యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా శ్రీ కిరణ్ రిజిజు, శ్రీ మన్సుఖ్ మాండవియా, శ్రీమతి మీనాక్షి లేఖితో కలిసి దేశవ్యాప్తంగా కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్ర క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్


ఫిట్ ఇండియా ఉద్యమం, ఖేలో ఇండియా ఉద్యమం, క్లీన్ ఇండియా ఉద్యమం, హెల్తీ ఇండియా ఉద్యమం అన్నింటినీ సైకిల్ తొక్కడం ద్వారా సాధించవచ్చు: శ్రీ అనురాగ్ ఠాకూర్

మంత్రులు, ఎంపీలు, 750 మంది యువ సైక్లిస్టులతో కలిసి 7.5 కి.మీ సైకిల్ తొక్కిన శ్రీ అనురాగ్ ఠాకూర్

75 దిగ్గజ ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ప్రదేశాలలో సైకిల్ ర్యాలీలను నిర్వహించిన నెహ్రు యువ కేంద్ర సంఘటన

Posted On: 03 JUN 2022 2:21PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలను న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా, విదేశీ వ్యవహారాలు, సంస్కృతిక శాఖ సహాయ మంత్రి  శ్రీమతి మీనాక్షి లేఖి. మాజీ ఆరోగ్య మంత్రి, ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్, ఎంపీలు శ్రీ మనోజ్ తివారీ, శ్రీ రమేష్ బిధూరి, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, క్రీడా కార్యదర్శి శ్రీమతి సుజాతా చతుర్వేది, మంత్రిత్వ శాఖలోని ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

   

ధ్యాన్ చంద్ స్టేడియం నుండి బయలుదేరిన సైకిల్ ర్యాలీకి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మంత్రులు, ఎంపీలు ర్యాలీలో పాల్గొన్నారు. ఢిల్లీలో 7.5 కిలోమీటర్ల ర్యాలీలో 1500 మందికి పైగా పాల్గొన్నారు. ఇంకా, నెహ్రు యువ కేంద్ర సంఘటన్ (ఎన్వైకేఎస్) దేశవ్యాప్తంగా 75 దిగ్గజ ప్రదేశాలతో సహా 35 రాష్ట్రాలు/యుటిల రాజధానిలో 100 కంటే ఎక్కువ ప్రదేశాలలో సైకిల్ ర్యాలీలను నిర్వహించింది. 

.

సైకిల్ ర్యాలీ ప్రారంభోత్సవానికి ముందు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ, భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్నందున, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సైకిల్ ర్యాలీలను నిర్వహించేందుకు ఒక విశిష్ట కార్యక్రమంగా తీసుకుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఆరోగ్యకరమైన భారతదేశం ఆవిష్కృతం అవ్వాలని, శారీరక దృఢత్వం కోసం ప్రజలు తమ దైనందిన జీవితంలో సైక్లింగ్‌ను స్వీకరించేలా ప్రేరేపించడం ఈ కార్యక్రమం లక్ష్యం అని  అన్నారు. 

 

“దేశ ప్రజలు ఫిట్‌నెస్ క్యాంపెయిన్‌లో పాల్గొనాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విశ్వసిస్తున్నారు. ఫిట్ ఇండియా ప్రచారంలో సైక్లింగ్ అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కడాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని స్పష్టమైన సందేశం ఇస్తున్నాం. సైక్లింగ్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు స్వచ్ఛ భారత్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది" అని శ్రీ ఠాకూర్ పిలుపునిచ్చారు. 

 

ఫిట్ ఇండియా ఉద్యమం, ఖేలో ఇండియా ఉద్యమం, క్లీన్ ఇండియా ఉద్యమం, హెల్తీ ఇండియా ఉద్యమం అన్నింటినీ సైకిల్ తొక్కడం ద్వారా సాధించవచ్చని శ్రీ ఠాకూర్ తెలిపారు. ఇది కాలుష్య స్థాయిలను కూడా తగ్గిస్తుంది. సైకిల్‌ని ఉపయోగించడం ద్వారా, మనం ఫిట్‌గా ఉండటమే కాకుండా ఫిట్ ఇండియా సందేశాన్ని కూడా అందిస్తాము అని అన్నారు. శ్రీ మన్సుఖ్ మాండవియా, శ్రీ కిరణ్ రిజిజుల ఉదాహరణను ఇస్తూ, ఈ మంత్రులు ఎల్లప్పుడూ సైక్లింగ్‌ను రవాణా పద్ధతిగా ఉపయోగించి స్వయంగా ప్రచారం చేశారని, ఇతరులకు స్ఫూర్తినిచ్చారని శ్రీ ఠాకూర్  ప్రముఖంగా ప్రస్తావించారు. 

 

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్-ఇండియా@75 వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించింది. 12 మార్చి 2021న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కర్టెన్ రైజర్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రారంభ ప్రసంగం నుండి ప్రేరణ పొంది ఈ ఈ కార్యక్రమం చేపట్టారు.  

 

 *******


(Release ID: 1831133) Visitor Counter : 145