్పుడైతే మనం సంస్కరణ లు, సరళీకరరణం మరియు సౌలభ్యం ల అండ దండల తో సాగుతున్నామో మనం సౌకర్యం యొక్క ఒక కొత్త స్థాయి ని దక్కించుకొంటాం.. భారతదేశం గనుక ఏదైనా చేయాలి అని సామూహికం గా నిర్ణయం తీసుకొంది అంటే అప్పుడు ప్రపంచాని కి ఒక కొత్త ఆశాకిరణం గా భారతదేశం మారగలుగుతుంది అని మనం గత 8 ఏళ్ళ లో నిరూపించాం. ప్రస్తుతం ప్రపంచం మనకేసి ఒక పెద్ద వినియోగదారు బజారు గా చూడడం మాత్రమే కాదు, ఒక సమర్ధమైనటువంటి, మేలు మలుపు ను తెచ్చేటటువంటి, సృజన శీలమైనటువంటి, వినూత్నం అయినటువంటి ఇకోసిస్టమ్ లా ఆశ తో, విశ్వాసం తో చూస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

సమస్యల ను భారతదేశం పరిష్కరించాలి అని ప్రపంచం లో ఒక విశాలమైన భాగం ఆశ పెట్టుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు. గత 8 సంవత్సరాల లో భారతదేశం లో సామాన్య మానవుల జ్ఞానం పై మనం నమ్మకం ఉంచినందువల్ల ఇది సాధ్యపడింది అని ఆయన పేర్కొన్నారు. ‘‘వృద్ధి లో తెలివైన భాగస్వాములు కండి అంటూ ప్రజల ను మేం ప్రోత్సహించాం. యుపిఐ ఆదరణ కు నోచుకొన్న విషక్ష్న్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ సుపరిపాలన కోసం ఉపయోగించే సాంకేతిక విజ్ఞానం ఏది అయినప్పటికీ దాని ని ప్రజలు ఆమోదించడం ఒక్కటే కాకుండా దాని ని వారు ప్రశంసిస్తారు అని కూడా మేం పదే పదే కనుగొంటూ వస్తున్నాం’’ అన్నారు.

***

DS/AK

 

 

 



(Release ID: 1831543) Visitor Counter : 212